వివాదం పక్కన పెట్టి పనితీరు చూడండి: స్మృతి ఇరానీ
విద్యార్హతలపై కొనసాగుతున్న వివాదంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పెదవి విప్పారు.
న్యూఢిల్లీ: విద్యార్హతలపై కొనసాగుతున్న వివాదంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పెదవి విప్పారు. తన విద్యార్హతలను లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ సృష్టించిన వివాదం విధులపై దృష్టి పెట్టకుండా చేసిందని.. అయితే తన పనితీరును ప్రజలు తీర్పు ఇవ్వాలని స్మృతి విజ్క్షప్తి చేశారు.
డిగ్రీ పట్టాలేని వ్యక్తికి కీలక శాఖను అప్పగించడంపై కాంగ్రెస్ సృష్టించిన వివాదంపై స్పందిస్తూ విద్యార్హతలను పక్కన పెట్టి పనితీరు చూడాలని ఆమె కోరారు. 2004, 2014 లోకసభ ఎన్నికల్లో విద్యార్హతలుగా వివిధ రకాలుగా అఫిడవిట్ లో దాఖలు చేయడంతో మధు కుష్వర్ అనే ఓ సామాజిక కార్యకర్త ..12వ తరగతి పాస్ కాని వ్యక్తికి మానవ వనరుల శాఖ ఇవ్వడమా అంటూ ప్రశ్నించారు.
ఆతర్వాత కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ రంగు పులుముకుంది.