నాగపూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే వారం మొదట్లో తిరిగి కార్యరంగంలోకి వస్తారని కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. కమలేశ్వర్ వద్ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తదుపరి ఐదు రోజుల్లో రాహుల్ తిరిగి విధులకు హాజరవుతారని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. రాహుల్ ఆకస్మికంగా సెలవు పెట్టారు. కాగా, పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఏఐసీసీ సమాచార విభాగం ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న అజయ్ మాకెన్ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే.