
జైపూర్: రాజస్తాన్ కేబినెట్ నుంచి కొందరు మంత్రులు వైదొలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. హై కమాండ్ ఆదేశాలకు లోబడి నడుచుకుంటామని వారంతా చెప్పారన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మరిన్ని కీలక పదవులు ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ వర్గీయుల డిమాండ్ మేరకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందులో భాగంగానే ఆయన, రాష్ట్రంలోని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో విడివిడిగా సమావేశమై, అభిప్రా యాలు తెలుసుకున్నారు. ఈ మేరకు రూపొం దించిన నివేదికను అజయ్ మాకెన్ పార్టీ హై కమాండ్‌కు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment