బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసిన కేసీఆర్‌ | CM KCR Election Plan And BRS Manifesto Live Updates | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసిన కేసీఆర్‌

Oct 15 2023 12:13 PM | Updated on Oct 16 2023 6:41 PM

CM KCR Election Plan And BRS Manifesto Live Updates - Sakshi

తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల ప్లాన్‌ను కేసీఆర్‌..

Updates..

బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
► తెల్లరేషన్‌కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
► రైతు బీమా తరహాలోనే కేసీఆర్‌ బీమా
► కేసీఆర్‌ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి
►జూన్‌ నుంచి కేసీఆర్‌ బీమా పథకం అమలు చేస్తాం
►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్‌కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం
►‍ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం
►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌
►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం
►దశవారిగా పెన్షన్లు పెంచుతాం
►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం
►ఏపీ సీఎం జగన్‌ పాలనపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు
►ఏపీలో పెన్షన్‌ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది

►వికలాంగుల పెన్షన్‌ రూ.6వేల వరుకూ పెంచుతాం
►వికలాంగుల పెన్షన్‌ మార్చి తర్వాత రూ.5 వేలు
►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం
►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి
►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి
►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌
►అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌

►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు​ పెంచుతాం
►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం
►కేసీఆర్‌ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్‌ స్కీమ్‌
►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్‌ స్కీమ్‌
►హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం
►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు
►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ
►ఓపీఎస్‌ డిమాండ్‌పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం

► మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం
► మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం
► రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం
► సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది
► తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది
► గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం: కేసీఆర్

► అభ్యర్థులకు బీఫామ్‌ అందించిన సీఎం కేసీఆర్‌. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తరఫున బీఫామ్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత. ప్రశాంత్‌ రెడ్డి మాతృ వియోగం కారణంగా కార్యక్రమానికి గైహర్హారు. 

► సీఎం కేసీఆర్‌ తరఫున బీఫామ్‌ అందుకున్న గంప గోవర్ధన్‌. కామారెడ్డి నుంచి అసెంబ్లీ బరిలో సీఎం కేసీఆర్‌.


►నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల అభ్యర్థులకు బీఫామ్స్‌ అందజేత. మిగిలిన వారికి రేపు బీఫామ్స్‌ అందించనున్నారు. 

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది. ప్రతీ కార్యకర్తలో నేతలు మాట్లాడాలి. 

►మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. 

►అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌. భరత్‌ కుమార్‌కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. భరత్‌ కుమార్‌ ఎన్నికల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. బీఫామ్‌ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్‌ ఇస్తాం. ఈరోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్‌ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. నేడు 51 మందికి బీఫామ్‌ అందిస్తాం. అన్ని బీ ఫామ్స్‌ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్‌ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే. 

►కొంతమంది చిలిపి పనులు, చిల్లర పనుల వల్లే చాలా దెబ్బతిన్నారు. అలాంటి వ్యక్తులను చాలా మందిని చూశాను. ఎన్నికల సందర్బంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. వారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. ముందుకు సాగాలి. జూపల్లి కృష్ణారావుకు కేసీఆర్‌ కౌంటర్‌.

►శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తోం పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారు. అందుకే జాగ్రత్తలు పాటించండి. చివరి రోజు వరకు సమయం ఉందని లైట్‌ తీసుకోవద్దు. చివరిరోజే అందరూ నామినేషన్‌ వేయాలని ఇబ్బంది పడకండి. 

►ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్‌
►తెలంగాణ భవన్‌లో 277 మంది కూర్చనే విధంగా ఏర్పాట్లు. 
►పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలతో ఉమ్మడిగా సమావేశం కానున్న కేసీఆర్‌ 

►పార్టీ మేనిఫెస్టోను సవవిరంగా వివరించనున్న కేసీఆర్‌ 
►లంచ్‌ తర్వాత కూడా కొనసాగనున్న భేటీ. 
►సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సభకు కేసీఆర్‌
►బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి. 

►తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌
►తెలంగాణ తల్లికి నివాళులర్పించిన కేసీఆర్‌
►అభ్యర్థులకు బీఫామ్స్‌ అందించునున్న కేసీఆర్‌

►తెలంగాణ భవన్‌కు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

►కేసీఆర్‌ వెంట మంత్రులు హరీష్‌రావు, మహమూద్‌ అలీ.

►‍కాసేపట్లో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం.

►తెలంగాణ భవన్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌. 

►అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌.. తాజాగా నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 

►నేడు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల సభ. 

►హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్‌.

►సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభ.

►గతంలో హుస్నాబాద్‌ నుంచే బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం. 

►రాజధానికి ఈశాన్యంగా ఉండటంతో సెంటిమెంట్‌ కలిసొచ్చిందని భావన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement