
మతకల్లోలాలు, రాజకీయ వివాదాలు, వెనుకబాటుతనం, గూండాల అరాచకాలు వంటి అంశాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అధికార పీఠాన్ని అధిరోహించిన ముఖ్యమంత్రులంతా ఉన్నత విద్యను అభ్యసించినవారే. యూపీ మొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు మొత్తం 21 మంది అధికార పీఠంపై కూర్చోగా, అందులో 8 మంది గ్రాడ్యుయేట్లు కాగా, 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
మరో ఇద్దరు సీఎంలు పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్లు పొందగా, సీఎం బనారసీ దాస్ మాత్రం రాజకీయాల కోసం గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోనే వదిలేశారు. అయితే వీరిలో ఏడుగురు న్యాయశాస్త్ర డిగ్రీలను పొందారు.
Comments
Please login to add a commentAdd a comment