
అజయ్ మాకెన్, అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 10–15 రోజుల్లో దేశద్రోహిగా నిరూపిస్తానని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా అవతరిస్తున్నారని విమర్శించారు. శనివారం ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌కు నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసి పార్టీపై దృష్టి పెడుతున్నారని.. ఫలితంగా పరిపాలన కుంటుపడుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఢిల్లీలో చెత్త సమస్యను పరిష్కరించలేకపోయారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వంలో నకిలీ సంపీడన సహజ వాయువు (సీఎన్‌జీ) కిట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సీఎన్‌జీ కిట్లు చైనాలో తయారై వస్తాయని, కానీ వాటిని కెనడాలో తయారైనవిగా పేర్కొంటారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment