చంద్రన్నా.. ఇవి మీ హామీలేనా! | ap cm fake statements in election time | Sakshi
Sakshi News home page

చంద్రన్నా.. ఇవి మీ హామీలేనా!

Published Wed, Jun 22 2016 3:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

చంద్రన్నా.. ఇవి మీ హామీలేనా! - Sakshi

చంద్రన్నా.. ఇవి మీ హామీలేనా!

ఆశల పల్లకీలోనే జిల్లా ప్రజలు
ముందుకు కదలని ముఖ్యమైన హామీలు
రెండేళ్ల కరువుతో పెరుగుతున్న అసహనం


రుణ మాఫీని నమ్ముకున్న జిల్లా రైతులు దగా పడ్డారు. వడ్డీ భారం మోయలేకున్నారు. ఇంటికో ఉద్యోగం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, విమానాశ్రయం, తీరప్రాంతంలో పోర్టులు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉద్యోగాలు కలగానే మిగిలారుు. జిల్లాలో వెలిగొండ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులు ముందుకు కదలడంలేదు.రామాయపట్నం పోర్టు, సోమశిల ఉత్తర కాలువ, నిమ్జ్ ఇలా ఆశల పల్లకీ చూపించిన టీడీపీ ఇప్పుడు ఆర్భాటాలతో ఎంజాయ్ చేస్తోంది.  -  సాక్షి ప్రతినిధి, ఒంగోలు

‘చంద్రన్నా.. నిన్నే నమ్ముకున్నాం.. ఓట్లేశాం. సీఎం పీఠంపై కూర్చోబెట్టాం. అవశేషాంధ్రను ఉద్ధరిస్తారని కలలు కన్నాం. జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తారని ఆశించాం. చాంతాండంత హామీల లిస్టు చూసి సంబరపడ్డాం. మా బతుకులు మారతాయనుకున్నాం. అరుుతే రోజులు గడుస్తున్నాయే కానీ మీరిచ్చిన హామీలు ముందుకు కదలడంలేదు. మాది పేద జిల్లా.. వర్షాభావంతో కొట్టుమిట్టాడే ప్రాంతం. అన్ని మండలాలను కరువు జాబితాలో ప్రకటించారు. రెండేళ్లుగా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, డ్వాక్రామహిళలు, పింఛనుదారులు వెత లు పడుతూనే ఉన్నారు. మీరిచ్చిన ముఖ్యమైన 11 హామీలను మరిచారా చంద్రన్నా’ అంటూ జిల్లా ప్రజలు సీఎంను ప్రశ్నిస్తున్నారు.

 ట్రిపుల్ ఐటీ ఎక్కడ?
ఒంగోలు:
జిల్లాకేంద్రంలో ట్రిపుల్ ఐటీ మంజూరు చేస్తామని చెప్పినా అతీగతి లేదు. హైదరాబాద్ స్థాయిలో ఒంగోలులో శిల్పారామం ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా నెరవేరలేదు. వెటర్నరీ.. మైనింగ్ యూనివర్సిటీల ఊసే లేదు.

పారిశ్రామిక కారిడార్ అట
దర్శి:
దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసి  తద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్ ఏమైందో తెలియదు. తాళ్లూరు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తిలకు దీని ద్వారా తాగు, సాగు నీరు ఇస్తామన్నా అతీగతీ లేదు. దర్శి రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీ.. తాళ్లూరు, ముండ్లమూరు ప్రాంతంలో సాగర్ కాలువల ఆధునికీకరణ బుట్టదాఖలైంది.

పేదలకు ఇళ్లు లేవా..
అద్దంకి:
మండల కేంద్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిస్తామని చెప్పిన అధికార పార్టీ నేతలు ఆ హామీని నెరవేర్చలేదు. మేదరమెట్ల, అద్దంకి రహదారుల్లో 210 కి.మీ. రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భవనాశి రిజర్వాయర్ అభివృద్ధి పనులు.. బల్లికురవ మండలంలో పెండింగ్‌లో ఉన్నాయి. యర్రం చినపోలిరెడ్డి రిజర్వాయర్ రూపుదిద్దుకోలేదు.

ముఖ్యమైన వెలిగొండ కూడా..
మార్కాపురం: నియోజకవర్గ పరిధిలో వెలిగొండ పూర్తి చేసి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. పొదిలిలో ఫైర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

 దూపాడు ఇప్పటికీ అంతే..
గిద్దలూరు: పట్టణానికి దూపాడు ప్రాజెక్టు నుంచి రూ. 350 కోట్లు వెచ్చించినీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  నల్లమల్ల అడవుల్లోని బైరేని  గుండాలు ద్వారా గిద్దలూరుతో  పాటు 14 గ్రామాలవారు  ప్రస్తుతం ఆశగా ఎదురు  చూస్తున్నారు. ముండ్లమూరు  ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గిద్దలూరుకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తామన్నారు. అటవీ అనుమతుల్లేక బేస్తవారిపేట మండలం కోనపల్లి టు ఉదయగిరి, రాచర్ల మండలం ఆరవేటి  కోట- అర్ధవీడు మండలం పాపినేనిపల్లి రోడ్డు పనులు నిలిచిపోయాయి.

సంగమేశ్వరం సంగతి? కొండపి:  సంగమేశ్వరం ప్రాజెక్టును రూ. 50.50 కోట్లతో పూర్తి చేసి  9,500 ఎకరాలకు సాగు నీరు, 4 మండలాల పరిధిలో తాగునీరు అందిస్తామన్నారు. తద్వారా కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు ప్రాంతాల్లో 50 గ్రామాలకు నీరు ఇస్తామన్నారు. టంగుటూరు నుంచి కొండపి, జరుగుమల్లి - టంగుటూరు రింగ్‌రోడ్డును పూర్తి చేస్తామని చెప్పారు. పొన్నలూరు మండలం ముక్కరాజుపాలెం - కనిగిరిలో అలవలపాడు గ్రామం రోడ్డును రూ. 14 కోట్లతో డబుల్ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇవేమీ ఉనికిలోకి రాలేదు.

రోదిస్తున్న రాళ్లపాడు కందుకూరు: సోమశిల ఉత్తర కాలువను రాళ్లపాడు ప్రాజెక్టు వరకు తవ్వి నీళ్లిస్తామన్నారు. ఇక రామాయపట్నం పోర్టు, రాళ్లపాడు ఎడమ కాలువ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని చెప్పినా.. అమలుకు నోచుకోలేదు.

మారని చేనేతల బతుకులు  చీరాల: మండలంలో 25 వేల చేనేత మగ్గాల పరిధిలో 50 వేల మందికిపైగా చేనేత  ఓటర్లున్నారు. వీరికి రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారు. ప్రస్తుతం రూ. 50 కోట్ల మేర రుణాలు చెల్లించలేక చేనేతలు లబోదిబోమంటున్నారు.

కదలని వెలుగొండ యర్రగొండపాలెం: వెలిగొండ పనులు పూర్తయితే నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలకు తాగు, సాగు నీరు అందుతుంది. కానీ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇప్పటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

కలలోనే లక్షలాది ఉద్యోగాలు కనిగిరి: నియోజకవర్గ అభివృద్ధి కోసం కనిగిరి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వాడ (నిమ్జ్)ను 12,500 ఎకరాల్లో ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. సోలార్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి కేవలం కాగితాలకే పరిమితమయ్యూరుు.

శనగ రైతులు అలాగే.. పర్చూరు: శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటు సాగర్ కాలువ ఆధునికీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పినా అవి ముందుకు సాగడం లేదు. నియోజకవర్గంలో కౌలు రైతులకు రుణమాఫీ చేయలేదు.

 నిండా మునిగారు
టీడీపీ అధికారం చేపట్టగానే జన్మభూమి కమిటీలు రంగంలోకి దిగి.. 30 వేలకుపైగా అర్హుల పింఛన్లను తొలగించారుు. 9,20,119 రేషన్ కార్డులుండగా 53,021 మాయం అయ్యూరుు.

 జిల్లాలో సుమారు 2,400 మంది ఆదర్శ రైతులుండగా వారిని తొలగించి ఆ స్థానంలో ఎంపీడీఓల పేరుతో టీడీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. 

 జిల్లావ్యాప్తంగా 8,046 మంది ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లు ఉండగా లక్ష్యాలు చేరుకోలేదని సాకు చూపి సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకునేందుకు ప్రభుత్వం 460 మందిని తొలగించింది.

 2010 నుంచి వరుస కరువులతో రైతులు నష్టపోయారు. వీరికి రూ. 130 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా... ఇంత వరకు పైసా చెల్లించలేదు.

 డ్వాక్రా రుణమాఫీని తుంగలో తొక్కారు. ఒక్కొక్క మహిళకు పెట్టుబడి నిధి కింద రూ. 10 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పటికి కేవలం రూ. 3 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

 నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ జిల్లాలో ఒక్కరికీ అందలేదు.

 గిట్టుబాటు ధర లేక 30 వేల మందికిపైగా పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది 38 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారికి ఇంత వరకు పరిహారం ఇచ్చిన పాపానపోలేదు. ఈ ఏడాది కూడా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement