తమకు నచ‍్చిన హీరో, లేదంటే ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటీ? స్కూలింగ్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారనే విషయాల గురించి ఆరాలు తీస్తుంటారు. ఈ ఇంట్రస్ట్.. సినిమా హీరోలు, స్పోర్ట్స్ పర్సన్‌ల గురించే కాదండోయ్..టెక్ సంస్థల సీఈఓల గురించి తెలుసుకునేందుకు మక్కువ చూపుతుంటారు.
భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్ సుందర్ పిచాయ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ సంవత్సరాలుగా తన స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ అయ్యిందనే విషయాల్ని ఎక్కడ రివిల్ చేయకుండా టెక్ లవర్స్‌ను సస్పెన్స్‌కు గురి చేశారు.
తాజాగా స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఇంటర్వ్యూలో పిచాయ్ తన స్కూల్ విద్యాభ్యాసంపై ఆసక్తిర విషయాల్ని పంచుకున్నారు. ఇంటర్వ్యూయర్ వికీపీడియా పేజీలో కనిపించిన స్కూల్ జాబితాను చూపించాడు. దానికి పిచాయ్ వికీపీడియాలో కనిపించిన పేర్లలో రెండు సరైనవేనని, అతను చెన్నైలోని వాణ వాణిలో తన పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు.
తన ఎడ్యుకేషన్‌పై అనేక రూమర్లు వచ్చాయని, వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని పిచాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పిచాయ్ ఉన్నత విద్య విషయానికొస్తే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో తన బీటెక్‌ను, ఆ తర్వాత ఇంజినీరింగ్‌లో మెటీరియల్ సైన్స్ విభాగంలో ఎంఎస్ చేయడానికి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ చదివారు.
ఆ తర్వాత 2004లో పిచాయ్ గూగుల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో లీడ్‌గా తన కెరియర్‌ను ప్రారంభించి అనతి కాలంలో గూగుల్ సీఈఓగా సుందార్ పిచాయ్ అవతరించారు.
Comments
Please login to add a commentAdd a comment