న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు నేడు(ఆగస్టు16). ఈ ఏడాది ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేజ్రీవాల్‌కు పలువురు రాజకీయ నేతలు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు.
Thank you for your wishes Sir. https://t.co/pa74MlU12I
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023
అయితే మోదీ ట్వీట్‌కు కేజ్రీవాల్ బదులిచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సెనా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, రాజీవ్ శుక్లాతో తదితరులు కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్
మనీష్‌ను మిస్ అవుతున్నా: కేజ్రీవాల్
కేజ్రీవాల్ తన పుట్టిన రోజున సీఎం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ ఈరోజు నా పుట్టినరోజు. చాలా మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. కానీ నేను మనీష్‌ను చాలా మిస్ అవుతున్నాను. ప్రస్తుతం అతను తప్పుడు కేసులో జైలులో ఉన్నారు.
Today is my birthday. Many people are sending their wishes. Thank you so much!
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023
But I miss Manish. He is in jail in a false case. Lets all take a pledge today - that we will do everything within our means to provide best quality education to every child born in India. That will…
ఈ రోజు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. భారత్‌లో పుట్టిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన, నాణ్యమైన విద్యను అందించడానికి మా శక్తిమేర ప్రయత్నిస్తాం. అది పటిష్ట భారత్‌కు పునాది వేస్తుది. అది భారత్‌ను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలనే మన కలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది. అది మనీష్‌ను కూడా సంతోషపరుస్తుంది.’ అని పేర్కొన్నారు.
కాగా ఢిల్లీలోని ప్రభుత్వం అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం తీసుకొచ్చిన చట్టం కారణంగా కేజ్రీవాల్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్‌మెంట్) బిల్లు–2023’ లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది.
చదవండి:మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Comments
Please login to add a commentAdd a comment