న్యూఢిల్లీ: తమ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయమై ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడ్డారు. సత్యేంద్ర జైన్ ‘నిందితుడు’ కాదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులో పేర్కొందని, మీరు అవినీతికి ఎలా పాల్పడ్డారు? మనీష్ సిసోడియా బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తారన్నారు. అసలు అవినీతి అంటే ఏమిటో, పెద్ద అవినీతిపరులు ఎలా ఉంటారో దేశానికి చెబుతామన్నారు.
పంజాబ్ ఎన్నికలకు ముందే జైన్‌ని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుసుకున్నానని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియాను కూడా ఇరికిస్తారని, జైన్ తర్వాత అరెస్టు చేయబడే తదుపరి ఢిల్లీ మంత్రి ఆయనే కావచ్చునని చెప్పారు. ఈ మేరకు కేజ్రీవాల్ సోషల్ మీడియాలో మోదీజీ 'మమల్నందర్నీ జైల్లో వేయండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నెల మే 30న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని మంత్రి సత్యేందర్ జైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పై 2015-16లో కోల్‌కతాకు చెందిన సంస్థతో హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసింది.
केंद्र सरकार ने खुद ही कोर्ट में बोल दिया कि सत्येंद्र जैन “आरोपी” नहीं हैं। जब आरोपी ही नहीं हैं तो भ्रष्ट कैसे हुए? मनीष सिसोदिया जी आज भाजपा के एक बड़े नेता का खुलासा करेंगे। वो देश को बतायेंगे कि असली भ्रष्टाचार क्या होता है और बड़े भ्रष्टाचारी कैसे होते हैं pic.twitter.com/MgUF0DEwxJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 4, 2022
(చదవండి: చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ మౌర్య సామ్రాజ్యపు అవశేషాలు)
Comments
Please login to add a commentAdd a comment