
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీకి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలిజేయాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లను చూపించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంటూ.. కేజ్రీవాల్‌కు రూ. 25,000 జరిమానా కూడా విధించింది.
ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై తాజాగా కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో.. తమ ప్రధాని ఎంత చదువుకున్నారో తెలుసుకునే హక్కు కూడా దేశానికి (ప్రజలకు) లేదా అని ఢిల్లీ సీఎం ప్రశ్నించారు. డిగ్రీ చూడాలని డిమాండ్ చేసే వారికి జరిమానా విధించడం ఏంటి..? అసలేం జరుగుతోంది. నిరక్షరాస్యుడు, తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
చదవండి: ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా
क्या देश को ये जानने का भी अधिकार नहीं है कि उनके PM कितना पढ़े हैं? कोर्ट में इन्होंने डिग्री दिखाए जाने का ज़बरदस्त विरोध किया। क्यों? और उनकी डिग्री देखने की माँग करने वालों पर जुर्माना लगा दिया जायेगा? ये क्या हो रहा है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 31, 2023
अनपढ़ या कम पढ़े लिखे PM देश के लिए बेहद ख़तरनाक हैं https://t.co/FtSru6rddI