న్యూఢిల్లీ: ఇటీవల వేగంగా వ్యాపిస్తోన్న స్వైన్‌ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్విహ ంచనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీఅధ్యక్షుడు అజయ్‌మాకెన్ సోమవారం వెల్లడించారు. ‘స్వైన్‌ఫ్లూ నుంచి బయట పడటానికి ప్రభుత్వం సాగిస్తున్న కార్యక్రమాలకు మేం సాయం చేస్తాం. అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం’ అని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తులు 10-15 బృందాలుగా విడిపోయి అన్ని ప్రాంతాలకు తిరుగుతారు. ప్లకార్డులను పట్టుకొని, కరపత్రాలను ప్రజలకు పంచుతారు. ఈ ప్రయత్నం ద్వారా నగరంలో స్వైన్‌ఫ్లూ తగ్గుతుందని మాకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వైన్‌ఫ్లూపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు
Published Mon, Mar 9 2015 11:06 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement