Birth cirtificate
-
ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని తెలిసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఖాతాదారులు తప్పకుండా గమనించాలి. ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో ఆధార్ కార్డుని జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించబోమని ప్రకటించడంతో.. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ ఎట్టకేలకు ధ్రువీవీకరించింది. EPFO కోసం పుట్టిన తేదీకి రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్‌షీట్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC) స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC) SSC సర్టిఫికేట్ (పేరు, పుట్టిన తేదీ ఉంటుంది) పాన్ కార్డ్ కేంద్ర/రాష్ట్ర పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వం జారీ చేసిన డొమిసైల్ సర్టిఫికేట్ పాస్‌పోర్ట్ ప్రభుత్వ పెన్షన్ ఐడీ సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓలో పుట్టిన తేదీ కరెక్షన్ కోసం సమర్పించవచ్చు. వీటిలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అయితే ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే. కాబట్టి దీనిని పుట్టిన తేదీ నిర్దారణ కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. -
కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట!
బీహార్ విద్యాశాఖలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. విద్యాశాఖ ఒక విద్యార్థికి సంబంధించిన టీసీలో ఆ కుర్రాడి డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 30 అని రాసింది. నిజానికి ఫిబ్రవరి నెలలో 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే బీహార్ విద్యాశాఖ ఎంత నిద్రమత్తులో ఉన్నదంటే బీహార్ ప్రజలకు 30 రోజులు ఉంటున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ చూపిన ఈ నిర్లక్ష్యం ఆ పిల్లవాడి పాలిట సమస్యగా మారింది. ఈ ఉదంతం జముయీ జిల్లాలోని చకాయీ పరిధిలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అమన్ కుమార్‌కు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లో ఆ కుర్రాడి పుట్టిన తేదీ 2009 ఫిబ్రవరి30 అని ఉంది. ఈ విధమైన పుట్టినరోజు కారణంగా తమ పిల్లవాడికి 9వ తరగతిలో ఎక్కడా అడ్మిషన్ దొరకడంలేదని పిల్లవాడి తండ్రి రాజేష్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు విద్యాశాఖాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. తన కుమారుని పుట్టినతేదీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని అన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించిన ప్రతీసారీ ఏదో ఒక సాకు చెబుతున్నారని రాజేష్ యాదవ్ ఆరోపించారు. కాగా ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించగా, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పుకాదని, ఆ విద్యార్థి సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో అలా ఉండి ఉంటుందన్నారు. దీని గురించి సంబంధిత అధికారులను విద్యార్థి తండ్రి సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ ఫొటోకు సహకరించని చిన్నారి.. శభాష్ అనిపించుకుంటున్న తండ్రి ఐడియా! -
‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట సర్కిల్లోని సైదాబాద్‌కు చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రాబోయే మార్చిలో పబ్లిక్ పరీక్షలకు అతను హాజరు కావాల్సి ఉంది. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సంబంధిత ఫారమ్‌లో పూర్తి వివరాలు నింపి జత చేయాల్సిన సర్టిఫికెట్లు బడిలో సమర్పించాడు. విద్యార్థి బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు ఫారమ్‌లో తప్పుగా పేర్కొనడంతో స్కూల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు సరిచేసుకొని సమర్పించాలని సూచించారు. బాలుడి తల్లిదండ్రులు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంప్రదించగా, మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంట్లో మరో సంతానం బర్త్ సరిఫికెట్‌లో తల్లిపేరు సరిగా ఉంటే సదరు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ జతచేసి మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిచేస్తారని తెలిపారు. మీ–సేవలో ఇచ్చిన డిక్లరేషన్ ఫారమ్‌లో ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకాలు పెట్టించడంతో పాటు, నోటరీ, విద్యార్థి తల్లి ఆధార్, పాన్‌కార్డు, తమ్ముడి బర్త్ సర్టిఫికెట్ సైతం జత చేస్తూ మీ సేవ కేంద్రం ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు. వారం రోజులైనా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు మీ–సేవలో పేర్కొన్నారు. దరఖాస్తు పరిష్కారానికి ఏం చేయాలని అడిగితే.. మేం చేసేదేమీ లేదని, జీహెచ్ఎంసీ నుంచి ఫోన్ రాలేదా? ఆని ప్రశ్నించారు. రాలేదని తెలపగా తామేం చేయలేమన్నారు. తెలిసిన వారి ద్వారా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారిని సంప్రదించగా.. ఆన్లైన్లో పరిశీలించి దరఖాస్తు రిజెక్ట్ అయినట్లు తెలిపారు. కనీసం రిజెక్ట్ అయిన విషయం కానీ.. ఎందుకు రిజెక్ట్ చేశారో కానీ మొబైల్‌కు సమాచారం అందలేదు. సదరు ఉన్నతాధికారి సంబంధిత సర్కిల్ అధికారులను ఫోన్లో వివరణ కోరగా, దరఖాస్తుతో జత చేసిన జిరాక్స్‌ల ఒరిజినల్స్ కావాలని తెలిపారు. దాంతో విస్తుపోయిన అధికారి ఎందుకని ప్రశ్నిస్తే.. ఇటీవల కొందరు ఫోర్జరీ పత్రాలిస్తున్నందున.. తాము పరిశీలన కోసం ఒరిజినల్స్ కోరుతున్నామని తెలిపారు. కనీసం ఒరిజినల్స్ తేవాల్సిందిగా దరఖాస్తుదారుకు సమాచారం ఇచ్చారా అంటే లేదని చెప్పారు. మరి వారికెలా తెలుస్తుంది..? అంటే సమాధానం లేదు. ఇలా ఉంది జీహెచ్ఎంసీ, మీ–సేవల పని తీరు. చదవండి: Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే! స్కాన్ కాపీలు పంపినా.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకే ప్రభుత్వం అన్ని సర్వీసుల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తోంది. అందులో భాగంగానే బర్త్ సర్టిఫికెట్ల కోసం.. సవరణల కోసం సైతం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన ఒరిజినల్ పత్రాలు మీ సేవలో స్కాన్ చేసి, సంబంధిత కార్యాలయాలకు పంపుతారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఒరిజినల్స్వే స్కాన్ చేసి ఆన్లైన్లో పంపినప్పుడు మళ్లీ ఒరిజినల్స్ కావాలనడం.. అది సైతం కనీసం సమాచారం తెలపకపోవడం వెనక మతలబేమిటన్నది అంతుచిక్కడం లేదు. పైసల కోసమే.. జీహెచ్ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు అది పైసల కోసమని చెబుతున్నారు. సర్టిఫికెట్ల అవసరం ఉన్నవారూ ఎలాగూ వారి పనికోసం నానా తంటాలు పడతారు. అలా తిరిగి తిరిగి తమ వద్దకే వస్తారు కాబట్టి.. అప్పుడు లేనిపోని కొర్రీలు పెట్టి.. ఇతరత్రా భయపెడతారని, అడిగినంత ఇచ్చుకుంటే మాత్రం పని చేస్తారని పేర్కొన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడుతున్నారనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం ఒక విధంగా అవినీతిని కట్టడి చేయాలనుకుంటే.. అవినీతికి అలవాటు పడ్డవారు మరో విధంగా ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తనిఖీలు లేకనే.. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాలను కనీసం తనిఖీలు చేయకపోవడం.. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎన్ని సార్లు మొత్తుకున్నా వారికి చీమకుట్టినట్లయినా ఉండటం లేదు. ప్రజల ఈ ఇబ్బందులను సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి తేగా, ఇకపై అలా జరగకుండా చూస్తామని మొక్కుబడి సమాధానమిచ్చారు. అంతేకాదు.. డబ్బులడిగినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతారట. జీహెచ్ఎంసీ సిబ్బందికి, మీ సేవ కేంద్రాల సిబ్బందికి మధ్య పరస్పర సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. మీ సేవలో దరఖాస్తు చేసినప్పుడే.. పని పూర్తయ్యేందుకు జీహెచ్ఎంసీలో కలవాల్సిన వారి గురించి చెబుతారని సమాచారం. ఇదీ.. జీహెచ్ఎంసీ.. మీ సేవ తంతు. -
పాస్‌పోర్టు ఇప్పుడు మరింత సులువు
తిరుపతి క్రైం: విదేశాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పాస్‌పోర్ట్ చాలా అవసరం. దీన్ని తీసుకోవాలంటే ఒకప్పుడు చుక్కలు కనబడేవి. రానురాను కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలిస్తూ ఎన్నో మార్పులు చేర్పులు చేసింది. ప్రస్తుతం వారం రోజుల్లో పాస్‌పోర్టు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అనే నిబంధన ఉండేది. ప్రస్తుతం తప్పనిసరి కాదు. జనన ధ్రువీకరణ గుర్తించే పీసీ, మార్కులిస్టు, పాన్, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెన్షన్ ఆర్డర్పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థలు ఇచ్చే పాలసీబాండ్లను పరిగణనలోకి తీసుకుంటారు. చిన్నపిల్లల వయస్సును ధ్రువీకరిస్తూ బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. పెళ్లయిన వారు ధ్రువీకరణ, నోటరికి సంబంధించిన నిబంధనలు కూడా ప్రభుత్వం తొలగించింది. విడాకులు తీసుకున్న భాగస్వామి పేరు, విడాకుల డిక్రీ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి పేరును నమో దు చేసుకునేందుకు వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. గతంలో 15 రకాల అనుబంధ పత్రాలను జత చేయాల్సి ఉండేది. ఇందులో ఏ, సీ, డీ, ఈ, జే, కే సెక్టారులను తొలగించారు. వీటికి బదులుగా తెల్లకాగితంపై స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోతుంది. నోటరీ పద్ధతిని తప్పించారు. ఇలా అనేక నిబం ధనలను తొలగించడంతో పాస్‌పోర్ట్ ప్రతి ఒక్కరికీ మరింత చేరువ కానుంది. -
ఎప్పుడు పుట్టావు ‘బంగారూ’!
బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంకు చెందిన ముసులగళ్ల ఇందిరకు 3నెలల క్రితం తొలుచూరు ఆడబిడ్డ పుట్టింది. అందరూ ఆడబిడ్డ పుడితే ‘బంగారుతల్లి’ అంటూ గుండెలకు హత్తుకుంటుండగా.. ఇందిర మెట్టినింటివారు ఆడబిడ్డ పుట్టిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇందిర పుట్టింటి వారు ఆమెను రేగడిమైలారంకు తీసుకువచ్చి తల్లీ, బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రభుత్వం బంగారు తల్లి పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నదన్న ఆశతో.. బంగారుతల్లి పథకం లబ్ధికోసం దరఖాస్తు చేసుకుందామన్నా తమకు ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పథకం పరిధిలో చిన్నారి పేరును నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వం ద్వారా తమకు చేయూతనందించాలని ఇందిరతోపాటు ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. నవాబుపేట మండలం అమ్మాపూర్‌కు చెందిన బాలామణి అనే మహిళకు 8 నెలల కిందట పాప పుట్టింది. బంగారు తల్లి పథకం కింద ఆ చిన్నారి పేరును నమోదు చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని తల్లి చెప్తోంది. గ్రామ పంచాయతీ ద్వారా ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌ను అనుమతించడం లేదని, బర్త్ సర్టిఫికెట్‌కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యత్నిస్తే.. మీ సేవలో అప్లోడ్ కావడం లేదని, ఆధార్ కార్డు ఇంకా రాలేదన్న కారణంగా పథకం కింద తమ పాప పేరును నమోదు చేయలేకపోతున్నామని ఆమె ఆవేదనతో చెప్పింది. పాప పుట్టి ఎనిమిది నెలలవుతున్నా.. ధ్రువీకరణ పత్రాల పేరుతో కాలయాపన చేస్తుండటం ఇబ్బందిగా మారిందని ఆమె అంటోంది. ఇలా.. జిల్లా వ్యాప్తంగా వేల మంది 2013 మే 1వ తేది తర్వాత పుట్టిన ఆడపిల్లల పేర్లను ‘బంగారుతల్లి పథకం’ పరిధిలో నమోదు చేయించేందుకు యత్నించి విసిగి వేసారిపోతున్నారు. పాలమూరు, న్యూస్‌లైన్ : ఆడపిల్లగా పుడితే ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాలనుకోవాలి.. ప్రభుత్వం వారు ఎదిగేవరకు అన్ని విధాలా ఆర్థిక సహకారం అందిస్తుంది.. అంటూ సర్కారు ఊకదంపుడు ఉపన్యాసాలు జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. తెలుపు రేషన్ కార్డు కలిగిన బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు ఆసరాగా ఉండటానికి ఉద్దేశించిన బంగారుతల్లి పథకం సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. గతేడాది మే 1 తర్వాత జిల్లా వ్యాప్తంగా దాదాపు 12వేల మంది ఆడశిశువులు జన్మించగా అందులో 6వేల లోపు మంది మాత్రమే ఈ పథకం కింద నమోదైనట్లు సమాచారం. బాలికల సంక్షేమానికి ఉద్దేశించిన పథకం.. ప్రారంభించి 9 నెలలు గడుస్తున్నా.. బాలారిష్టాలు దాటడం లేదు. బంగారు తల్లుల తల్లిదండ్రులకు భరోసానివ్వటం లేదు. మొదట్లో ఆర్భాటాలు చేసిన ప్రభుత్వం గ్రామీణ పేదలకు అవగాహన కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదు. పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటి వరకూ జన్మించిన బాలికలకు, పథకం కోసం ఐకేపీలో నమోదవుతున్న సంఖ్యకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. అధికారులూ సహకరించడం లేదు గణాంకాలను బట్టి చూస్తే జిల్లాలో.. 50 శాతానికిపైగా ప్రజలకు బంగారు తల్లి పథకం గురించే తెలియదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు పథకం గురించి కొందరికి తెలిసినా అధికారులు సహకరించకపోవడంతో తిప్పలు పడుతున్నారు. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లిపేరిట బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి పంచాయతీ అధికారులు, భాతాలు తెరవడానికి బ్యాంకర్లు రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో పలువురు ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడటం లేదు. దీనికితోడు ఆధార్ కార్డులు సకాలంలో జారీ కాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అమలు ఇలా.. ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మే ఒకటి తర్వాత జన్మించినట్లు ధ్రువీకరణ పత్రం అందిస్తే వెంటనే రూ.2500 జమచేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజుకు రూ.1000 చెల్లిస్తారు. రెండో ఏడాది వచ్చేసరికి మరో రూ.1000 చెల్లిస్తారు. మూడో ఏట అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమచేస్తారు. ఇలా 4,5 ఏళ్లకు ఒక్కో ఏటా రూ.1500 వంతున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదోతరగతి వరకూ ఏడాదికి రూ.2000 చొప్పున చెల్లిస్తారు. 6,7,8 తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ.2500 జమచేస్తారు. 9,10 తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ.3వేలు వంతున ఇస్తారు. బాలికకు 16ఏళ్లు వచ్చేసరికి ఇంటర్ రెండేళ్లకు ఏడాదికి రూ,3,500 వంతున జమచేస్తారు. డిగ్రీలో చేరిన తర్వాత వరుసగా ఏడాదికి రూ.4వేలు చొప్పున అందజేస్తారు. అలాగే అదనంగా డిగ్రీలో మరో రూ.4వేలు ఇస్తారు. డిగ్రీ పూర్తయి పట్టా పొందిన తర్వాత ప్రభుత్వం ఆమె పేరిట రూ.1లక్ష జమ చేస్తుంది.