Assurances
-
అడక్కుండానే హామీ ఇచ్చి.. అడుక్కునేలా చేస్తున్నారు
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అడక్కుండానే వార్డు, గ్రామ వలంటీర్లకు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా వలంటీర్లను అడుక్కునేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ మండిపడింది. ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సు ఎంబీ భవన్లో మంగళవారం జరిగింది. వివిధ జిల్లాల నుంచి తరలివచి్చన యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వలంటీర్లు ఎవరూ అడగకపోయినా సీఎం చంద్రబాబే వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక మూడు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించకుండా తమ పొట్టకొడుతున్నారని వాపోయారు. ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధుల్లో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అడగకుండానే హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వలంటీర్లను ఏదో ఒక పార్టీ వారిగా ముద్రవేసి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లం కాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించి, నెలవారీ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. రాజీనామా చేసిన వలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వలంటీర్లకు ప్రత్యేక వెయిటేజీ ప్రకటిస్తూ, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మరో తీర్మానం చేశారు.సీఐటీయూ మద్దతు వలంటీర్ల డిమాండ్లకు సీఐటీయూ మద్దతు తెలిపింది. వలంటీర్ల సమస్యల పరిష్కార సాధనలో సీఐటీయూకు అనుబంధంగా యూనియన్ను ఏర్పాటు చేసింది. సీఐటీయూ కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్లను విధుల్లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10 వేల వేతనం చెల్లిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హుమయూన్ బాషా, ఉపాధ్యక్షునిగా వెంకటసుబ్బయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా దీప్తి, కోశాధికారిగా హేమంత్‌ను ఎన్నుకున్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ఆర్వీ నరసింహరావు పాల్గొన్నారు. -
సూపర్–6 అంటే భయమేస్తోంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, ఇతర చెల్లింపుల ఖర్చే అధికంగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఇవిగాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చేయాల్సిన ఖర్చు అదనంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ‘సూపర్–6’ అంటే భయమేస్తోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులపై శుక్రవారం సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు ఆయన ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో రూ.100 ఆదాయం వస్తుంటే వేతనాలు, పెన్షన్లు, అప్పులు, వడ్డీలకు రూ.113 ఖర్చవుతోంది. దీంతో రాష్ట్రాభివృద్ధి, ఇచ్చిన హామీల అమలు ఎలాగో తెలీడంలేదు. ప్రస్తుతం సంపద సృష్టించే మార్గాలు కావాలి. సభ్యులు అలాంటి ఆలోచనలు చేయాలి. ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలి. 2014–19 మధ్య రాష్ట్రాన్ని నేనెంతో గొప్పగా అభివృద్ధి చేస్తే, 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమంపై పెట్టిన ఖర్చు అభివృద్ధిపై పెట్టకపోవడంతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో అంతర్గత రోడ్ల పునర్నిర్మాణం కోసం ‘పబ్లిక్–ప్రైవేట్–పార్ట్నర్షిప్’ (పీపీపీ) విధానాన్ని తెచ్చే యోచన చేయాలి. అందుకు కార్లు, బస్సులు, లారీల వంటి వాహనాల నుంచి ‘టోల్’ వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తే రహదారులు బాగుపడతాయి. మేం ఉంటే 2021కి పోలవరం పూర్తయ్యేది..మా ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే 2021కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడిది ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఇది పూర్తయి ఉంటే రూ.45 వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,185 ఉంటే, విభజన తర్వాత 2014–15లో రూ.93,903కు తగ్గింది. గతంలో మా ప్రభుత్వంలో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేశాం. భోగాపురం కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఏర్పాట్లుచేశాం. అలాగే, పాత పోర్టులు కాకుండా మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం కొత్త పోర్టులను ‘పీపీపీ’ విధానంలో చేపట్టాం. కానీ, గత ప్రభుత్వం పాలసీని మార్చి ఈపీసీ మోడల్ తీసుకొచ్చింది. ఇక వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ)లను అభివృద్ధి చేశాను. అనేక కంపెనీలుం తీసుకొచ్చా. సంక్షేమాన్నీ మరువలేదు. రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచాం. మళ్లీ ఇప్పుడు రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.4 వేలు చేశాం. డ్వాక్రా మహిళల తలసరి ఆదాయం రూ.36 వేల నుంచి రూ.84,670 పెంచాం. అమరావతి ఆదాయాన్ని దెబ్బతీశారు..అనుకున్న ప్రకారం అమరావతి పూర్తయితే ప్రపంచంలో గొప్ప సిటీగా మారేది. కానీ, గత ప్రభుత్వం దాన్ని పూర్తిచేయలేదు. అది జరిగి ఉంటే అమరావతిలో ఇప్పటికి 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. తద్వారా.. రూ.4 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసింది. మళ్లీ అమరావతికి పూర్వవైభవం తెస్తాం. అలాగే, గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేసింది. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336కు పెరిగింది. అదే సమయంలో ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం చేయలేదు. అప్పులు చేసి నిధులు పక్కదారి పట్టించారు. ప్రస్తుతం కాస్తోకూస్తో ఆదాయం ఎక్సైజ్ నుంచి వస్తే అది అప్పులు కట్టడానికి సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం రూ.15 వేల కోట్లు అప్పు ఇస్తామంటే సంబరపడిపోయా. -
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. హామీలు ఇవే...1. పేదలకు ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 2. నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం. 3. ఉచితంగా చికిత్స ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. 5. అగి్నవీర్ యోజన నిలిపివేత అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం. 6. పంటలకు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం. 7. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం. 8. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.9. అవినీతి నుంచి విముక్తి నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్‌ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం. 10. స్వేచ్ఛా వాణిజ్యం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. బీజేపీ కుట్ర విఫలం తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. -
హామీలు అమలు చేస్తే..రాజీనామా చేస్తా..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఖమ్మం: ‘వందరోజుల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి.. మళ్లీ వచ్చే ఆగస్టు 15 తేదీలోగా చేస్తానని రేవంత్‌రెడ్డి నయా నాటకం మొదలుపెట్టిండు. మిస్టర్ రేవంత్‌రెడ్డి ఆగస్టు 15వ తారీఖులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా? నువ్వు పార్టీ రద్దు చేసుకుంటవా అని రేవంత్‌రెడ్డి నన్ను అంటున్నడు. ఖమ్మం నుంచి మళ్లీ చెబుతున్నా. నేను సవాల్‌ను స్వీకరిస్తున్నా.ఇచ్చిన మాట ప్రకారం వడ్డీతో సహా రూ.39వేల కోట్లు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? ఈనెల 26న ఉదయం 10గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వద్దకు వస్తా, నువ్వు రా. అక్కడ బాండ్ పేపర్‌పై రాసి ప్రమాణం చేయి. నువ్వు అమలు చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేస్తా. మళ్లీ పోటీ కూడా చేయను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.బుధవారం సంగారెడ్డిలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి తీరును విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్‌రెడ్డిది పూటకోసారి మాట మార్చడం ఆయన నైజం అన్నారు. రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నారన్నారు.ఆరు గ్యారంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నానని సోనియా సంతకాలతో బాండు పేపర్లు రాయించి పంపిణీ చేశారని. రాహుల్, ప్రియాంకగాం«దీలతో ప్రకటన చేయించారని గుర్తు చేశారు. 120 రోజులు గడుస్తున్నా, హామీలు అమలు చేయకుండా ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మేలా లేక దేవుడిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గార్యంటీల అమలుకు శాసనసభ తొలి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, మడమ తిప్పారని, రూ.2లక్షల రుణమాఫీకి విధివిధానాలనే ఖరారు చేయలేదని, మరోమారు గడువు పెడుతున్న రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న సాయం 4 నెలలుగా ఇవ్వకుండా ఒక్కో మహిళకు రూ.పది వేల బాకీ పడ్డారని, కల్యాణలక్ష్మి లబి్ధదారులకు తులం బంగారం, రైతుభరోసా సాయం ఎకరానికి రూ.15 వేలు, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.4 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎం, సీపీఐ ఎందుకు ఊడిగం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా పార్టీల నేతలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. -
గ్యారంటీల అమలు జాడేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు జాడలేకుండా పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరిట 16 రకాల హామీల ను అమలు చేస్తామని గద్దెనెక్కి.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త గ్యారంటీల నాటకాన్ని ఆడు తోందని దుయ్యబట్టారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ సంకల్పపత్రాన్ని విడుదల చేసిందని వివరించారు. రానున్న ఐదేళ్లలో పేదలు, మహిళలు, యువకులు, రైతుల అభ్యున్నతిపై బీజేపీ దృష్టి సారించిందన్నారు. మరో ఐదేళ్ల పాటు ప్రజలకు ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తామని, తెల్లరేషన్ కార్డు లేని మధ్య తరగతికి చెందిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందిస్తామని వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామని, మహిళలకు 33% రిజర్వేషన్ అందించాలని చట్టం చేశామని చెప్పారు. జనగణన పూర్తయ్యాక దీన్ని అమలుచేస్తామన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ మాదిరిగా వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమన్నారు. బీజేపీ సంకల్ప పత్రంపై మాట్లాడే దమ్ము రాహుల్ గాంధీకి, రేవంత్‌కు లేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఇతర అంశాపై విమర్శించాలన్నారు. నేడు కిషన్‌రెడ్డి రైతు దీక్ష: కాంగ్రెస్ గ్యారంటీలతో రైతులు అన్యాయానికి గురయ్యారని, వారికి న్యాయం చేసేందుకు బీజేపీ కార్యాలయంలో సోమవారం రైతు దీక్ష చేపడతామని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక, అంతకుముందు అన్ని రంగాల్లో దేశం పరిస్థితి ఎలా ఉందనే అంశంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. -
Lok Sabha election 2024: అలవిగాని హామీలు
‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు... బీరు, బంగారం, రూ.10 లక్షలు వనితా రౌత్. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు. కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్ దావూద్ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు! చంద్ర యాత్ర 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ మదురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన శరవణన్ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన. రైతును పెళ్లాడితే.. రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన. బాల్య వివాహాలకు రైట్ రైట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు. మునుగోడును అమెరికా చేస్తా తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన. ప్రపంచవ్యాప్తంగానూ... 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ న్యూ గింగ్రిచ్ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన! ► అవే ఎన్నికల్లో వెర్మిన్ సుప్రీమ్ అనే ఆరి్టస్ట్ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు. ► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు ఏకంగా 822 ఇళ్లన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాబు రాజకీయ వికలాంగుడు
వాకాడు (తిరుపతి జిల్లా) : అబద్ధాల చంద్రబాబు చేతిలో ఎన్నోసార్లు మోసపోయిన ప్రజలు.. అమలుకు సాధ్యం కాని సూపర్ సిక్స్ హామీలిస్తున్న ఆయనను నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వాకాడులో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసి మళ్లీ ధైర్యంగా ఎన్నికలకు వస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, ఊతకర్రలుగా బీజేపీ, జనసేన పార్టీలను పట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నాడని తెలిపారు. రాజకీయాల్లో నిబద్ధత లేకుండా సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, బంగారు రుణాల తొలగింపు, ఇంటికో ఉద్యోగం, ఇస్తామని నిరుద్యోగులను, రైతులను, మహిళలను మోసం చేశారన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కలసి కట్టుగా పనిచేసి మరోసారి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకుందామన్నారు. ఎంపీ గురుమూర్తి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకుంటే ప్రజాఉద్యమమే
కూకట్పల్లి/సుభాష్ నగర్: మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం తాము 100 రోజులపాటు వేచి చూస్తామని, అప్పటికీ హామీలను నెరవేర్చకపోతే ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శనివారం కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంతోపాటు మేడ్చల్–మల్కాజిగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో రైతులు, పట్టణాల్లో ప్రజలు సంతోషంగా లేరని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తగినన్ని బస్సులు లేకుండా పథకం అమలు చేయడం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ పథకం వల్ల ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటివరకు 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓటమితో కుంగిపోవద్దు.. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని... అందుకు కార్యకర్తలు నిరాశ చెంద వద్దని కేటీఆర్ చెప్పారు. స్థానికంగా వార్డు సభ్యుల నుంచి మొదలుకొని ఎంపీల వరకు మనవాళ్లే ఉన్నారని... ఏదైనా సమస్యలుంటే వారిని కలవాలని భరోసా ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ, హైదరాబాద్ హక్కులు, రాష్ట్రాభివృద్ధి కోసం మాట్లాడే ధైర్యం ఒక్క గులాబీ పార్టీకే ఉందని... అందుకే కాంగ్రెస్, బీజేపీలను నమ్మకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్ సతీష్ అరోరా, నిజాంపేట్ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడటానికి సీఎంకు భయమెందుకు? సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ‘తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్’అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తన వ్యాఖ్యలతోపాటు జత చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని నిలదీశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ఎదిరించేది ప్రాంతీయ పార్టీలేదేశంలో బీజేపీని అడ్డుకొనే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ పార్టీలకే ఉందంటూ కేటీఆర్ ‘ఎక్స్’లో మరో పోస్ట్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 300 చోట్ల పోటీచేసినా కాంగ్రెస్‌కు 40 సీట్లు రావడం అనుమానమేనంటూ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నా రు. కాంగ్రెస్ వ్యవహారశైలి వల్లే విపక్ష ఇండి యా కూటమి చెల్లాచెదురవుతోందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె: కేటీఆర్‌తో వృద్ధురాలు కేసీఆర్ పాలనే బాగుండేదని.. పింఛన్ సొమ్ము సకాలంలో వచ్చేదంటూ ఓ వృద్ధురాలు కేటీఆర్‌తో పేర్కొంది. శనివారం కుత్బుల్లాపూర్‌లో జరిగిన కూకట్పల్లి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వారి సంభాషణ సాగింది ఇలా.. వృద్ధురాలు: మాకు కేసీఆర్ ఉన్నపుడే బాగుండె.. టయానికి పింఛన్ ఒస్తుండె. కరెంటు పోకుండా ఉంటుండె. ఇప్పుడు ఊకే కరెంటు పోతాంది. ఈ ప్రభుత్వం తీరు ఏం అర్థమైతలే.. మాకు కేసీఆరే బాగుండే.. మళ్లీ ఆయన వస్తేనే మంచిగుంటది. కేటీఆర్: మళ్లీ అదే పాలనను తప్పకుండా తెచ్చుకుందాం. ఇప్పు డు ‘విడాకులు’ కావాల్నంటే ఐదేళ్లు ఓపిక పట్టాలి అమ్మా. -
పిట్టల దొర!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలివ్వడం ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను వంచించడంలో మహా నేర్పరిగా పేరు గాంచిన చంద్రబాబు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూ, ప్రజలను నమ్మించేందుకు మళ్లీ తన విద్యను ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను చెప్పి అమలు చేయలేకపోయిన హామీలనే మళ్లీ ఇప్పుడు కొత్తగా ఇస్తుండడం గమనార్హం. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఇస్తానని ప్రకటించారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. అప్పట్లో రూ.2 వేల భృతి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చివరి వరకు ఆ ఊసే ఎత్తకుండా కాలక్షేపం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఎన్నికలకు 3 నెలల ముందు తూతూమంత్రంగా వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతిని ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకునేందుకు చివర్లో ఇలా నాటకం ఆడారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి మళ్లీ నిరుద్యోగులను మాయ చేసేందుకు చంద్రబాబు నిర్భీతిగా అదే హామీని ఇస్తుండడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇంటికో ఉద్యోగం అని మోసం 2014 ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుకుతున్నారు. ఈ విషయాన్ని కూడా కుప్పంలో ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. 2014లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని ఎందుకు అమలు చేయలేదనే దానికి మాత్రం సమాధానం చెప్పడంలేదు. బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులు, యువతను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను సైతం తొలగించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంతో ప్రజలు ఛీత్కరించారు. 2014 ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలను మాయ చేశారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల రద్దు, రైతులు తాకట్టు పెట్టిన బంగారు రుణాల మాఫీ వంటి అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదు. ఈ హామీలు కనిపించకుండా వెబ్సైట్ నుంచే తొలగించారు. అందుకే ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించి, నమ్మకానికి మరో పేరైన వైఎస్ జగన్‌కు అధికారం ఇచ్చారు. అందువల్లే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా, ఇతరత్రా మేలు చేసే అనేక పథకాలు, కార్యక్రమాలతో చరిత్ర సృష్టించి.. మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. మళ్లీ మోసాల హామీలు చంద్రబాబు మాత్రం తన మోసాలు, అబద్ధాల హామీలు, నయవంచన చరిత్రను మరచిపోయి మళ్లీ అవే హామీలను ఎడాపెడా గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. హామీలను అమలు చేయకుండా చెత్త బుట్టలో వేసి, ప్రజలకు వెన్నుపోటు పొడవడంలోనూ మాస్టర్స్ డిగ్రీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. గతంలో 600 హామీల మేనిఫెస్టోను ప్రజలకు కనపడకుండా దాచేసిన ఆయన ఇప్పుడు మళ్లీ కొత్తగా ముందస్తు మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలకు గేలం వేద్దామని బయలుదేరారు. త్వరలో మళ్లీ ఇంకో మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మాయ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. -
ఓట్.. ఆల్ఔట్..
ముందుగా నాయకుల హామీలపై.. రెండు మాటలు సరదాగా.. అసలే చలికాలం.. ఆపై ఎన్నిక లు.. ఇంకేం గొర్రెల నాయకుడు దండోరా వేయించాడు. మా పాలనలో అన్ని గొర్రెలకు ఉచితంగా కోటు పంపిణీ చేస్తానని. అన్ని గొర్రెలు ఖుషీగా పండుగ చేసుకున్నాయి. ఇలాంటి నాయకుడు దొ రకడం తమ అదృష్టమని పాలాభిషేకాలూ గట్రాలూ చేశాయి. అందులో కాసింత అమాయకంగా, అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న గొర్రెకు రాకూడని డౌట్ వచ్చింది..అడగకూడని ప్రశ్న ఆ నాయకుడిని అడిగింది. ‘మేం ఇంతమందిమి ఉన్నాం కదా.. అందరికీ అంత ఉన్ని ఎక్కడనుంచి తెస్తారూ ’.. అని. ‘‘ ఇంకెక్కడనుంచి గొర్రెల నుంచే తీస్తాం కదా..’’ నాయకుడి సమాధానం. మగదోమ – నీకోసం సింహాన్ని వేటాడి తేనా డియర్ ఆడదోమ – వద్దులే ముందు పడుకో మగదోమ – పోనీ ఐరావతాన్ని కుట్టి నీకు బ్లడ్ బాత్ చేయించనా ఆడదోమ– వద్దు..వద్దు ముందు నిద్రపో, నాకూ నిద్ర వస్తోంది మగదోమ – పోనీ ఇంకా ఏదైనా.... ఆడదోమ– అసలే ఓట్ల టైమ్.. రాజకీయ నా యకులను కుట్టి వచ్చావా ఏంటి... నోరుమూసుకు ని పడుకోకపోతే ఆల్ ఔట్ పెట్టి బయటకు పోతా.. ఇదో సైకాలజీ.. ఇలాంటి జోకులు, కథలు ఎన్నికల టైమ్‌లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇదంతా రాజకీయ నాయకులపై. ఎన్నికలపై, పోలింగ్‌పై వారి అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తుంటాయి. చాలామంది ఓటర్లు ఎన్నికల పట్ల నిరాసక్తంగా, పోలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. వీలుంటే పోలింగ్ తేదీని హాలిడేగా కూడా పరిగణిస్తుంటారు. పొలిటీషియన్లపై , ఎన్నికలపై మంచి అభిప్రాయం క్రమక్రమంగా కనుమరుగవుతోందని పై జోకులు చెబుతూనే ఉంటాయి. ఇలాంటి కథల వెనుక, ఓటు పట్ల నిరాసక్తత వెనుక సైకాలజీ కూడా ఉందట..అమెరికాలోని స్టోనీబ్రూక్, మిన్నెసోటా యూనివర్సిటీల పొలిటికల్ సైన్స్–ఎలక్షన్ సైకాలజీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి ఇలా చెబుతున్నారు.. నిరాసక్త జీవులు.. ♦ జీవితంలో కష్టానష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి సాయం దక్కనివారు ఓటేసేందుకు విముఖతతో ఉంటారు. తమకు లాభం లేదనుకున్నప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయం వారిది. ♦ తోటివారిని పెద్దగా నమ్మనివారు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడతారనే అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంటారట. ♦ పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతోనూ ఓటు వేయకుండా ఉండేవారూ ఎక్కువే. తమకు న చ్చిన అభ్యర్థి ఉన్నప్పుడే ఓటు వేయాలనిపిస్తుందని కొందరు ఓటర్లు ఓ సర్వేలో వెల్లడించారు. ♦ అభ్యర్థుల్లో ఎవరూ మంచివారు లేరని.. చెడ్డవారిలో ఎక్కువ, తక్కువ అంటూ ఎవరూ ఉండరనే అభిప్రాయంతో ఓటేయడం లేదని చెప్పినవారూ ఎందరో. ♦ కొందరైతే నిత్యం రాజకీయ వార్తలను చూస్తుంటారు. పార్టీలు, అభ్యర్థులపై చర్చలూ చేస్తారు. కానీ ఎన్నికల వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందనే, ఎవరు గెలుస్తారో ముందే తేలిపోయినట్టేననే భావనతో ఓటు వేయరు. ♦ గెలిచినవారు హామీలు నిలబెట్టుకోకపోవడం, డబ్బులున్నవారే గెలుస్తుండటం వంటివి కూడా జనం ఓటింగ్‌పై అనాసక్తికి కారణాలు ♦ ‘రాజకీయాలతో, నేతలతో మనకేం పని, నా పనేదో నాకుంది..’ అనుకునేవారు ఓటేసేందు కు వెళ్లరు. ముఖ్యంగా యువతలో ఇలాంటి భా వన కనిపిస్తుందని.. కెరీర్, చదువు, ఇతర వ్యా పకాల్లో మునిగి ఉండటంతో వారు నిత్యవార్తలకు, రాజకీయాలకు దూరంగా ఉంటుండట మే దీనికి కారణమని అధ్యయనం పేర్కొంది. రాజకీయ జీవులు.. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, రాజకీయాలు–ఎన్నికలు తమ నిత్యజీవితంపై ప్రభావం చూపుతాయన్న అవగాహన ఉన్నవారు క చ్చితంగా ఓటు వేస్తారని.. కొత్త అంశాలు, సంగతులపై ఆసక్తి ఉండేవారు ఓటు వేసే అవకాశాలు ఎక్కువని, దీనికి భిన్నంగా ఉండేవారు దూరంగా ఉంటారని తేల్చింది. నిస్వార్థజీవులు.. ఎప్పుడో అరుదుగా తప్ప మామూలుగా అయితే ఒక ఓటు పడకపోతే, లేక అటూ ఇటూ అయితే వచ్చే తేడా ఏమీ ఉండదనే భావనలో కొందరు ఉండగా, గంటల తరబడి క్యూలో నిలుచుని మరీ ఓటు వేసేవారు కొందరు. మనుషుల్లో ఉండే నిస్వార్థమైన తత్వమే ఇలా ఓటు వేయడానికి కారణమని న్యూయార్క్ యూనివర్సిటీ సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతీయుల బాధ.. ♦ మేం ప్రభుత్వంపై, పథకాలపై ఆధారపడటం లేదనే భావనతో ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు ఓటు వేయడానికి దూరంగా ఉంటున్నాయి. తమకు ఏమైనా అవసరమైతే డబ్బుతోనో, పలుకుబడితోనో చేసుకోగలమనేది వారి భావన. ♦ సొంత ప్రాంతాలను వదిలి వలస వెళ్లినవారు.. కొత్త ప్రాంతాల్లో నేతలు, అభ్యర్థులపై ఆసక్తి లేకుండా ఉండటం, వారాంతాల్లో పోలింగ్ వల్ల ఓటేయడం కంటే వినోదంపై దృష్టిపెట్టడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ♦ భూస్వాములో, నేర చరిత్ర ఉన్నవారో, రాజకీయాలు తెలియని ప్రముఖులో ఎన్నికల బరిలోకి దిగినచోట మధ్యతరగతి, యువత వారిపట్ల ఏహ్యభావంతో ఓటేయడం లేదు. వేరేవారికి వేసినా గెలవరని భావిస్తున్నారు. ♦ రోతగా మారిన రాజకీయాలకు, నేతల అవినీతికి నిరసన అంటూ కొందరు ఓటు వేయకుండా ఉంటున్నారు. ♦ ఓటు ప్రాధాన్యత చాటి చెప్తూ సెలబ్రిటీలతో ఎన్నికల సంఘం చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని.. యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడం లేదని పరిశీలకులు చెప్తున్నారు. అమెరికాలోనూ అంతే.. పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో జనం ఓటేయడంలో బద్ధకస్తులే. అక్కడ పేదలు, యువత, విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారు పెద్దగా ఓటేసేందుకు ముందుకు రావడం లేదని అధ్యయనాల్లో తేలింది. -సరికొండ చలపతి -
CM Jagan: ఇది మన ప్రభుత్వం.. గుర్తుపెట్టుకోండి
సాక్షి, గుంటూరు: ముస్లింలకు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదని.. అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి .. ముస్లిం సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అంతేకాదు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తామని తెలిపారాయన. సోమవారం తాడేపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ‘‘ఇది మనందరి ప్రభుత్వం అనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే ఇవాళ మిమ్నల్ని పిలిచాం. మీరు చెప్పిన అన్ని అంశాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. మీరు చెప్పిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం. అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అలాగే.. దేవుడి దయతో ప్రతి ఇంటికీ, గడపకూ మంచి చేస్తున్నామని, ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం. కచ్చితంగా దాన్ని సాధిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో తమ సమస్యలను సీఎం జగన్‌కు వివరించారు వాళ్లు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు.. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను తెలియజేశారు. ఈ అంశాలన్నింటికీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం జగన్ అధికారులను అదేశించారు. అలాగే.. విజయవాడలోనూ హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేయగా.. అందుకు అవసరమైన భూమి కేటాయించాలని అక్కడికక్కడే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంలో.. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని నిర్ణయించారాయన. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటు ఉండాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి.. ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచేందుకు సైతం సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే.. మదరసాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా.. ఇంగ్లిషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలియజేశారు. సయ్యద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. -
పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు.. ఆయన్ని నిలదీసే పరిస్థితికి చేరుకున్నారు. తమ వాళ్ల పేరిట కుటుంబాలకు ఇచ్చిన భద్రత హామీల అమలు ఏమయ్యిందంటూ, తమకు సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలై తొమ్మిది నెలలు పూర్తైంది. కానీ, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని వాళ్లు సోషల్ మీడియా సాక్షిగా పుతిన్‌ను నిలదీస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో పుతిన్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే కొందరు కుటుంబ సభ్యులు వీడియో పోస్టులు అక్కడి సోషల్ మీడియాలో పెడుతుండడం గమనార్హం. కొన్ని కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. అది ఊహించే ఈ సమావేశానికి వాళ్లను దూరంగా ఉంచారు. కేవలం అధ్యక్షుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు కొన్ని కుటుంబాలను మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించారు అని రష్యా ఉద్యమవేత్త ఓల్గా సుకనోవా అంటున్నారు. ఆమె తన 20 ఏళ్ల కొడుకు ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే.. సమారా నగరం నుంచి వోల్గా నది వెంట 900 కిలోమీటర్లు ప్రయాణించి మరీ క్రెమ్లిన్‌కు చేరుకుంది. అలాగే కొందరు మహిళలు.. పుతిన్ ముందర ఫిర్యాదులు చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడి ఫిర్యాదు చేయలేదని ఆమె అంటున్నారు. అత్యవసరంగా తమ వాళ్లను యుద్ధం రొంపిలోకి దింపిన అధ్యక్షుడు పుతిన్.. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు రష్యా సైనికుల కుటుంబ సభ్యులు. యుద్ధ సమయంలో సైనికుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక అలవెన్సులతో పాటు జీవిత బీమా, పిల్లలకు చదువులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చింది క్రెమ్లిన్. అంతేకాదు యుద్ద కాలంలో వాళ్లతో మాట్లాడించేలా ఏర్పాట్లు కూడా చేయిస్తామని తెలిపింది. కానీ, వాటి విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ యుద్ధం కోసం లక్షల మంది కావాలంటూ ప్రకటన ఇచ్చి.. అన్ని వయస్కుల వాళ్లను బలవంతపు శిక్షణకు ఆదేశించింది. అయితే.. అందులో వృద్ధులు, పిల్లలు సైతం ఉండడంతో నాలుక కర్చుకున్న క్రెమ్లిన్ వర్గాలు.. ప్రకటనలో పొరపాటు దొర్లిందంటూ సవరణ ప్రకటన ఇచ్చాయి. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ఎలా పుట్టిందో తెలుసా? -
వైఎస్ జగన్ హామీపై మహిళల్లో హర్షాతిరేకాలు
-
హామీలు అమలు చేయాలి
– ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి డిమాండ్ తిరుపతి కల్చరల్: కళాకారుల నిరసన దీక్షల సందర్భంగా టీటీడీ అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సమస్యలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగిచారు. తమ సమస్యలు పరిష్కరించాలని కళాకారులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద సామూహిక నిరసన దీక్షలు చేపట్టారన్నారు. కళాకారుల దీక్షలపై టీటీడీ అధికారులు స్పందించి 14 సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారులు హామీ ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల యూనియన్ నాయకులు చంద్రశేఖర్, గంగులప్ప, జి.నాగేంద్రప్రసాద్, ఎల్.రంజిత్, ఎం.రెడ్డెప్ప, జి.చౌడప్ప, కళాకారులు పాల్గొన్నారు. -
హమీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వం
ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ జవహర్‌నగర్ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలుపర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాకళామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించిన ప్రజలకు నిరాశేమిగిలిందన్నారు. పల్లెల్లో బతుకుదెరువులేక ఎంతో మంది వలస వచ్చి జవహర్‌నగర్‌లో నివసిస్తున్నారని వారందరూ కూలినాలీ పనిచేసుకుని పైసాపైసా పోగుచేసుకుని 60 గజాల్లో ఇళ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారందరూ దినదిన గండం నూరేళ్లాయుష్సు అన్నట్లు భయంలో జీనవం సాగిస్తున్నారన్నారు. ఎన్నికలకు మందు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చి అమలు పరచడంలో విఫలమైందన్నారు. జవహర్‌నగర్‌లో జీఓ 58, 59 ప్రకారం అన్ని ఇళ్లను క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రజా కళామండలి ఉపాధ్యక్షుడు రాజనర్సింహ, ప్రధాన కార్యదర్శి కోటి, సహాయకార్యదర్శి నీలకంఠ, కోశాధికారి నాగేశ్వరావులతో పాటు సభ్యులు పాల్గొన్నారు. -
చంద్రన్నా.. ఇవి మీ హామీలేనా!
♦ ఆశల పల్లకీలోనే జిల్లా ప్రజలు ♦ ముందుకు కదలని ముఖ్యమైన హామీలు ♦ రెండేళ్ల కరువుతో పెరుగుతున్న అసహనం రుణ మాఫీని నమ్ముకున్న జిల్లా రైతులు దగా పడ్డారు. వడ్డీ భారం మోయలేకున్నారు. ఇంటికో ఉద్యోగం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, విమానాశ్రయం, తీరప్రాంతంలో పోర్టులు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉద్యోగాలు కలగానే మిగిలారుు. జిల్లాలో వెలిగొండ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులు ముందుకు కదలడంలేదు.రామాయపట్నం పోర్టు, సోమశిల ఉత్తర కాలువ, నిమ్జ్ ఇలా ఆశల పల్లకీ చూపించిన టీడీపీ ఇప్పుడు ఆర్భాటాలతో ఎంజాయ్ చేస్తోంది. - సాక్షి ప్రతినిధి, ఒంగోలు ‘చంద్రన్నా.. నిన్నే నమ్ముకున్నాం.. ఓట్లేశాం. సీఎం పీఠంపై కూర్చోబెట్టాం. అవశేషాంధ్రను ఉద్ధరిస్తారని కలలు కన్నాం. జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తారని ఆశించాం. చాంతాండంత హామీల లిస్టు చూసి సంబరపడ్డాం. మా బతుకులు మారతాయనుకున్నాం. అరుుతే రోజులు గడుస్తున్నాయే కానీ మీరిచ్చిన హామీలు ముందుకు కదలడంలేదు. మాది పేద జిల్లా.. వర్షాభావంతో కొట్టుమిట్టాడే ప్రాంతం. అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటించారు. రెండేళ్లుగా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, డ్వాక్రామహిళలు, పింఛనుదారులు వెత లు పడుతూనే ఉన్నారు. మీరిచ్చిన ముఖ్యమైన 11 హామీలను మరిచారా చంద్రన్నా’ అంటూ జిల్లా ప్రజలు సీఎంను ప్రశ్నిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ ఎక్కడ? ఒంగోలు: జిల్లాకేంద్రంలో ట్రిపుల్ ఐటీ మంజూరు చేస్తామని చెప్పినా అతీగతి లేదు. హైదరాబాద్ స్థాయిలో ఒంగోలులో శిల్పారామం ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా నెరవేరలేదు. వెటర్నరీ.. మైనింగ్ యూనివర్సిటీల ఊసే లేదు. పారిశ్రామిక కారిడార్ అట దర్శి: దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్ ఏమైందో తెలియదు. తాళ్లూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇస్తామన్నా అతీగతీ లేదు. దర్శి రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీ.. తాళ్లూరు, ముండ్లమూరు ప్రాంతంలో సాగర్ కాలువల ఆధునికీకరణ బుట్టదాఖలైంది. పేదలకు ఇళ్లు లేవా.. అద్దంకి: మండల కేంద్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ఆ హామీని నెరవేర్చలేదు. మేదరమెట్ల, అద్దంకి రహదారుల్లో 210 కి.మీ. రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భవనాశి రిజర్వాయర్ అభివృద్ధి పనులు.. బల్లికురవ మండలంలో పెండింగ్‌లో ఉన్నాయి. యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్ రూపుదిద్దుకోలేదు. ముఖ్యమైన వెలిగొండ కూడా.. మార్కాపురం: నియోజకవర్గ పరిధిలో వెలిగొండ పూర్తి చేసి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. పొదిలిలో ఫైర్స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. దూపాడు ఇప్పటికీ అంతే.. గిద్దలూరు: పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ. 350 కోట్లు వెచ్చించినీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నల్లమల్ల అడవుల్లోని బైరేని గుండాలు ద్వారా గిద్దలూరుతో పాటు 14 గ్రామాలవారు ప్రస్తుతం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముండ్లమూరు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గిద్దలూరుకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తామన్నారు. అటవీ అనుమతుల్లేక బేస్తవారిపేట మండలం కోనపల్లి టు ఉదయగిరి, రాచర్ల మండలం ఆరవేటి కోట- అర్ధవీడు మండలం పాపినేనిపల్లి రోడ్డు పనులు నిలిచిపోయాయి. సంగమేశ్వరం సంగతి? కొండపి: సంగమేశ్వరం ప్రాజెక్టును రూ. 50.50 కోట్లతో పూర్తి చేసి 9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. తద్వారా కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు ప్రాంతాల్లో 50 గ్రామాలకు నీరు ఇస్తామన్నారు. టంగుటూరు నుంచి కొండపి, జరుగుమల్లి - టంగుటూరు రింగ్‌రోడ్డును పూర్తి చేస్తామని చెప్పారు. పొన్నలూరు మండలం ముక్కరాజుపాలెం - కనిగిరిలో అలవలపాడు గ్రామం రోడ్డును రూ. 14 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇవేమీ ఉనికిలోకి రాలేదు. రోదిస్తున్న రాళ్లపాడు కందుకూరు: సోమశిల ఉత్తర కాలువను రాళ్లపాడు ప్రాజెక్టు వరకు తవ్వి నీళ్లిస్తామన్నారు. ఇక రామాయపట్నం పోర్టు, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. మారని చేనేతల బతుకులు చీరాల: మండలంలో 25 వేల చేనేత మగ్గాల పరిధిలో 50 వేల మందికిపైగా చేనేత ఓటర్లున్నారు. వీరికి రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారు. ప్రస్తుతం రూ. 50 కోట్ల మేర రుణాలు చెల్లించలేక చేనేతలు లబోదిబోమంటున్నారు. కదలని వెలుగొండ యర్రగొండపాలెం: వెలిగొండ పనులు పూర్తయితే నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలకు తాగు, సాగు నీరు అందుతుంది. కానీ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. కలలోనే లక్షలాది ఉద్యోగాలు కనిగిరి: నియోజకవర్గ అభివృద్ధి కోసం కనిగిరి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వాడ (నిమ్జ్)ను 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. సోలార్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి కేవలం కాగితాలకే పరిమితమయ్యూరుు. శనగ రైతులు అలాగే.. పర్చూరు: శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటు సాగర్ కాలువ ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పినా అవి ముందుకు సాగడం లేదు. నియోజకవర్గంలో కౌలు రైతులకు రుణమాఫీ చేయలేదు. నిండా మునిగారు ♦ టీడీపీ అధికారం చేపట్టగానే జన్మభూమి కమిటీలు రంగంలోకి దిగి.. 30 వేలకుపైగా అర్హుల పింఛన్లను తొలగించారుు. 9,20,119 రేషన్ కార్డులుండగా 53,021 మాయం అయ్యూరుు. ♦ జిల్లాలో సుమారు 2,400 మంది ఆదర్శ రైతులుండగా వారిని తొలగించి ఆ స్థానంలో ఎంపీడీఓల పేరుతో టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. ♦ జిల్లావ్యాప్తంగా 8,046 మంది ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లు ఉండగా లక్ష్యాలు చేరుకోలేదని సాకు చూపి సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకునేందుకు ప్రభుత్వం 460 మందిని తొలగించింది. ♦ 2010 నుంచి వరుస కరువులతో రైతులు నష్టపోయారు. వీరికి రూ. 130 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా... ఇంత వరకు పైసా చెల్లించలేదు. ♦ డ్వాక్రా రుణమాఫీని తుంగలో తొక్కారు. ఒక్కొక్క మహిళకు పెట్టుబడి నిధి కింద రూ. 10 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పటికి కేవలం రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ♦ నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ జిల్లాలో ఒక్కరికీ అందలేదు. ♦ గిట్టుబాటు ధర లేక 30 వేల మందికిపైగా పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది 38 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారికి ఇంత వరకు పరిహారం ఇచ్చిన పాపానపోలేదు. ఈ ఏడాది కూడా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. -
అభయం
అభయహస్తం పింఛన్ల పంపిణీలో గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పింఛన్లను జనవరి రెండో వారం నుంచి పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలందడంతో జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముకరంపుర : జిల్లాలో 41,603 మంది లబ్ధిదారులకు నెలనెలా రూ.500 అందించేవారు. నెలకు రూ.2.08 కోట్లు అవసరమయ్యేవి. ఆసరా పింఛన్లతో ముడిపెట్టడంతో అక్టోబర్ నుంచి అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు రోజుకు రూపాయి చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండే వరకు సభ్యులు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు పూర్తయ్యాక సభ్యులకు నెలకు రూ.500 నుంచి రూ.2200 వరకు పింఛన్ అందిస్తారు. దీనికి ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు స్కాలర్షిప్ కూడా అందిస్తారు. ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున ఆసరా పేరిట అక్టోబర్ నుంచి అందిస్తోంది. ఆసరా పింఛన్ల లబ్ధిదారులు అభయహస్తంలోనూ ఉన్నారని విచారణ పేరిట వీరికి మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతమందికో అభయ‘హస్తం’ అభయహస్తంలో పింఛన్లు పొందుతూ 65 ఏళ్ల వయసున్న పలువురు ఆసరా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించి మంజూరు కూడా చేశారు. అసరా పింఛన్ వచ్చే వారికి అభయహస్తం పెన్షన్ రద్దు చేస్తారు. ఇలాంటివారి సంఖ్య తేల్చేందుకే ఇంతకాలం విచారణ చేశారు. ‘ఆసరా’ లబ్ధిదారులు లెక్కతేలడం, వారికి పంపిణీ కూడా మొదలవడంతో వీరిలో అభయహస్తం లబ్ధిదారులు ఎందరున్నారో త్వరగానే తేలనుంది. వీరి జాబితా సిద్ధం చేసి పింఛన్లు అందించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలివ్వడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాబితా సిద్ధమయ్యాక జనవరి 15 నుంచి అభయహస్తం పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పింఛన్ మొత్తం పెంచాలని యోచించినా... చివరకు పాత పద్ధతిలోనే నెలకు రూ.500 చొప్పున పంపిణీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ మొత్తం రూ.1500 లబ్ధిదారులు ఒకేసారి అందుకోనున్నారు. అభయహస్తం, పింఛన్ల పంపిణీ, అధికారులు, Assurances, the distribution of pensions, the -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరు : ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ లు, మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు భూములు ఇస్తామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాగ్దానాలు చేసిన ప్రజాసమస్యలను పరిష్కరించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య విగ్రహాలను హైదరాబా ద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. నీతి, నిజాయితీగా ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తే తమ పార్టీ తరఫున సహకారం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎమ్యెల్యేగా ఉన్నా తెలంగాణ ఉద్యమం వల్ల నియోజవర్గా న్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, ఈసారి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. సమావేశంలో నాయకులు డాక్టర్ సోమేశ్వర్రావు, నరేందర్‌రెడ్డి, జలగం శ్రీను, రాజేశ్‌నాయక్, దారావత్ సోమన్న, గుండా సోమయ్య తదితరులు పాల్గొన్నారు.