సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డికి విద్యార్హత లేదంటూ మూడేళ్ల క్రితం దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతలను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ అప్పట్లో కంచర్ల భూపాల్‌రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డిలు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎమ్మెల్యే బీఈ పాస్ కాకుండానే ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
దీంతో మూడేళ్లుగా ఈ కేసుపై వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మూడేళ్లుగా ఈ పిటిషన్‌పై కోర్టు సమయం వృథా చేశారంటూ పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా నరసింహారెడ్డి, భూపాల్‌రెడ్డిలకు ఒక్కొక్కరికి రూ. 25 వేలు జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment