ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : పీడబ్ల్యూడీ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బావమరిది కుమారుడు వినయ్ కుమార్ బన్సల్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది.బన్సల్‌ను గురువారం ఉదయం పీతంపురలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరు పీడబ్ల్యూడీ అధికారులను కూడా విచారించనున్నారు. ఈ స్కామ్‌లో సురేందర్ కుమార్ బన్సల్‌కు చెందిన కంపెనీతో మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను ఏసీబీ నమోదు చేసింది. ఢిల్లీలో 2015-16లో రోడ్లు, పైప్‌లైన్ల నిర్మాణ కాంట్రాక్ట మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని రోడ్స్ యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ (రాకో) వ్యవస్థాపకులు రాహుల్ శర్మ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
ఢిల్లీలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణంల బన్సల్‌కు చెందిన సంస్థ పలు అక్రమాలకు పాల్పడిందని రాకో సంస్థ ఆరోపిస్తోంది. పనులు పూర్తికాకుండానే ఈ కంపెనీ పెద్ద ఎత్తున బిల్లులను పీడబ్ల్యూడీకి పంపి సొమ్ముచేసుకుందని పేర్కొంటోంది. 2015-16లో ఈ సంస్థ పొందిన పలు పనులు ఇంతవరకూ పూర్తికాకున్నా చెల్లింపులు మాత్రం పూర్తిగా ముట్టచెప్పారని ఆరోపిస్తోంది. బిడ్ పొందుపరచడం, సాంకేతిక అర్హతల విషయంలోనూ సంస్థ పలు అవకతవకలకు పాల్పడిందని రాకో ఆరోపిస్తోంది. మెటీరియల్స్ సరఫరా చేయకున్నా చేసినట్టు నకిలీ బిల్లులు సమర్పించడం వంటి అక్రమాలు జరిగినట్టు గుర్తించిన మీదట బన్సల్‌ను అరెస్ట్ చేశామని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment