administration fail
-
కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట!
బీహార్ విద్యాశాఖలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. విద్యాశాఖ ఒక విద్యార్థికి సంబంధించిన టీసీలో ఆ కుర్రాడి డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 30 అని రాసింది. నిజానికి ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే బీహార్ విద్యాశాఖ ఎంత నిద్రమత్తులో ఉన్నదంటే బీహార్ ప్రజలకు 30 రోజులు ఉంటున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ చూపిన ఈ నిర్లక్ష్యం ఆ పిల్లవాడి పాలిట సమస్యగా మారింది. ఈ ఉదంతం జముయీ జిల్లాలోని చకాయీ పరిధిలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అమన్ కుమార్‌కు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో ఆ కుర్రాడి పుట్టిన తేదీ 2009 ఫిబ్రవరి30 అని ఉంది. ఈ విధమైన పుట్టినరోజు కారణంగా తమ పిల్లవాడికి 9వ తరగతిలో ఎక్కడా అడ్మిషన్ దొరకడంలేదని పిల్లవాడి తండ్రి రాజేష్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు విద్యాశాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. తన కుమారుని పుట్టినతేదీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెబుతున్నారని రాజేష్ యాదవ్ ఆరోపించారు. కాగా ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించగా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పుకాదని, ఆ విద్యార్థి సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో అలా ఉండి ఉంటుందన్నారు. దీని గురించి సంబంధిత అధికారులను విద్యార్థి తండ్రి సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా! -
కొండను తవ్వి ఎలుకను పట్టారు
- రూ.50 లక్షల గోల్‌మాల్‌లో రూ.2 లక్షలే వెలుగులోకి - మిగతా పనుల్లో అక్రమాల పరిస్థితి ఏంటి? - టీడీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమాలు అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ అధికారులు కొండను తవ్వి ఎలకను పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనుల్లో రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయని గత నెల 24న చెప్పిన నగరపాలక సంస్థ అధికారులు ఇప్పుడు కేవలం రూ.2 లక్షల వరకే అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది నగరపాలక సంస్థ పరిధిలో రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వెచ్చించి చేపట్టిన 172 అభివృద్ధి పనులపై పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఈ పనుల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని డీఎంఏకు నివేదిక పంపారు. దాని ఆధారంగా రూ.45 నుంచి రూ.50 లక్షల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీనిపై మళ్లీ విచారణ చేపట్టాలని ప్రస్తుత కమిషనర్ మూర్తి ఎస్ఈ సత్యనారాయణను ఆదేశించారు. 36వ డివిజన్లోని నీరు - ప్రగతి వనంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణంలో రూ.2 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు ఎస్ఈ తేల్చారు. సంబంధిత డీఈ షుకూర్, ఏఈ మహదేవప్రసాద్కు ఎస్ఈ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు డబ్బును రికవరీ చేస్తామని చెప్పారు. ఇంకా చాలా డివిజన్లలో లోతుగా విచారణ చేపడితే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే అలా జరక్కుండా అధికార పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ అక్రమాలు తమ మెడకు చుట్టుకుంటూ ఉండటంతో కొందరు అధికారులను పాలకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా ఇందులో నుంచి బయటపడేసేలా చూడాలని వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. విచారణ లోతుగా జరిగితే ఏఈ, డీఈలను సస్పెన్షన్ చేసేందుకు డీఎంఏకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా వారి నుంచి భారీ మొత్తంలో రికవరీ చేయాల్సి వస్తుంది. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలున్న నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
గాడి తప్పిన దూరవిద్య
–పర్యవేక్షణలో అధికారులు విఫలం –పరీక్షల షెడ్యూల్ ప్రకటించని వైనం ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం గాడి తప్పింది. పరీక్షల షెడ్యూల్ ప్రకటన, నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించడంలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో పూర్తి చేసినా ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు. పీజీ రెండో సంవత్సరం పరీక్షలు, డిగ్రీ రెండు , మూడో సంవత్సరం పరీక్షలు ఎపుడు నిర్వహిస్తారో తెలియదు. పీసీపీ తరగతులు నిర్వహించని వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో 233 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు డిగ్రీ కోర్సును అభ్యసిస్తున్నారు. ద్వితీయ, తతీయ విద్యార్థులకు తప్పనిసరిగా పర్సనల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్‌ను ప్రతి వారాంతంలో నిర్వహించాలి. దీనిని దూరవిద్య అధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తరగతుల నిర్వహణకు ఒక్కో డిగ్రీ అడ్మిషన్ మీద 20 శాతం ఖర్చును అధ్యయన కేంద్రాల వారికి దూరవిద్య అధికారులు నేరుగా చెల్లిస్తున్నారు. కానీ ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. పీసీపీ తరగతులు ఉన్నాయన్న సంగతి విద్యార్థులకు కూడా తెలియకపోవడం ఇందుకు నిదర్శనం . కోర్సులు లేకున్నా ప్రాక్టికల్ పరీక్షలు .. దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు పీసీపీ తరగతులు, ప్రాక్టికల్ , రాత పరీక్షలు ఏ డిగ్రీ కళాశాలో నిర్వహిస్తారో ముందే వెల్లడించాల్సి ఉంది. కొన్ని డిగ్రీ కళాశాల్లో బీఎస్సీ కోర్సులు లేకపోయినప్పటికీ సైన్స్ పరీక్షలకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడం వివాదాలకు దారితీస్తోంది. అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు వర్సిటీ దూరవిద్య అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నా, పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రాక్టికల్ మార్కులు నిర్ధారించి నేరుగా దూరవిద్య విభాగానికి అధ్యయన కేంద్రాల వారు పంపుతున్నారు. ఈ పరీక్షలకు ఎంత విశ్వసనీయత ఉందనే అంశంపై అనుమానాలు లేకపోలేదు. దూరవిద్య ఆదాయంలో 20 శాతం అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నపుడు కనీస ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత దూరవిద్య అధికారులపై ఉందని పులువురు అభిప్రాయపడుతున్నారు.