అవార్డు వాపసీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
న్యూఢిల్లీ: అవార్డు వాపసీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మత అసహనం పెరిగిపోతుండడంతో రచయితలు, మేధావులు తదితరులు అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నారని పేర్కొంది. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో పురస్కారాలు తిరిగిచ్చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ అధికా ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు.
'ప్రముఖులు అవార్డులు ఎందుకు వెనక్కు ఇచ్చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు వారినెంతో బాధించాయి. వీటిని సరిదిద్దాలన్న ఉద్దేశంతోనే పురస్కారాలు ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తున్నారు' అని మాకెన్ అన్నారు. వార్డులను వాపస్ ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ.. అసమ్మతిని చర్చలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేయాలని అన్నారు.