కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏడో వేతన సంఘం సిఫార్సులపై కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారమిక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సిఫార్సుల వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. గరిష్ట, కనిష్ట వేతనాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను సంఘం పూర్తిగా విస్మరించిందని మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఫార్సులు ఉద్యోగులుకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవి విఫలమయ్యాయన్నారు. 52 రకాల అలవెన్సులను ఆపివేయడం, వడ్డీ లేకుండా ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేయడంపై అభ్యంతరం తెలిపారు.