ఢిల్లీ: లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న మనీష్ సిసోడియా.. దేశ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చదువు ప్రాముఖ్యత తెలియదంటూ లేఖలో సంచలన విమర్శలు చేశారాయన.
ఒక దేశ ప్రధాని ఎంత తక్కువగా చదివి ఉంటే.. అది ఆ దేశానికి అంత ఎక్కువ ప్రమాదం. మోదీకి సైన్స్ ఏంటో అర్థం కాదు. అసలు ఆయనకు విద్య యొక్క ప్రాముఖ్యత తెలియదు కూడా అని లేఖలో సిసోడియా పేర్కొన్నారు.
గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 60 వేలకుపైగా స్కూల్స్ మూతపడ్డాయని లేఖలో విమర్శించారాయన. చదువుకోని ప్రధానితో దేశానికి ఏనాటికైనా ప్రమాదమే అంటూ లేఖలో పేర్కొన్న సిసోడియా.. భారత దేశ ప్రగతికి చదువుకున్న ప్రధాని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. సిసోడియా భావాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపిన కేజ్రీవాల్.. ట్విటర్‌లో సందేశం ఉంచారు.
मनीष सिसोदिया ने जेल से देश के नाम चिट्ठी लिखी -
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 7, 2023
प्रधानमंत्री का कम पढ़ा-लिखा होना देश के लिए बेहद ख़तरनाक
मोदी जी विज्ञान की बातें नहीं समझते
मोदी जी शिक्षा का महत्व नहीं समझते
पिछले कुछ वर्षों में 60,000 स्कूल बंद किए
भारत की तरक़्क़ी के लिए पढ़ा-लिखा पीएम होना ज़रूरी pic.twitter.com/VpPyY1Jr2v
ఇదీ చదవండి: ప్రధాని మోదీ డిగ్రీ.. మూల్యం చెల్లించుకోనున్న కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment