ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అంత తేలికగా కొట్టిపారేయలేమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అంత తేలికగా కొట్టిపారేయలేమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. తమ పార్టీ సాధించే ఫలితాలు ఒకవేళ సర్వేలో వచ్చినవిధంగా ఉన్నట్టయితే అది ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేం. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది మాకు అత్యంత ఆందోళనకరమైన విషయమే’ అని అన్నారు. కాగా తమకు 12 నుంచి 15 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరో నాయకుడు ఇదే విషయమై మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి పార్టీ పరిస్థితి ఎంతమాత్రం ఆశావహంగా లేదనే విషయం ఇట్టే అర్ధమవుతోందన్నారు.