న్యూఢిల్లీ: రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా అజయ్ మాకెన్ ఆదివారం నియమితులయ్యారు. అవినాష్ పాండే స్థానంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాకెన్‌కు రాజస్తాన్ బాధ్యతలు అప్పగించారు. సచిన్ పైలెట్ వర్గం తిరుగుబాటు చేసిన సమయంలో మాకెన్ పరిశీలకుడిగా రాజస్తాన్‌కు వెళ్లి కీలకపాత్ర పోషించారు. రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం పైలెట్ వర్గం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని నెగ్గిన విషయం తెలిసిందే. పైలెట్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించే నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించిన త్రిసభ్య కమిటీలోనూ మాకెన్ సభ్యుడిగా ఉన్నారు. అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ మిగతా ఇద్దరు సభ్యులు.
Comments
Please login to add a commentAdd a comment