సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్‌లు సినిమాలోనే కాదు.. ఎన్నికల ప్రచారాల్లోనూ అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్ తప్పు చెబితే డైరెక్టర్ సరి చేస్తాడు.. కానీ రాజకీయాల్లో అలా కుదరదు కదా. ఈ విషయం తెలియక పవన్ ఇష్టానుసారంగా మాట్లాడి సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పటికే పలు సభల్లో నోరు జారి చేసిన ఆరోపణలతో.. నెటిజన్ల చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పని అయింది. తాజాగా పవన్ చదువుకు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. అయితే గతంలో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ సభలో.. వేరే గత్యంతర లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. ఇంకొక సభలో అయితే స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌కు వెళ్లానని వివరించాడు. అయితే అసలు పవన్ ఇంటర్మీడియట్ చదివాడా లేడా?చదివితే ఏ గ్రూప్ చదివాడో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఆరాటపడుతున్నారు. దీంతొ పవన్ ఇంతకీ ఏం చదివాడనే దానిపైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగతోంది. ఇంతకీ పవన్ ఏం చదివాడబ్బా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment