బీహార్ విద్యాశాఖలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. విద్యాశాఖ ఒక విద్యార్థికి సంబంధించిన టీసీలో ఆ కుర్రాడి డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 30 అని రాసింది. నిజానికి ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే బీహార్ విద్యాశాఖ ఎంత నిద్రమత్తులో ఉన్నదంటే బీహార్ ప్రజలకు 30 రోజులు ఉంటున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ చూపిన ఈ నిర్లక్ష్యం ఆ పిల్లవాడి పాలిట సమస్యగా మారింది.
ఈ ఉదంతం జముయీ జిల్లాలోని చకాయీ పరిధిలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అమన్ కుమార్‌కు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌లో ఆ కుర్రాడి పుట్టిన తేదీ 2009 ఫిబ్రవరి30 అని ఉంది. ఈ విధమైన పుట్టినరోజు కారణంగా తమ పిల్లవాడికి 9వ తరగతిలో ఎక్కడా అడ్మిషన్ దొరకడంలేదని పిల్లవాడి తండ్రి రాజేష్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై పలుమార్లు విద్యాశాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. తన కుమారుని పుట్టినతేదీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెబుతున్నారని రాజేష్ యాదవ్ ఆరోపించారు.
కాగా ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించగా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పుకాదని, ఆ విద్యార్థి సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌లో అలా ఉండి ఉంటుందన్నారు. దీని గురించి సంబంధిత అధికారులను విద్యార్థి తండ్రి సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా!
Comments
Please login to add a commentAdd a comment