హమీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వం | govt not fullfilling assurances | Sakshi
Sakshi News home page

హమీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వం

Published Sat, Jul 23 2016 7:09 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

govt not fullfilling assurances

ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌

జవహర్‌నగర్‌ : ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలుపర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ ఆరోపించారు. ఈ మేరకు శనివారం జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన  ప్రజాకళామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించిన ప్రజలకు నిరాశేమిగిలిందన్నారు. పల్లెల్లో బతుకుదెరువులేక ఎంతో మంది వలస వచ్చి జవహర్‌నగర్‌లో నివసిస్తున్నారని వారందరూ కూలినాలీ పనిచేసుకుని పైసాపైసా పోగుచేసుకుని 60 గజాల్లో ఇళ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారందరూ దినదిన గండం నూరేళ్లాయుష్సు అన్నట్లు భయంలో జీనవం సాగిస్తున్నారన్నారు. ఎన్నికలకు మందు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చి అమలు పరచడంలో విఫలమైందన్నారు. జవహర్‌నగర్‌లో జీఓ 58, 59 ప్రకారం అన్ని ఇళ్లను క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రజా కళామండలి ఉపాధ్యక్షుడు రాజనర్సింహ, ప్రధాన కార్యదర్శి కోటి, సహాయకార్యదర్శి నీలకంఠ, కోశాధికారి నాగేశ్వరావులతో పాటు సభ్యులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement