education qualification
-
60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ
అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్టించాక పాలనలో పలు మార్పులు తీసుకువస్తున్నారు. ప్రతిష్టత్మక పదవులలో నూతన నియామకాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చీఫ్‌గా 41 ఏళ్ల బిలియనీర్ జారెడ్ ఇసాక్మన్ను నియమించారు.ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ సాయంతో అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ ట్రిప్ చేసిన వ్యక్తి ఇసాక్‌మన్. 2009లో ఇసాక్‌మన్ 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులో చదవును విడిచిపెట్టి, నేడు నాసాకు చీఫ్‌గా నియమితులయ్యే వరకూ ఇసాక్‌మన్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇసాక్‌మన్ అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపుపొదారు.ఇసాక్‌మన్ 1983, ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో డొనాల్డ్,సాండ్రా మేరీ ఐజాక్మన్ దంపతులకు జన్మించారు. నలుగురు తోబుట్టువులలో ఇసాక్‌మన్ చిన్నవాడు. ఆయన కిండర్ గార్టెన్ నుండి ఆరవ తరగతి వరకు వెస్ట్‌ఫీల్డ్‌లోని విల్సన్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు. ఇసాక్మన్కు 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజెర్సీలోని బెర్నార్డ్స్ టౌన్‌షిప్‌లోని లిబర్టీ కార్నర్ విభాగానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఇసాక్‌మన్ విలియం అన్నీన్ మిడిల్ స్కూల్లో చదువుకున్నారు.హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఇసాక్‌మాన్ తన స్నేహితునితో కలిసి తన ఇంటిలో క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ షిఫ్ట్ 4ను ప్రారంభించారు. 1999లో ఇసాక్‌మన్ పాఠశాల చదువును మధ్యలోనే విడిచిపెట్టారు. అయితే హైస్కూల్ డిప్లొమాకు సమానమైన జీఈడీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం కంపెనీ షిఫ్ట్ 4 కంపెనీ విలువ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ హిల్టన్, కేఎఫ్‌సీ వంటి బ్రాండ్లకు చెల్లింపు ప్రాసెసింగ్ చేస్తుంది.ఇసాక్‌మన్ ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ ఏరోనాటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. 2011లో ఈ డిగ్రీని పొందిన ఇసాక్మన్కు సైనిక విమానాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ కూడా ఉంది. అతని దగ్గర దాదాపు 100 యుద్ధ విమానాలు ఉన్నాయి. అతని కంపెనీ అమెరికా, నాటో దేశాల వైమానిక దళాల ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఇసాక్‌మన్ అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని ఆస్తుల నికర విలువ 1.9 అమెరికన్ బిలియన్ డాలర్లు. 2021లో పొలారిస్ ప్రోగ్రామ్ కింద ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ సహాయంతో చారిత్రక అంతరిక్ష యాత్ర చేశాడు. ఈ పర్యటన కోసం ఇసాక్‌మన్ 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు.ఇది కూడా చదవండి: భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి? -
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
-
యువతలో నైపుణ్యం పెంపొందడానికి ఇది మంచి కార్యక్రమం
-
తెలంగాణ ఎన్నికలు.. మన అభ్యర్థులు ఏం చదివారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో, నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈసారి ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మూడో వంతుపైగా పట్టభద్రులు ఉన్నారు. ఇక, డిగ్రీతో పాటు న్యాయవాద విద్యను అభ్యసించిన వారు ఎక్కువగా ఉండగా వైద్యులు, ఇంజనీర్లు కూడా పోటీలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారూ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసలే చదవుకోనివారు, పదో తరగతిలోపే చదివిన వారు కూడా ప్రధాన పార్టీల్లో ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హత వివరాలు ఇవే.. పదో తరగతి పాసైన అభ్యర్థుల సంఖ్య 441, ఇంటర్ పాసైన వారి సంఖ్య 330, చదువుకోనివారి సంఖ్య 89, ఐదో తరగతి పాసైన వారి సంఖ్య 91, ఎనిమిదో తరగతి పాసైన వారి సంఖ్య 117, డిగ్రీ ఆపై చదివిన వారి సంఖ్య 1143, డిప్లమా చదివిన వారి సంఖ్య 53, డాక్టరేట్ ఉన్న వారి సంఖ్య 32. -
ఇంటర్న్షిప్స్ తో విద్యార్థులకు పెద్ద కంపెనీలో ఉద్యోగ అవకాశాలు
-
1985లో టెన్త్.. 2023లో పీయూసీ.. విద్యాదాహాన్ని తీర్చుకుంటున్న ఆటోడ్రైవర్
బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఇటీవల ఎక్స్(ట్విట్టర్)లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ట్వీట్ చేశారు. ఆటో డ్రైవర్ భాస్కర్‌తో తనకు ఎదురైన అద్భుత అనుభవాన్ని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. భాస్కర్ ఇటీవలే తన ప్రీ- యూనివర్శిటీ(పీయూసీ) పరీక్ష రాశారని తెలిపారు. నిధి తన పోస్టులో ఆటో డ్రైవర్ భాస్కర్ 1985లో స్కూలు మానివేసినప్పటి నుంచి ఉన్నత విద్య చదవాలనే తపనతో ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఒక ఫొటోతో పాటు నిధి అగర్వాల్ ఇలా రాశారు ‘ఈరోజు ఓలాక్యాబ్స్ ఆటో ద్వారా భాస్కర్ పరిచయం అయ్యారు. ఈ రోజే ఆయన పీయీసీ పరీక్షలోని ఆంగ్ల ప్రశ్నాపత్రం రాశారు. భాస్కర్ 1985లో 10వ తరగతి పాసయ్యాక ఈ ఏడాది పీయూసీ పరీక్ష రాశారు. భాస్కర్ పిల్లలు స్కూలులో చదువుతున్నారు. భాస్కర్‌కు చదువుపై ఉన్న శ్రద్ధ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది’ అని రాశారు. నిధి అగర్వాల్ అందించిన ఈ పోస్టు ఇంటర్నెట్లో సందడి చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ పోస్టుకు 1,500కు మించిన వీక్షణలు దక్కాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఇటువంటి అనేక కథలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! "Introducing Baskar ji, my @Olacabs auto companion today. He faced his English paper today, he is writing PUC exams this year after cleaning 10th in 1985. Father of two, with kids in 3rd and 6th grade. His enduring smile was truly motivating! @peakbengaluru pic.twitter.com/5R21YtdomZ — Nidhi Agarwal (@Ngarwalnidhi) August 26, 2023 -
కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట!
బీహార్ విద్యాశాఖలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. విద్యాశాఖ ఒక విద్యార్థికి సంబంధించిన టీసీలో ఆ కుర్రాడి డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 30 అని రాసింది. నిజానికి ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే బీహార్ విద్యాశాఖ ఎంత నిద్రమత్తులో ఉన్నదంటే బీహార్ ప్రజలకు 30 రోజులు ఉంటున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ చూపిన ఈ నిర్లక్ష్యం ఆ పిల్లవాడి పాలిట సమస్యగా మారింది. ఈ ఉదంతం జముయీ జిల్లాలోని చకాయీ పరిధిలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అమన్ కుమార్‌కు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో ఆ కుర్రాడి పుట్టిన తేదీ 2009 ఫిబ్రవరి30 అని ఉంది. ఈ విధమైన పుట్టినరోజు కారణంగా తమ పిల్లవాడికి 9వ తరగతిలో ఎక్కడా అడ్మిషన్ దొరకడంలేదని పిల్లవాడి తండ్రి రాజేష్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు విద్యాశాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. తన కుమారుని పుట్టినతేదీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెబుతున్నారని రాజేష్ యాదవ్ ఆరోపించారు. కాగా ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించగా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పుకాదని, ఆ విద్యార్థి సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో అలా ఉండి ఉంటుందన్నారు. దీని గురించి సంబంధిత అధికారులను విద్యార్థి తండ్రి సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా! -
అంబానీ పిల్లలు ఏం చదువుకున్నారు ..? వాళ్ళ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
‘చదువుకోని ప్రధాని దేశానికి ప్రమాదకరం’
ఢిల్లీ: లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న మనీష్ సిసోడియా.. దేశ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చదువు ప్రాముఖ్యత తెలియదంటూ లేఖలో సంచలన విమర్శలు చేశారాయన. ఒక దేశ ప్రధాని ఎంత తక్కువగా చదివి ఉంటే.. అది ఆ దేశానికి అంత ఎక్కువ ప్రమాదం. మోదీకి సైన్స్ ఏంటో అర్థం కాదు. అసలు ఆయనకు విద్య యొక్క ప్రాముఖ్యత తెలియదు కూడా అని లేఖలో సిసోడియా పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 60 వేలకుపైగా స్కూల్స్ మూతపడ్డాయని లేఖలో విమర్శించారాయన. చదువుకోని ప్రధానితో దేశానికి ఏనాటికైనా ప్రమాదమే అంటూ లేఖలో పేర్కొన్న సిసోడియా.. భారత దేశ ప్రగతికి చదువుకున్న ప్రధాని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. సిసోడియా భావాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపిన కేజ్రీవాల్.. ట్విటర్లో సందేశం ఉంచారు. मनीष सिसोदिया ने जेल से देश के नाम चिट्ठी लिखी - प्रधानमंत्री का कम पढ़ा-लिखा होना देश के लिए बेहद ख़तरनाक मोदी जी विज्ञान की बातें नहीं समझते मोदी जी शिक्षा का महत्व नहीं समझते पिछले कुछ वर्षों में 60,000 स्कूल बंद किए भारत की तरक़्क़ी के लिए पढ़ा-लिखा पीएम होना ज़रूरी pic.twitter.com/VpPyY1Jr2v — Arvind Kejriwal (@ArvindKejriwal) April 7, 2023 ఇదీ చదవండి: ప్రధాని మోదీ డిగ్రీ.. మూల్యం చెల్లించుకోనున్న కేజ్రీవాల్ -
బీజేపీలో మున్నాబాయ్ MBBSలు ఎందరో.. : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేజ్రీవాల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీ విద్యార్హత అంశం మరోసారి తెర మీదకు రాగా.. బీజేపీ నేతల విద్యార్హత అంశాన్ని లేవనెత్తుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ టైప్ వ్యక్తులు ఎందరో ఉన్నారంటూ ఓ ట్వీట్ చేశారాయన. బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ తరహా వ్యక్తులు ఎంతోమంది ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫేక్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజస్తాన్, తమిళనాడు యూనివర్సిటీల సర్టిఫికెట్లను ఫోర్జింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు విషయం(ఫేక్ విద్యార్హత ప్రస్తావిస్తూ..) పేర్కొనడం క్రిమినల్ నేరం కాదా? ఒకవేళ దోషులుగా వాళ్లపై లోక్‌సభ స్పీకర్ అనర్హులుగా వాళ్లను ప్రకటించరాదా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. Looks like we have too many MunnaBhai, MBBS types in BJP 2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets… — KTR (@KTRBRS) April 4, 2023 ఇదీ చదవండి: మన ప్రధానులు అసలు ఏం చదివారో తెలుసా? -
ప్రధాని ఎంత చదువుకున్నారో ప్రజలు తెలుసుకోవద్దా? కేజ్రీవాల్ కౌంటర్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీకి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలిజేయాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లను చూపించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంటూ.. కేజ్రీవాల్‌కు రూ. 25,000 జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై తాజాగా కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో.. తమ ప్రధాని ఎంత చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి (ప్రజలకు) లేదా అని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. డిగ్రీ చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధించడం ఏంటి..? అసలేం జరుగుతోంది. నిరక్షరాస్యుడు, తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా क्या देश को ये जानने का भी अधिकार नहीं है कि उनके PM कितना पढ़े हैं? कोर्ट में इन्होंने डिग्री दिखाए जाने का ज़बरदस्त विरोध किया। क्यों? और उनकी डिग्री देखने की माँग करने वालों पर जुर्माना लगा दिया जायेगा? ये क्या हो रहा है? अनपढ़ या कम पढ़े लिखे PM देश के लिए बेहद ख़तरनाक हैं https://t.co/FtSru6rddI — Arvind Kejriwal (@ArvindKejriwal) March 31, 2023 -
సస్పెన్స్‌తో చంపేశారు, ఆ సీక్రెట్‌ను రివిల్ చేసిన సుందర్ పిచాయ్!
తమకు నచ్చిన హీరో, లేదంటే ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటీ? స్కూలింగ్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారనే విషయాల గురించి ఆరాలు తీస్తుంటారు. ఈ ఇంట్రస్ట్.. సినిమా హీరోలు, స్పోర్ట్స్ పర్సన్ల గురించే కాదండోయ్..టెక్ సంస్థల సీఈఓల గురించి తెలుసుకునేందుకు మక్కువ చూపుతుంటారు. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్ సుందర్ పిచాయ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ సంవత్సరాలుగా తన స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ అయ్యిందనే విషయాల్ని ఎక్కడ రివిల్ చేయకుండా టెక్ లవర్స్‌ను సస్పెన్స్‌కు గురి చేశారు. తాజాగా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఇంటర్వ్యూలో పిచాయ్ తన స్కూల్ విద్యాభ్యాసంపై ఆసక్తిర విషయాల్ని పంచుకున్నారు. ఇంటర్వ్యూయర్ వికీపీడియా పేజీలో కనిపించిన స్కూల్ జాబితాను చూపించాడు. దానికి పిచాయ్ వికీపీడియాలో కనిపించిన పేర్లలో రెండు సరైనవేనని, అతను చెన్నైలోని వాణ వాణిలో తన పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు. తన ఎడ్యుకేషన్‌పై అనేక రూమర్లు వచ్చాయని, వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని పిచాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పిచాయ్ ఉన్నత విద్య విషయానికొస్తే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో తన బీటెక్‌ను, ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో మెటీరియల్ సైన్స్ విభాగంలో ఎంఎస్ చేయడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ చదివారు. ఆ తర్వాత 2004లో పిచాయ్ గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో లీడ్‌గా తన కెరియర్ను ప్రారంభించి అనతి కాలంలో గూగుల్ సీఈఓగా సుందార్ పిచాయ్ అవతరించారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్! -
అక్కడ చదివితే.. డిగ్రీలు చెల్లవు, ఉద్యోగాలు ఇవ్వం!
ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశాయి. భారతీయులు కానీ ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ కలిగిన వ్యక్తులు ఎటువంటి ఉన్నత విద్య కోసమైనా పాకిస్తాన్ వెళ్లవద్దంటూ సూచించింది. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్‌కి చెందిన యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో కోర్సులను అభ్యసిస్తే వాటిని గుర్తించమని తెలిపింది. ఈ కోర్సులు, సర్టిఫికేట్ల ఆధారంగా ఇండియాలో ఉద్యోగాలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాటకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఎవరైనా భారతీయ వలస కార్మికులు పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఉద్యోగులు, ఇతర అడ్మిషన్లు పొందేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. UGC & AICTE has advised students not to travel to Pakistan for pursuing higher education. pic.twitter.com/L1vl5XmotQ — ANI (@ANI) April 23, 2022 చదవండి👉🏾 అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు, స్థానిక డ్రైవర్ మృతి -
ఒకటి తర్వాత మరొకటి.. వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు..
సాక్షి,హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్కేయూ) నుంచి నగరంలోని విద్యార్థులకు వందల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్‌తో పాటు మూడు కన్సల్టెన్సీల నిర్వాహకులను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో కన్సల్టెన్సీ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇతడి విచారణలో కేతన్‌తో పాటు ఆ వర్సిటీ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగాధిపతి ఇ.విజయ్‌కుమార్‌కు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు తేలిందని సోమవారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. ► విజయవాడకు చెందిన పీకే వీరన్నస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. చాదర్‌ఘాట్ పరిధిలో వీఎస్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్ల దందా మొదలుపెట్టాడు. ► కేతన్ సింగ్‌తో పాటు విజయ్‌కుమార్‌తో ఒప్పందం చేసుకున్న ఇతగాడు ఈ పని మొదలెట్టాడు. డ్రాప్ఔట్స్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్లతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను కాలేజీల నుంచి సేకరిస్తున్నాడు. ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సంప్రదిస్తున్న వీరన్న స్వామి ఎలాంటి అడ్మిషన్లు, పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇస్తానని ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ► వీరన్న ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను వాట్సాప్ ద్వారా వర్సిటీలో ఉన్న కేతన్, విజయ్‌లకు పంపిస్తున్నాడు. వీటి ఆధారంగా బ్యాక్ డేట్స్‌తో డిగ్రీలు రూపొందిస్తున్న వాళ్లు వర్సిటీలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలా తయారు చేసిన డిగ్రీలను కోర్సును బట్టి రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షలు వరకు విక్రయిస్తున్నా రు. కొన్నాళ్లుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. ► సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సై శ్రీకాంత్ తదితరులతో కూడిన బృందం కన్సల్టెన్సీపై దాడి చేసింది. వీరన్నతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేయడానికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులైన కంభపు సాయి గౌతమ్ (కొత్తపేట), చిన్రెడ్డి రితీష్ రెడ్డి (వనస్థలిపురం), బచ్చు వెంకట సాయి సుమ రోహిత్ (ఫతేనగర్), మున్నా వెల్‌ఫ్రెడ్ (వికారాబాద్), కోసిమెత్తి సూర్యతేజ (మాదాపూర్), తుమ్మల సాయితేజ (బాచుపల్లి) పట్టుబడ్డారు. ► నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లు, స్టాంపులు తదితరాలను తదుపరి చర్యల నిమిత్తం చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే అరెస్టు అయిన కేతన్‌ను పీటీ వారెంట్‌పై ఈ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. పరారీలో ఉన్న విజయ్‌కుమార్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ విద్యాధికులే.. వివరాలు ఇవిగో
మతకల్లోలాలు, రాజకీయ వివాదాలు, వెనుకబాటుతనం, గూండాల అరాచకాలు వంటి అంశాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అధికార పీఠాన్ని అధిరోహించిన ముఖ్యమంత్రులంతా ఉన్నత విద్యను అభ్యసించినవారే. యూపీ మొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు మొత్తం 21 మంది అధికార పీఠంపై కూర్చోగా, అందులో 8 మంది గ్రాడ్యుయేట్లు కాగా, 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరో ఇద్దరు సీఎంలు పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్లు పొందగా, సీఎం బనారసీ దాస్ మాత్రం రాజకీయాల కోసం గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోనే వదిలేశారు. అయితే వీరిలో ఏడుగురు న్యాయశాస్త్ర డిగ్రీలను పొందారు. -
వారి చదువు ఆగరాదు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయిన చిన్నారుల చదువు మధ్యలో ఆగరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది వారి చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆయా చిన్నారుల ఫీజులు మాఫీ చేయాల్సిందిగా ప్రైవేటు యాజమాన్యాలను కోరాలని సూచించింది. లేదంటే సగం ఖర్చు ప్రభుత్వాలు భరించాలంది. ‘చిన్నారుల సంరక్షణ నిలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి’ సుమోటో కేసును గురువారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశంలో మార్చి 2020 నుంచి అనాథలైన లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారుల విద్యా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. కనీసం ప్రస్తుత విద్యాసంవత్సరమైనా ఆయా చిన్నారుల చదువు కొనసాగేలా చూడాలని తెలిపింది. ‘ఈ విద్యా సంవత్సరంలో ఆయా చిన్నారుల విద్యకు ఆటంకం రాకుండా చూసేలా వారు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడటానికి బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. తెలంగాణలో 221 మందికి లబ్ధి కరోనా వల్ల అనాథలైన 221 మంది చిన్నారులకు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్ట్ (ఐసీపీ) స్కీం ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (ఎస్ఐఆర్) ఆధారంగా 914 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరు కోల్పోయారని, వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందని చెప్పింది. ‘ఎస్ఐఆర్ను త్వరగా ఫైనలైజ్ చేయాలి. మూడు వారాల్లో బాల్‌స్వరాజ్ పోర్టల్‌లో సమాచారం అప్లోడ్ చేయాలి. 221 మంది అనాథల్లో 96 మందిని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చారు. వీరి చదువు పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. 914 మందిని కూడా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చాలి’ అని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
టీఐఎఫ్ఏసీ– ఉమెన్ సైంటిస్ట్ స్కీం
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్(టీఐఎఫ్ఏసీ).. ఉమెన్ సైంటిస్ట్ స్కీంలో ప్రవేశాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఉమెన్ సైంటిస్ట్ స్కీం–సీ: శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. అర్హతలు: మాస్టర్స్ ఇన్ సైన్స్/బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణత. వయసు: 01.04.2021 నాటికి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్ ► ఎమ్మెస్సీ(బేసిక్/అప్లయిడ్ సైన్సెస్)/బీటెక్/ఎంబీబీఎస్ తత్సమాన–నెలకు రూ.25వేలు. » ఎంఫిల్/ఎంటెక్/ఎంఫార్మా/ఎంవీఎస్సీ/తత్సమాన–నెలకు రూ.30వేలు. » పీహెచ్డీ(బేసిక్/అప్లయిడ్ సైన్సెస్/తత్సమాన)–నెలకు రూ.35వేలు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021 ► వెబ్సైట్: https://tifac.org.in -
డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్
డేటా సైన్స్.. బిగ్ డేటా.. డేటా అనలిటిక్స్.. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. డేటాకు ఎనలేని ప్రాధాన్యం పెరగడమే!! నేటి ఈ కామర్స్ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం... అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్ అంటున్నారు. డేటా అనలిటిక్స్ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్‌లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు. సేకరణ.. విశ్లేషణ ► గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి. ► డేటా అనలిటిక్స్ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం, కమ్యూనికేట్ చేయడంతోపాటు మార్కెట్‌ని అధ్యయనం చేయడం బిగ్ డేటా అనలిస్ట్ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు. విభిన్న నైపుణ్యాలు బిగ్ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్).. డేటాను స్టోర్ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం. ప్రోగ్రామింగ్‌పై పట్టు డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్వేర్ స్కిల్స్‌పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్‌పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్‌ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్ ది జాబ్ ప్రాజెక్ట్’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్‌లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్‌క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలి. అనలిస్ట్ కావడం ఎలా ► ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ/పీజీ చేసినవారికి డేటా అనలిస్టు కెరీర్ అనుకూలంగా ఉంటుంది. ఆసక్తిని బట్టి సంబంధిత సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసినవారు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా ఈ విభాగంలో రాణించవచ్చు. ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్‌ను నేర్చుకుంటూ,అప్డేట్గా ఉండాలి. ► ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు తమ కెరీర్‌ను మార్చుకునేందుకు అవసరాన్ని బట్టి ఆయా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసి.. డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో హడూప్ అండ్ స్పార్క్ బిగ్ డేటా ఫ్రేమ్ వర్క్స్‌ను కవర్ చేయడంతోపాటు రియల్ టైమ్ డేటా అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ స్పార్క్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో పట్టు సాధించాలంటే.. మొదట అభ్యర్థులకు కోర్ జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలామంది సర్టిఫికెట్ కోర్సులు చేసి కెరీర్ ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి డేటా అనలిటిక్స్‌లో రాణించాలంటే.. డేటాపై ఆసక్తితోపాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఐబీఎం లాంటి సంస్థలు సర్టిఫైడ్ బిగ్ డేటా ఇంజనీర్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్‌డేటా అప్లికేషన్స్‌లో హడూప్తోపాటు మ్యాప్ డిప్, హైవ్, స్క్రూప్, ఫ్రేమ్ వర్క్, ఇంపాలా, పిగ్, హెచ్‌బేస్, స్పార్క్, హెచ్‌డీఎఫ్‌ఎస్, యార్న్, ఫ్లూమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతోపాటు కొంత రియల్ టైమ్ అనుభవం పొందినవారు డేటా అనలిటిక్స్‌లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. పెరుగుతున్న మార్కెట్ ప్రస్తుతం డేటా అనలిటిక్స్ అనేది చక్కటి కెరీర్‌గా మారింది. డేటా అనలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం–డేటా అనలిటిక్స్ మార్కెట్.. 2021 చివరి నాటికి 84.6 బిలియన్ డాలర్లను చేరుతుందని అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్ప్ అండ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం–ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం 2022 నాటికి 274.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే లక్షన్నర మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. బిగ్ డేటా అనలిస్ట్ వేతనాలు ఏదైనా కెరీర్ ఎంచుకునే ముందు వేతనంతోపాటు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. భవిష్యత్‌లోనూ డేటా అనలిస్ట్‌లకు చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్టులకు ఎంట్రీ లెవెల్లో సగటు వార్షిక వేతనం రూ.6.5 లక్షలుగా ఉంది. అనుభవం ఉన్నవారికి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు. -
Neena Nizar: ఇది నాకు పెద్ద షాక్.. పేరు లేని విలన్ కాటేసింది!
ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాటం ఎక్కడా ఆపకూడదని... ఎన్ని ఒడిదొడుకులకు లోనైనా ఎక్కడా ఆగిపోకూడదని... నినా నైజర్ జీవితం చాటి చెబుతుంది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి వెంటాడినా ఆ వ్యాధి తనను వీల్‌చెయిర్‌కే పరిమితం చేసినా చదువుల రాణిగా వర్ధిల్లింది. మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగింది. తనకు పుట్టిన పిల్లలనూ అదే వ్యాధి కబళించి అడుగడుగునా నిరాశ తరుముతున్నా విధి విసిరిన ఛాలెంజ్‌ను చిరునవ్వుతో స్వీకరించింది. ‘అరుదైన వ్యాధి కారణంగా మేం ఒంటరిగా, బలహీనులుగా అనిపించవచ్చు. కానీ, మా కథను పంచుకోవడం ద్వారా చావు అంచున నిలబడిన వారిలో చిన్న ఆశను మిగిలిస్తే చాలు’ అంటోంది నీనా నైజర్. నాలుగు పదుల వయసు దాటిన నీనా నైజర్ దుబాయిలో ఓ వ్యాపారస్తుడి కుటుంబంలో పుట్టింది. పుట్టుకతోనే వెన్నెముకలో అరుదైన వ్యాధికి లోనైంది. ఏళ్లకేళ్లుగా చికిత్స జరుగుతూనే ఉంది. కానీ, వ్యాధి పేరేంటో తెలియలేదు. వెన్నెముకలో లోపాల వల్ల శరీరం అంతగా ఎదగలేదు. ఈ కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యింది. ఇండియా వచ్చి వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకుంది. లండన్, అమెరికాలోనూ ట్రీట్మెంట్ తీసుకుంది. ఏమంత ప్రయోజనం లేకపోయింది. అయినా ఆమె చదువుల తల్లిని వదిలిపెట్టలేదు. పీహెచ్‌డి పట్టా పుచ్చుకొని.. ‘చదువు ధైర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. అందుకే, నా దృష్టి అంతా చదువు మీదే. నాకు 16 ఏళ్ల వయసులో అమెరికాలోని క్రైటన్ విశ్వవిద్యాలయం లో చదువుకోవడానికి పూర్తి స్కాలర్షిప్ తో అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా శరీరం శస్త్రచికిత్సల కారణం గా మరింత బలహీనంగా ఉంది. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. అంతదూరం పంపించడానికి ఒప్పుకోలేదు. కానీ, నేను చదువుకోవాల్సిందే అని బలంగా చెప్పి, వెళ్లాను. 2018 లో క్రైటన్ విశ్వవిద్యాలయం నుండి ఎడ్యుకేషన్ లీడర్‌షిప్‌లో పీహెచ్‌డి పట్టాతో బయటకు వచ్చాను’ అని వివరించే నినా నైజర్ చదువులోనే కాదు వ్యాస రచన, పెయింటింగ్, చర్చాపోటీల్లో అనేక బహుమతులు గెలుచుకుంది. దేశవిదేశాల్లో మోటివేషనల్ స్పీచుల్లో పాల్గొంది. తలకిందులైన ప్రపంచం.. పునర్నిర్మాణం తను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే ఆడమ్‌ను కలుసుకున్న నినా పెళ్లి తర్వాత ప్రయాణం గురించి వివరిస్తూ ‘పిల్లలు కలగరనే భయంతో పెళ్లే వద్దనుకున్నాను. ఆడమ్ తన ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను’ అని వైవాహిక జీవితం గురించి ఆనందంగా చెప్పే నైజర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. నైజర్కు మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలాంటి లోపం కనిపించలేదు. చాలా ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత పుట్టిన చిన్నకొడుకులో మాత్రం పుట్టుకతోనే అరుదైన వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద కొడుకుని పరీక్షించడంతో వాడిలోనూ ఈ అరుదైన సమస్య ఉందని, ఇది మెటాఫిసల్ కొండ్రోడైస్పా›్లసియా అని, జన్యుపరమైనదని వైద్యులు తేల్చారు. ‘ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను’ అంటున్న నినా, తన ఇద్దరు కుమారులతో వైద్య పరిశోధనల్లో భాగమైంది. ముగ్గురూ వీల్చైర్లలో ఉండటంతో వారు ఇంటి నుండి బయటకు రావాలంటే మరొకరి సహాయం కావాలి. కానీ, తన కుటుంబంలో నిత్యం నవ్వులు పూయించడానికి తపిస్తూనే ఉంది నినా. ‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇది వైకల్యం ఉన్నవారిలో కలిగే స్వతంత్ర భావనగా నేను ఆనందిస్తాను. మీ లక్ష్యం కేవలం ప్రయాణికుడిగా ఉంటే చాలదు, జీవితానికి బాధ్యత వహించాలి. ఈ రోజు నా కొడుకులు అర్షాన్, జహాన్ సూపర్ హీరోల్లా నాకు కనిపిస్తుంటారు. వారి ఆటపాటలు, అల్లరిని చూస్తుంటే ఎంతటి శత్రువునైనా ఓడించగల బలం వచ్చేస్తుంది’ అని ఆనందంగా వివరిస్తుంది నినా నైజర్. ఇప్పటికీ జీవితంలోని ఒడిదొడుకులను సవాళ్లుగా తీసుకొని చిరునవ్వుతో నిత్య పోరాటం చేస్తున్న నినా నైజర్ ఎంతో మంది నిరాశావాదులకు ఆశాదీపంలా కనిపిస్తుంది. ఇది నాకు పెద్ద షాక్. ఈ విషయం తెలియగానే నా ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. నా శరీరం లోపల పేరులేని విలన్ నన్ను ఇంకా కృంగదీయాలనే చూసింది. కానీ, ఈ అరుదైన ప్రయాణంలో నా కుమారులతో కలిసి నడవాలనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇది కష్టమైన మార్గం అని నాకు తెలుసు. కానీ, ఆ మార్గంలో చిరునవ్వుతో బయల్దేరాను. – నినా నైజర్ భర్త, పిల్లలతో నినా నైజర్ -
ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్ సైన్స్!
ఇంటర్మీడియెట్ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్–2021 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్ పరీక్ష విధానం, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం... బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. ఐఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, అసోసియేట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఫెలో మెంబర్షిప్ ప్రోగ్రా మ్. ఈ మూడు దశల ప్రోగ్రామ్‌లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తొలి దశ.. స్టూడెంట్ మెంబర్షిప్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే మూ డు మెంబర్షిప్ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్‌లో అర్హత సాధించినట్టు భావిస్తారు. ఏసెట్ తర్వాత దశలు ► ఏసీఈటీ(ఏసెట్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ► స్టేజ్–1: కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి. ► స్టేజ్–2: కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ► స్టేజ్–3: స్పెషలిస్ట్ టెక్నిషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ► స్టేజ్–4: స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్‌కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. స్టేజ్–1, 2లు పూర్తి చేసుకుంటే.. అసోసియేట్ మెంబర్ ► ఏసెట్‌లో అర్హత సాధించి.. స్టూడెంట్ మెంబర్ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. ► స్టేజ్–3, స్టేజ్–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. కామర్స్, మ్యాథ్స్–అనుకూలం యాక్చూరియల్ సైన్స్ కోర్సులోని పేపర్లు, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. విస్తృత అవకాశాలు ప్రస్తుతం యాక్చూరియల్ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్ మెంబర్ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్ సైన్స్‌లో సర్టిఫికెట్తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, అండర్ రైటర్స్, అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. యాక్చుయరీస్ విధులు బీమా సంస్థల్లో యాక్చురియల్ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రధాన ఉపాధి వేదికలు యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. నాన్–ఏసీఈటీ విధానం ఐఏఐ ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఏసెట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్ సైన్స్ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 2021కు నోటిఫికేషన్ ► యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్ పరీక్ష– 2021 జూన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో ఏసెట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. ► అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఏసెట్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2021 ► పరీక్ష తేదీ: జూన్ 26, 2021 ► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.actuariesindia.org/index.aspx -
టీఎస్ ఈసెట్ 2021: ముఖ్యసమాచారం
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీఎస్ ఈసెట్)–2021 నోటిఫికేషన్ వెలువడింది. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం... అర్హతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండళ్లు గుర్తించిన డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణులు; మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌కు హాజరవ్వొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఫార్మసీలో ప్రవేశానికి అర్హత లేదు. ఆయా కోర్సులు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత 40 శాతం. పరీక్ష స్వరూపం ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు ఈ స్ట్రీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ► మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్(విభాగం) మాత్రం అభ్యర్థి బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. బీఎస్సీ(మ్యాథ్స్) బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు పరీక్ష స్వరూపం కింది విధంగా ఉంటుంది. ఫార్మసీ స్ట్రీమ్ అర్హత మార్కులు అభ్యర్థులు నాలుగు సబ్జెక్టుల్లో(బీఎస్సీ అభ్యర్థులకు మూడు సబ్జెక్టులు) కలిపి సగటున కనీసం 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు వర్తించవు. అర్హత– బ్రాంచ్‌లు ► టీఎస్ ఈసెట్ సబ్జెక్టు పేపర్లు వారీగా అర్హత డిప్లొమా స్పెషలైజేషన్స్.... ► కెమికల్ ఇంజనీరింగ్ పేపర్: సిరామిక్, లెదర్, టెక్స్టైల్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్–పెట్రోకెమికల్,కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్–షుగర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► సివిల్ ఇంజనీరింగ్ పేపర్: సివిల్, సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పేపర్: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ► మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ,డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్: మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్. ► మైనింగ్ ఇంజనీరింగ్ పేపర్: మైనింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ముఖ్యసమాచారం ► ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 17,2021 ► దరఖాస్తు ఫీజు: జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400. ► పరీక్ష తేదీ: జూలై 1, 2021 ► ఉదయం సెషన్ (ఉ.9 గం–మ.12 గం)–ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ పేపర్లు ► మధ్యాహ్నం సెషన్ (మ.3 గం–సా.3 గం)–సీఐవీ, సీహెచ్ఈ, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం పేపర్లు. ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in -
స్టడీ అబ్రాడ్: ఈ పొరపాట్లు లేకుంటే కల సాకారమే!
దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల స్వప్నం.. స్టడీ అబ్రాడ్. ఈ కలను సాకారం చేసుకోవాలని ఎంతోమంది కష్టపడుతుంటారు. కానీ, విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా,సుదీర్ఘంగా ఉంటుంది. దాంతో విద్యార్థులు అప్లికేషన్ దశలోనే పొరపాట్లు చేస్తూ.. ఇబ్బందుల్లో పడుతున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో.. కాస్త అప్రమత్తంగా ఉంటే .. విదేశాల్లో చదువుకోవాలనే తమ కలను నిజం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులు చేస్తున్న పొరపాట్లు–వాటిని అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం.. రీసెర్చ్ లేదు రీసెర్చ్ చేయకపోవడం.. ఇది స్టడీ అబ్రాడ్ అభ్యర్థులు చేస్తున్న తప్పిదాల్లో ముందు వరుసలో ఉంది. చాలామంది అభ్యర్థులు దేశం, విశ్వవిద్యాలయం, కోర్సులు, ఆర్థిక ప్రో త్సాహకాలు(స్కాలర్షిప్స్), ఫీజులు, ప్రవేశ విధానాలు, క్యాంపస్, లొకేషన్, వాతావరణం, లివింగ్ కాస్ట్ వంటి అంశా లపై లోతుగా అధ్యయనంచేసి.. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. దాంతో వారి జాబితాలో కేవలం కొన్ని యూనివర్సిటీలు, కోర్సులు మాత్రమే ఉంటున్నాయి. ఫలితంగా స్టడీ అబ్రాడ్ కల క్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఆన్లైన్లో సమస్త సమాచారం లభ్యమవుతోంది. అభ్యర్థులు సరైన రీసెర్చ్‌తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సరైన వ్యక్తికి సరైన ప్రశ్న! విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ కనీసం ఒక అడ్మిషన్ కౌన్సెల ర్ను నియమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అవస రమైన సలహాలు, సూచనలు, గైడెన్స్ అందించడం వీరి ప్రధాన విధిగా ఉంటుంది. కాబట్టి స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక అభ్యర్థుల సందేహాల నివృత్తికి నేరుగా వర్సిటీని మెయిల్ ద్వారా సంప్రదించొచ్చు. తద్వారా సరైన వ్యక్తి నుంచి సరైన పరిష్కారాన్ని పొందవచ్చు. ఇలా చేయకుండా.. గూగుల్‌లో తోచింది బ్రౌజ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు నిపుణులు. ప్రణాళిక లేమి భారత్‌లో మాదిరిగా విదేశీ యూనివర్సిటీలు, ఇన్స్టి ట్యూట్స్.. ఒకే సమయంలో ప్రవేశ ప్రక్రియను ప్రారం భించవు. ప్రతి వర్సిటీ, ఇన్స్టిట్యూట్ తనదైన ప్రత్యేక అడ్మిషన్ షెడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అనేక ఇన్స్టి ట్యూట్లు ఏడాది పొడవునా దరఖాస్తులు ఆహ్వానిస్తే.. మరికొన్ని మూడు గడువుల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తు న్నాయి. కాబట్టి అభ్యర్థులు అడ్మిషన్‌కు ఒక సంవత్సరం ముందుగానే మానసికంగా,డాక్యుమెంటేషన్ పరంగా సిద్ధం కావడం ప్రారంభించాలి. అడ్మిషన్ కౌన్సెలర్లు కేవలం విశ్వ విద్యాలయ అంశాల్లోనే అభ్యర్థులకు సహాయపడగలరు. వీసా సంబంధిత విషయాల్లో వారి నుంచి ఎలాంటి తో డ్పాటు అందదు. కాబట్టి వీసా ప్రక్రియను అభ్యర్థులు సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సహనం కోల్పోకుండా.. ఓపిగ్గా ఒక్కో అడుగు వేయాలి. సీటు దక్కితే చాలదు స్టడీ అబ్రాడ్ పరంగా విద్యార్థులు విశ్వవిద్యాలయంలో సీటు దక్కితే చాలు..వీసా ప్రక్రియ పూర్తయితే సరిపోతుంది అనే కోణంలో ఆలోచిస్తుంటారు. కానీ, వీటితోపాటు సదరు దేశంలో, వర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత స్డూడెంట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే కోణంలోనూ ఆలోచించాలి. తరగ తులు ప్రారంభమైన తర్వాత అందుబాటులో ఉండే ప్రత్యా మ్నాయాలు? డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలను కుంటున్నారు? తదితర అంశాలపై స్పష్టతతో వ్యవహరిం చాలి. దీనికోసం ముందుగా ఇంటర్న్షిప్స్, ఫ్యాకల్టీ, మెంటార్స్, క్లబ్స్ వంటి విషయాల్లో తగిన రీసెర్చ్ చేయాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్ఓపీ) విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియలో.. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్వోపీ) చాలా కీలకం. ఇందులో అభ్యర్థులు స్వీయ విజ యాలు, లక్ష్యాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఆఫీసర్స్.. ఈ ఎస్వోపీ ఆధారంగా అభ్యర్థి యూనివర్సి టీలో ప్రవేశానికి అర్హుడా? కాదా?అనే విషయంపై ఒక నిర్ణ యానికి వస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన విజయాలతోపాటు ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో ప్రవేశం, స్పోర్ట్స్ వంటి వాటినీ ఎస్‌వోపీలో పేర్కొనాలి. వీటిని ప్రస్తావించే సమయంలో నిజాయితీగా వ్యవ హరించాలి. ఎస్వోపీ రూపకల్పనలో గొప్పలకు పోవడం మంచికాదు. అలాగే సాధించిన విజయాలను తక్కువ చేసుకోవడం చేయరాదు. ఉన్నది ఉన్నట్లు రాయాలి. ఫాల్, స్రింగ్.. ఏది బెటర్ విదేశీ యూనివర్సిటీలు ఫాల్ సెషన్,స్ప్రింగ్ సెషన్ పేరుతో ఏటా రెండుసార్లు అడ్మిషన్స్ కల్పిస్తాయి. కానీ, చాలా మంది విద్యార్థులకు ఏ సెషన్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో పూర్తి స్పష్టత ఉండదు. ఈ రెండు సెషన్ల మధ్య తేడాల గురించి విద్యార్థులు తప్ప నిసరిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఈ రెండు సెషన్ల విషయంలో బోధన, కోర్సులు, ఇతర ప్రోత్సాహకాల పరంగా అనేక వ్యత్యాసాలు ఉంటాయి. సెమిస్టర్ ప్రారంభం.. ఇలా ప్రతి ఏటా ఫాల్ సెషన్ ఆగస్టులో, స్ప్రింగ్ సెషన్ జనవరిలో ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ సదరు సెషన్ ప్రారంభానికి ఆరు నెలల ముందుగానే మొదలవుతుంది. ఫాల్ సెషన్ అడ్మిషన్ల కోసం జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు; స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో యూనివర్సిటీలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. వీటికి అదనంగా మరికొన్ని విశ్వవిద్యాలయాలు రోలింగ్ అడ్మిషన్ల పేరిట ఏడాది పొడవునా దరఖాస్తు ప్రక్రియ చేపడుతుంటాయి. వీటి సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు. ‘ఫాల్’కే మొగ్గు మన దేశం నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఫాల్ సెషన్ అడ్మిషన్లకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కాగానే..ఎక్కువ కాలం వేచి ఉండకుండా.. విదేశీ వర్సిటీలో అడుగు పెట్టొచ్చు అనే ఆలోచనే. విదేశీ యూనివర్సిటీలు కూడా ఫాల్ సెషన్లోనే ఎక్కువ కోర్సులు, సీట్లను అందుబాటులో ఉంచు తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు వారు మెచ్చిన కోర్సులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు వీటితోపాటు మరికొన్ని అంశాలు కూడా విద్యార్థులు ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కారణమవుతున్నాయి. వీటిలో ప్రధానంగా పేర్కొనాల్సింది.. యూనివర్సిటీలు అం దించే స్కాలర్షిప్స్(ఆర్థిక ప్రోత్సాహకాలు). ఫాల్ సెషన్‌కు ఇతర సెషన్స్‌తో పోల్చితే వర్సిటీలు స్కాలర్షిప్స్ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో అకడమిక్‌గా మంచి ప్రొఫైల్ ఉన్న విద్యార్థులకు ఫాల్ సెషన్లో స్కాలర్షిప్స్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ ఫాల్ సెషన్ విద్యార్థులకు కలిసొస్తున్న మరో అంశం.. టీచింగ్ అసిస్టెంట్‌షిప్. అంటే.. ఒక కోర్సులో చేరిన విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించి ప్రొఫెసర్ల వద్ద టీచింగ్ అసిస్టెం ట్‌గా సహకారం అందించడం. విద్యార్థులు అదనపు తరగ తులు, మూల్యాంకన, పరీక్షల ఇన్విజిలేషన్ తదితర అంశా ల్లో సహకారం అందించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధిలో ఉండే ఈ టీచింగ్ అసిస్టెంట్‌షిప్ అవకాశాలు ఫాల్ సెషన్లో ఎక్కుగా లభిస్తాయి. కారణం.. ఫాల్ సెషన్లోనే ఎక్కువ ప్రవేశాలు కల్పించే విధానాన్ని యూనివర్సిటీలు అనుసరి స్తుండటమే. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ పొందే విషయంలో.. భారత విద్యార్థులు ఇతర దేశాల విద్యార్థులతో పోల్చితే ముందుంటున్నారు. భారత విద్యార్థుల్లో కష్టపడే తత్వం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కువగా ఉండటంతో ప్రొఫెసర్లు సైతం మన విద్యార్థులను తమ అసిస్టెంట్స్‌గా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. స్ప్రింగ్ ఇలా డిసెంబర్/జనవరిలో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్లో.. ఫాల్ సెషన్‌తో పోల్చితే అందుబాటులో ఉండే కోర్సులు, ఇతర ప్రోత్సాహకాలు కొంచెం తక్కువ. అలాగని విద్యార్థులు స్ప్రింగ్ సెషన్లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని భావించాల్సిన పనిలేదు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత స్టడీ అబ్రాడ్ వైపు దృష్టిసారించే వారికి స్ప్రింగ్ సెషన్ అందుబాటులో ఉంటుంది. కొందరు విద్యార్థులు స్టాండర్ట్ టెస్ట్ స్కోర్లను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో.. ఆయా టెస్ట్‌లను మరోసారి రాద్దాం అనే వ్యూహంతో అడుగులు వేస్తూ ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోరు. ఇలాంటి విద్యార్థులకు స్ప్రింగ్ సెషన్లో సానుకూలతలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం సరైన ఆలోచన కాదు. ఫాల్, స్ప్రింగ్ సెషన్ ఏదైనా.. బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేరేందుకు కృషి చేయాలి. ఫాల్ సెషన్లో తక్కువ ర్యాంకు ఇన్స్టిట్యూట్లో చేరడం కంటే.. స్ప్రింగ్ సెషన్లో బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడం మేలని గుర్తించాలి. అంతేతప్ప.. స్కాలర్షిప్స్, టీచింగ్ అసిస్టెన్స్ అవకాశాలు తక్కువనే ఆలోచనతో స్ప్రింగ్ సెషన్‌ను విస్మరించరాదు. దరఖాస్తు చేసుకుంటున్న యూనివర్సిటీల్లో, ఆసక్తి గల కోర్సుకు స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని స్ప్రింగ్ సెషన్ ఔత్సాహికులు పరిశీలించాలి. వ్యత్యాసాలు ఫాల్ సెషన్: విద్యార్థుల నుంచి డిమాండ్ ఎక్కువ. అంతే స్థాయిలో అందించే కోర్సుల సంఖ్య కూడా ఎక్కువే. ► బ్యాచిలర్ డిగ్రీ పూర్తవుతూనే అబ్రాడ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ సెషన్ అనుకూలం. ► స్కాలర్షిప్స్, అందుబాటులోని కోర్సుల పరంగా మెరుగైన అవకాశాలు. స్ప్రింగ్ సెషన్: తక్కువ డిమాండ్, తక్కువ సంఖ్యలో కోర్సులు. టెస్ట్ స్కోర్స్ ఉత్తమంగా ఉండి మరో ఏడాది వృథా చేయడం ఎందుకు అనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. ► స్కాలర్షిప్స్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ► మొదటి సంవత్సరంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ అవకాశం లేకపోవడం ప్రతికూలత. ఇవెంతో కీలకం ► ఏ సెషన్ అయినా.. విద్యార్థులు కంట్రీ, కాలేజ్, కోర్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నచ్చిన కోర్సు కేవలం ఒక సెషన్లో మాత్రమే అందుబాటులో ఉంటే ఆ సెషన్‌కే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ రెండు సెషన్స్‌లోనూ ఉంటే ప్రొఫైల్‌ను మరింత పటిష్టంగా దరఖాస్తు చేసుకుంటే.. స్కాలర్షిప్ దక్కే అవకాశాలు మెరుగవుతాయి. రెండో ప్రామాణికం ‘కాలేజ్’ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం విద్యార్థులు బెస్ట్ కాలేజ్‌లో సీటు లభించాలంటే.. జీఆర్ఈ/ఐఈఎల్టీఎస్ / జీమ్యాట్ తదితర టెస్ట్ స్కోర్స్ అత్యంత మెరుగ్గా ఉండాలని భావిస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.. కాలేజ్‌లు కేవలం టెస్ట్ స్కోర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. అభ్యర్థుల ప్రొఫైల్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రొఫైల్ మెరుగ్గా ఉండేలా వ్యవహరించాలి. విద్యార్థులకు అత్యున్నత ఆయుధం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఈ ఎస్ఓపీని అత్యంత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేలా కసరత్తు చేయాలి. ► బెస్ట్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్/కాలేజ్‌లు ఉన్న దేశాన్ని గమ్యంగా ఎంచుకోవాలి. చేరాలనుకుంటున్న కోర్సులో అత్యుత్తమ బోధన అందించే కళాశాలలు ఉన్న దేశాలను అన్వేషించి.. వాటి నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫాల్ సెషన్లో అడ్మిషన్ లభించకపోయినా ఫర్వాలేదు.. బెస్ట్ కాలేజే లక్ష్యం అనుకొని స్ప్రింగ్ సెషన్ వైపు మొగ్గు చూపే విద్యార్థులు.. ఈ రెండు సెషన్ల దరఖాస్తు సమయానికి మధ్య ఉండే వ్యవధిని ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవ డానికి వినియోగించుకోవాలి. ఆన్లైన్ కోర్సులు అభ్యసించడం, రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం, టెక్నికల్ పేపర్స్ పబ్లిష్ చేయడం వంటి వాటికి సమయం కేటాయించాలి. స్టడీ అబ్రాడ్.. డాక్యుమెంట్స్ ► అప్లికేషన్, కవరింగ్ లెటర్ ► అప్లికేషన్ ఫీజు ► జీఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, ఎస్ఏటీ పరీక్షల్లో స్కోరు. ► స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ► లెటర్ ఆఫ్ రికమండేషన్ ► వ్యాసాలు ఠి అకడమిక్ సర్టిఫికెట్లు ► ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ► పాస్‌పోర్ట్ ఠి స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయపు పన్ను స్టేట్మెంట్ -
అక్కా... మళ్లీ బడికి పోదామా
స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు అని పెద్దలు అంటారు. కాని ఈ దేశంలో అమ్మాయిని ఒక రకంగా, అబ్బాయిని ఒక రకంగా చదివించే పరిస్థితులు ఉన్నాయి. చిన్నప్పుడు చదువు మానేసి పెళ్లి, కుటుంబం బాధ్యతలలో పడిపోయి హటాత్తుగా తిరిగి చదువుకోవాలనుకునే స్త్రీలకు మార్గం ఉందా? ఉంది. ఈ స్త్రీలు చదువుకుంటున్నారు. ఇలా చదువుకోవాలనుకుంటున్న స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ముప్పై ఏళ్ల క్రితం మమత చదువు ఏడవ తరగతితో ఆగిపోయింది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఆమెకు సపర్యలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చదువుకోవాలనే ఇష్టం ఉన్నా ఇంటి వద్దే ఉండిపోయింది. ఆ తర్వాత మరో పదేళ్లకు ఇల్లాలయ్యింది. అత్తింటి బాధ్యతల బరువులో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఏడవ తరగతిలో అటకెక్కిన చదువు మళ్లీ ఆమెకు ఎప్పుడూ గుర్తుకురాలేదు. ఆ అవసరమూ లేదనుకుంది. ఇద్దరు పిల్లల్ని బడికి పంపడం, ఎలక్ట్రీషియన్ అయిన భర్తకు క్యారేజీ సర్ది ఇవ్వడం, ఇంటిల్లిపాది బాగోగులు చూసుకోవడంవంటి పనులలో మునిగితెలింది. పిల్లలిద్దరూ డిగ్రీ స్థాయికి వచ్చేశారు. ఉదయాన్నే పిల్లలు, భర్త ముగ్గురూ బయటకు వెళ్లిపోతారు. తనకు ఇప్పుడు కాస్తంత తీరిక దొరికింది. తోటి వారితో ఓ మహిళా సంఘంలో చేరింది. అక్కడ తెలిసింది మమతకు చదువుకోకపోవడంలో తలెత్తిన ఇబ్బందులు. ఏ అప్లికేషన్ నింపాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా బెరుకుగా ఉండేది. చదువుకోకపోవడంతో ఎవరో ఒకరి సహాయం తప్పనిసరి అయ్యింది. తనే చదువుకుంటే ఇలా ఇబ్బందులు పడేదాన్ని కాదనుకుంది. ఆగిపోయిన చదువు మళ్లీ చదువుకుంటే అనుకుంది. కానీ, ఇంత పెద్దదాన్ని అయ్యాక ఇప్పుడేం చదువుకుంటాం అని నిట్టూర్చింది. కానీ ఆమె కలకు ఓ ఎడ్యుకేషనల్ ఎన్జీవో సంస్థ భరోసాగా నిలిచింది. ఓపెన్ విద్యా విధానం ద్వారా ఇప్పుడు మమత పదోతరగతి చదువుతోంది. వదిలిన చదువు హైదరాబాద్ శివారులోని బాలాపూర్ గ్రామంలో బాలాపూర్ యూత్‌కు వెళితే ఓ పాతికమంది మహిళలు ఎప్పుడో వదిలేసుకున్న తమ కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండటం మనం చూడచ్చు. అక్కడ పదహారేళ్ల వయసు నుంచి నలభై ఐదేళ్లు వయసున్న మహిళలు ఉన్నత విద్యను చదువుకుంటూ కనిపిస్తారు. ఆడపిల్లలకు చదువెందుకు అనే పెద్దల వల్ల కొందరు ప్రైమరీ పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తే, కొందరు టెన్త్ క్లాస్ ఫెయిలయ్యి ఆ తర్వాత చదువు కొనసాగించలేక మానేసిన వారున్నారు. ఇంకొందరు వారి ఇంటి ఆర్థిక స్థితి సరిగా లేక చిన్నప్పుడే ఇంటెడు బాధ్యతలు మోసినవారున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక తమ గురించి ఆలోచించుకునే స్థాయిని కూడా మర్చిపోయినవారున్నారు. అలాంటి కొంతమంది మహిళలు ఇప్పుడు మళ్ళీ పుస్తకాలను ముందేసుకొని ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుంటూ పదాలను నేర్చుకుంటున్నారు. తమ పంథాన్ని మార్చుకుంటున్నారు. పదవతరగతి పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని కొందరు, ఇంటర్.. డిగ్రీ స్థాయి చదువులు చదువుకోవాలని మరికొందరు, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని తమ కాళ్ల మీద తాము నిలబడాలని కలలు కంటున్నవారు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఎప్పుడో వదిలేసిన చదువును ఇప్పుడు కొనసాగిస్తూ ఆ స్థాయికి తగిన ఉదోగ్యాలు పొందిన వారూ ఉన్నారు. జీవితంలో మరో అవకాశాన్ని పొదివిపట్టుకొని ముందడుగు వేయాలని కలలు కంటున్నవారు ఉన్నారు. వారి కలలు సాకారం కావాలని కోరుకుందాం. డిగ్రీ చేస్తాను నాకు ముగ్గురు అమ్మాయిలు. నా చదువు స్కూల్ వయసులోనే ఆగిపోయింది. అందుకే ముగ్గురినీ చదివిస్తున్నాను. మా పిల్లలకు చదువు విషయంలో ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నాకు మళ్లీ చదువుకునే అవకాశం వచ్చింది. పదోతరగతి ఆపేయకుండా డిగ్రీ కూడా పూర్తి చేస్తాను. – సునీత అదనపు అర్హత ఇంటికి ఆసరా కావాలంటే ఏదైనా ఉద్యోగం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్ కూడా లేని మాకు ఏ ఉద్యోగం వస్తుంది. ఎక్కడికెళ్లినా ‘పదోతరగతి చదివారా.. సర్టిఫికెట్ ఉందా!’ అని అడిగేవారు. దీంతో ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలని ఉన్నా ధైర్యం చేయలేకపోయాను. ఇరవై ఏళ్ల క్రితం టెన్త్‌లోనే నా చదువు ఆగిపోయింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. వారి బాగోగులు. ఇప్పుడు టెన్త్ పాసై ఇంటర్ కూడా చదవాలనుకుంటున్నాను. – జయశ్రీ మా అబ్బాయి నేనూ ఒకే క్లాస్ కాస్త తీరిక దొరికితే ఏదైనా పుస్తకం చదవాలనుకున్నా ఒక్కో అక్షరం కూడబలుక్కొని చదవాల్సి వచ్చేది. చిన్నప్పుడు మానేసిన చదువు ఇప్పుడు పూర్తి చేస్తా. ఈ నాలుగు నెలలుగా అవన్నీ గుర్తుతెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మా అబ్బాయితో పాటు నేనూ పదోతరగతి చదువుకుంటున్నాను. – వసంత ఇంగ్లిష్‌లో మాట్లాడాలి ఇంగ్లిషులో మాట్లాడాలనేది నా కల. కానీ, చదువుకోలేదు. ఎప్పుడూ ప్రయత్నించలేదు. చిన్నప్పుడు ఆపేసిన చదువును కొనసాగిస్తున్నాను. ఇంగ్లిషు నేర్చుకుంటున్నాను. – మమత బేసిక్స్ నుంచి మొదలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ చదువుకోవచ్చు. జూన్‌లో మొదలైన ఈ క్లాసులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేవరకు ఉంటాయి. ఆ తర్వాత కూడా వీరి అభిరుచి మేరకు వృత్తి విద్య కోర్సులు నేర్చుకోవచ్చు. మొదటి నాలుగు నెలలు అఆ లు, ఏబీసీడీల వంటి బేసిక్ చదువు చెప్తాం. కొన్నేళ్ల క్రితం వదిలేసిన చదువును కొనసాగించాలంటే బేసిక్స్ తప్పనిసరి. ఆ తర్వాత ఐదు సబ్జెక్టులనూ బోధిస్తున్నాం. – చిన్నికృష్ణ, ఇన్‌ఛార్జి, ప్రతన్ ఎడ్యుకేషన్ సంస్థ – నిర్మలారెడ్డి ఫొటోలు: సోమ సుభాష్ -
పెద్దల చదువుల మర్మమేమి?
డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిషాంక్ మన విద్యా శాఖ మంత్రి, కవి, సాహితీవేత్త. హిందీలో పేరెన్నికగన్న రచయిత. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కొలంబోలో ఉన్న ఒక అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీ ఆయనగారికి సాహిత్యంలో విశిష్టమైన సేవలందించారని ఒక డాక్టరేట్, అంతకుముందు శాస్త్రీయరంగంలో రచనలకు మరొక డాక్టరేట్ ఇచ్చింది. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ ఒకటి, ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వవిద్యాలయం మరొక గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. అయితే విచిత్రమేమంటే శ్రీలంకలో అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీకి అసలు యూనివర్సిటీగా గుర్తింపు లేదు. శ్రీలంకలోని యూజీసీ కూడా దాన్ని గుర్తించలేదు. ఇతరదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపు లేకపోతే మన యూజీసీ కూడా అంగీకరించదు. వారిచ్చే డిగ్రీలకు విలువ ఇవ్వదు. అంతేకాదు. మన దేశంలో సిఎస్ఐఆర్ (సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ సెంటర్) 1998లో దేశంలోని అన్ని జాతీయ ప్రయోగశాలలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ శ్రీలంక విశ్వవిద్యాలయం ఇచ్చే డిఎస్సీ డిగ్రీలను గానీ, మరే ఇతర డిగ్రీలను గానీ యూజీసీ గుర్తించలేదని, కనుక ఆ డిగ్రీలు చెల్లవని చాలా స్పష్టంగా పేర్కొంది. ఇటువంటి అద్భుతమైన సంస్థ ఇచ్చిన డిగ్రీలను వాడుకోవడం, పేరు ముందు డాక్టర్ అని తగిలించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోగా, ఇచ్చిన యూనివర్సిటీ వారు తాము భారతదేశంలో ఉన్న ఒక పెద్ద ముఖ్యమంత్రిగారికి గౌరవప్రదమైన డాక్టరేట్ డిగ్రీ ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడమే కాకుండా, తమ అత్యున్నత ప్రమాణాలకు దీన్ని కొలమానంగా చూపుతూ ఫోటోగ్రాఫులకు విపరీతంగా ప్రచారం ఇచ్చి, మరికొంత మంది అమాయకులను వలలోవేసుకుంటాయి. పోక్రియాల్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరును డాక్టర్ రమేష్ పోక్రియాల్ అని చెప్పుకుంటూ ప్రమాణం చేశారు. డాక్టర్ రమేష్ గారి ప్రత్యర్థి అయిన మనోజ్ వర్మ డాక్టర్ అనే బిరుదును వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, కనుక ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రంలో తాను డాక్టర్‌నని చెప్పుకోవడం చెల్లదని, అందువల్ల ఆయన ఎన్నిక కూడా చెల్లదని మనోజ్ వర్మ వాదించారు. ఈ మనోజ్ వర్మ కాంగ్రెస్ నాయకుడు కాదు. కమ్యూనిస్టు అంతకన్నా కాదు. స్వయంగా ఆయన కూడా బీజేపీ నాయకుడే. ఒక ఎన్నికను రాష్ట్రపతి ఈ విధంగా రద్దు చేయడానికి ప్రకటనలు చేసే అధికా రం ఉండకపోవచ్చు. డాక్టర్ పోక్రియాల్కి ఇచ్చిన బీఏ ఎంఏ డిగ్రీలు కూడా అనుమానించతగినవే అని వాదిస్తూ రాజేశ్ మధుకాంత్ అనే పౌరుడు ఒకాయన, ఆ డిగ్రీలు, ఎప్పుడు ఇచ్చారో, ఇచ్చిన విశ్వవిద్యాలయాల ప్రమాణాలేమిటో తెలపాలని ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. విశ్వవిద్యాలయం వారు ఇవ్వను పొమ్మన్నారు. మొదట జనసూచన అధికారి, ఆ తరువాత మొదటి అప్పీలు అధికారి కూడా సమాచారం ఇవ్వలేదు. విధిలేక కేంద్ర సమాచార కమిషన్ ముందుకు రెండో అప్పీల్‌కు వెళ్లవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం వారు ఈ డిగ్రీల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుందని కనుక దాన్ని ఇవ్వజాలమని వివరించారు. సమాచార కమిషన్ ముందుకూడా ఇది థర్డ్ పార్టీ సమాచారమని వాదించారు. సమాచార హక్కు చట్టం కింద మూడో వ్యక్తి సమాచారం అడగడానికి వీల్లేదని కొందరు వాదిస్తుంటారు. కాని చట్టంలో చెప్పేదేమంటే ఒకవేళ జనసమాచార అధికారి ఆ సమాచారం మూడో వ్యక్తి ఇచ్చినదైతే ఆ మూడో వ్యక్తిని సంప్రదించి మీరు ఇచ్చిన సమాచారం పత్రాలు కావాలని అడుగుతున్నారని దీనిపై మీ అభిప్రాయం ఏమి టని అడగవలసి ఉంటుంది. సెక్షన్ 11(1) కింద మూడో వ్యక్తిని సంప్రదించి ఆయన వద్దన్నప్పటికీ, ప్రజాశ్రేయస్సుకోసం అవసరం అనుకుంటే సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. సామాన్యుల డిగ్రీ వివరాలు అడిగిన వారికల్లా ఇచ్చే విశ్వవిద్యాలయాలు, రాజకీయ నాయకుల డిగ్రీ వివరాలు మాత్రం దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాయి. దీంతో ఈ పెద్దల చదువులు నిజమైనవి కాదేమో అని అనుమానం వస్తుంది. ఏమంటారు డాక్టర్ పోక్రియాల్ గారూ? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com