న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) మరింత సమీపిస్తున్న వేళ.. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.
ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి(Narendra Modi)కి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్‌డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్‌బోన్
వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
ఇటీవల జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను ప్రధాని మోదీ దృష్టి తీసుకొచ్చారు కేజ్రీవాల్. జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్‌లో జాబ్స్‌కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంచితే, గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్‌కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment