'ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు చావు దెబ్బలా ఉన్నాయి'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బలా ఉన్నాయని ఆ పార్టీ ఎన్నికల ప్రచార సారథి అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్)కి అధికారం ఇవ్వాలని ఓటర్లు భావించినట్లు ఉన్నారని ఆయన అన్నారు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్య దేశంలో ఆ తీర్పును గౌరవించాల్సిందేనని మాకెన్ తెలిపారు.
ఆదివారం కూడా ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తెలిసిందే. ఎన్నికల ఫలితాలను కొట్టిపారేయలేమన్నారు. ఒకవేళ అవి మాత్రం నిజమైతే అది తమకు అత్యంత ఆందోళనకరమైన విషయమేనని అన్నారు. అయినా అన్నిసార్లు సర్వేలు నిజమవుతాయనడం ఎంతమాత్రం సరికాదని మాకెన్ తెలిపారు.