బహిష్కరణ వేటును సమర్థించుకున్న కాంగ్రెస్
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు విధించడాన్ని ఆపార్టీ సమర్ధించుకుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించిన వారిపై చర్య తీసుకున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వారిపై, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన వారెవరైనా సరే వేటు తప్పదని మాకెన్ అన్నారు.
ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా.. వ్యతిరేకించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం అని మాకెన్ తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఆరుగురు ఎంపీలపై మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే.