
లక్నో: ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీటుగా బదులిచ్చారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శకు రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ..‘45 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభ్‌మేళా. ప్రయాగ్‌రాజ్‌లో ఒక కుటుంబం విజయగాథ చెప్తా. ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. 45 రోజుల కుంభమేళా రోజుల్లో ఈ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాలను కళ్లజూసింది. అంటే ఒక్కో బోటు రూ.23 లక్షల లాభాల తెచ్చింది. రోజుల లెక్కన చూస్తే ఒక్కో బోటు నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చింది’ అని అన్నారు.
ఇదే సమయంలో కుంభమేళా వివరాలను యోగి వెల్లడించారు. ఒక్క తొక్కిసలాట ఘటన తప్పితే 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా మేళాకు వచ్చి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్య ఘటన ఒక్కటి కూడా జరగలేదు అని అన్నారు.
One Boatman family who has 130 boats earn ₹ 30cr in just 45 days during the Kumbh Mela. pic.twitter.com/7UhvKZZosc
— Farrago Abdullah Parody (@abdullah_0mar) March 4, 2025
వేల కోట్లు పెడితే లక్షల కోట్ల వ్యాపారం..
కుంభమేళాకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత తదితరాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ.7,500 కోట్లు. 200కుపైగా రోడ్లను వెడల్పు చేశాం. 14 ఫ్లైఓవర్లు కట్టాం. 9 అండర్‌పాస్‌లు నిర్మించాం. 12 కారిడార్లను సిద్ధంచేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తంగా ఏకంగా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. హోటల్ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు, రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. రూ.660 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయరహదారుల వెంట టోల్‌ట్యాక్స్ రూపంలో రూ.300 కోట్లు వచ్చాయి. ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఈఏడాది దేశ స్తూలజాతీయోత్పత్తికి కుంభమేళా సైతం తన వంతు వాటాను అందించింది అని యోగి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment