బీజేపీలో చేరనున్న బర్ఖా సింగ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బర్ఖా శుక్లా సింగ్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఇవాళ ఆమె భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఢిల్లీ బీజేపీ ఇన్‌ఛార్జ్ శ్యామ్ జహును బర్ఖా శుక్లా సింగ్ ఈరోజు మధ్యాహ్నం కలవనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ బర్ఖాను ఆరేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. అంతకు ముందు రోజు ఆమె ఢిల్లీ మహిళా కాంగ్రెస్ మోర్చా అధ్యక్షపదవికి రాజీనామా చేస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి పార్టీ నడిపే సామర్థ్యం లేదని ఆయన పనితీరును విమర్శించారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడింది.