సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పూరిలో బుధవారం అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం తెలిసిందే. నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇంత జరుగుతున్నా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం చట్ట విరుద్ధమని మాకెన్ మండిపడ్డారు.
కాగా, జాహంగీర్‌పూరిలో బాధిత కుటుంబాలను అజయ్ మాకెన్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరామర్శించింది. మాకెన్ బృందలో 16 మంది నేతలు ఉన్నారు. ఇక, కూల్చివేతల వ్యవహారాన్ని మతపరమైన కోణంలో చూడవద్దని అన్నారు. మరోవైపు జహంగీర్‌పూరి ఘటనపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ అంటేనే ఏకపక్ష కూల్చివేతలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇది చదవండి: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment