satyendar jain
-
ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట.. రెండేళ్లకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.కాగా జైన్‌ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది. -
సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌ను అనవసరంగా వాయిదా వేయకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.కాగా తన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ తేదీ అయిన జులై 9న పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసుతో తన పిటిషన్‌ను ట్యాగ్ చేయాలన్న జైన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.ఇక 28న జైన్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈడీ స్పందన కోరింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేందర్ జైన్‌పై 2017లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయనను 2022లో మే 20న అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019లో సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. -
బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల కేసు విచారణ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 'బీజేపీ ఎలాంటి కుట్ర పనైనా చేయగలదు. నేను కూడా గట్టిగానే ఉన్నా. ఎప్పటికీ లొంగిపోను. నన్ను బీజేపీలో చేరమని అడుగుతున్నారు. నన్ను ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో ఎప్పటికీ చేరబోనని చెప్పాను. అది ఎప్పటికీ జరగదు.' అని ఢిల్లీలోని రోహిణిలో పాఠశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆప్ అధినేత మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన బడ్జెట్లో 40 శాతాన్ని పాఠశాలలు, ఆసుపత్రుల కోసం ఖర్చు చేయగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం జాతీయ బడ్జెట్లో 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉన్న ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ గురించి కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. "ఈరోజు అన్ని కేంద్ర ఏజెన్సీలు మన వెంటే పడుతున్నాయి. మంచి పాఠశాలలను నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పు. మంచి ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయకపోతే మనీష్ సిసోడియా జైలుకు వెళ్లేవారు కాదు. బీజేపీ అన్ని రకాల కుట్రలు చేస్తోంది. కానీ మమ్మల్ని అడ్డుకోలేకపోయారు" అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల కేసులో మంత్రి అతిశీకి నోటీసులు అందించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి చాలా సేపు అక్కడే వేచి ఉన్నారు. కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించాలని అతిశీ కోరినప్పటికీ వారు నిరాకరించారు. ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్‌కు శనివారం నోటీసులు అందించారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు -
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మెడికల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. జైన్ మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు ఏఎస్ బోపన్న, బేల ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు నేడు విచారించింది. ఈడీ తరుపున అడిషనల్ సొలిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ జైన్ కేసును వాయిదా వేయాలని, బెయిల్ పొడిగించాలని కోరారు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను పొడిగిస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. జైన్‌కు వెన్నుముక సర్జరీ తర్వాత ఆయన మెడికల్ బెయిల్‌ను పొడిగించడం ఇది మూడోసారి. తొలిసారి మే 26న సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల ఆగస్టులో రెండోసారి పొడిగించింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు, అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లరాదని పలు ఆంక్షలు విధించింది. కాగా ఆమ్ ఆద్మీ నేత, మాజీ మాంత్రి మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2015 ఫిబ్రవరి 14నుంచి వివిధ వ్యక్తుల పేరిట అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై నమోదైన సీబీఐ ఫిర్యాదుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును విచారిస్తోంది. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా -
ఆక్సిజన్ సపోర్టుపై ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రజౌన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్టుతో వైద్యం అందిస్తున్నారు. కాగా తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న సత్యేంద్ర జైన్ కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గత సోమవారమే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జైన్.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ను సిబ్బంది వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. కాగా జైన్ అసుపత్రి పాలవ్వడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. మే 22న వెన్నెముక సమస్యతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. తీహార్ జైలు డీజీ తెలిపిన వివరాల ప్రకారం.. జైలు ఆవరణలోని సెల్ నంబర్ 7లో ఉన్న సత్యేందర్ జైలు గురువారం ఉదయం దాదాపు 6 గంటలకు వాష్‌రూమ్‌లో పడిపోయాడని పేర్కొన్నారు.అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముకకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని డీజీ తెలిపారు. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జైన్.. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన 35కిలోల బరువు తగ్గిన్నట్లు ఆప్ వర్గాలు ఆరోపిన్నాయి. చదవండి: కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి! -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్‌కు శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్‌ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్‌ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. -
Satyendar Jain: బెయిల్ తిరస్కరణ
ఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట దక్కలేదు. మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న జైన్‌కు గురువారం బెయిల్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. జైన్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. జైన్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బయటకు వస్తే ఆధారాలను ప్రభావితం చేయొచ్చని సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది. జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకుగానూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందటి ఏడాది మే నెలలో ఆయన్ని అరెస్ట్ చేసింది. కిందటి ఏడాది నవంబర్‌లో ట్రయల్ కోర్టు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 21వ తేదీనే ఇరువవర్గాల వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు తీర్పు వెల్లడించింది. హవాల రూపంలో నగదు బదిలీ.. లెక్కల్లోలేని సొమ్ముతో చరాస్తుల కొనుగోలు ఆరోపణల మేరకు సీబీఐ సత్యేందర్ జైన్‌పై కేసు నమోదు చేయగా.. ఆపై ఈడీ మనీల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు జైల్లో ఆయనకు అందిన వీఐపీ ట్రీట్మెంట్ వీడియోలు బయటకు రావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
Delhi: ఆప్‌కు భారీ షాక్.. మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మంగళవారం రాజీనామా ప్రకటించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు. అదే విధంగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇద్దరి రాజీనామాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. కాగా మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ కొన్ని నెలలుగా జైలులో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ కేబినెట్లో నెంబర్ 1, నెంబర్2గా ఉన్న ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామాలతో ఆప్ సర్కార్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. 10 నెలలుగా సత్యేందర్ జైన్ జైలులో ఉండటంతో ఆయన నిర్వహించిన ఆరోగ్యశాఖతో సహా మొత్తం 18 మంత్రిత్వశాఖలకు మనీష్ సిసోడియానే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అయితే సిసోడియాను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆదివారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిసోడియాను విచారించేందుకు అయిదు రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. అరెస్టయిన నేతలను ఇంకా ఢిల్లీ కేబినెట్లో ఎందుకు కొనసాగనిస్తున్నారంటూ బీజేపీ చేస్తోన్న విమర్శల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు రాజీనామా సమర్పించారు. తాజా పరిణామంతో ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్లో సీఎం కేజ్రీవాల్‌తో సహా ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టి కొత్త మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు చుక్కెదురు -
Satyendar Jain: ఆప్ మంత్రిని విచారించిన సీబీఐ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎట్టకేలకు సీబీఐ విచారించింది. ఈ విషయమే విచారణ సంస్థ గత శుక్రవారమే ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ముందుకు దరఖాస్తును తరలించగా..దానికి అనుమతి కూడా లభించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సోమవారం ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను విచారించినట్లు న్యాయవాది మొహ్మద్ ఇర్షాద్ తెలిపారు. ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కమ్యూనికేషన్ ఇన్జార్జ్ విజయ నాయర్‌ను కూడా సీబీఐ ప్రశ్నంచిందని న్యాయవాది తెలిపారు. అయితే ఆయనకు గతంలో ఎక్సైజ్ స్కామ్‌లో బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చేసిన దర్యాప్తులో ఢిల్లీ 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని పెద్ద మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకే ఆప్ అగ్రనేతలు రూపొందించినట్లు వెల్లడైంది. ఈ అక్రమ నిధులు వారిమధ్య చేతులు మారినట్లు పేర్కొంది. అదీగాక మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి జైన్ ఫిబ్రవరి 14, 2015, నుంచి మే 31, 2017 మధ్య కాలంలో తన ఆదాయానికి పొంతన లేని విధంగా ఆస్తులు సంపాదించినట్ల సీబీఐ తెలిపింది. -
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ..15 రోజుల పాటు..
మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం సందర్శకులు ఆయన్ను కలుసుకునేందుకు లేకుండా 15 రోజుల పాటు శిక్ష విధించింది. అలాగే అతనికి సెల్, టేబుల్, కుర్చి వంటి అన్ని సౌకర్యాలను తొలగించింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వలోని ప్రభుత్వ ప్రతినిధి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల నేపథ్యంలోనే సత్యేందర్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే అప్పటి జైలు అధికారి సందీప్ గోయోల్ కారణంగానే సత్యేందర్ జైల్లో రాజభోగాలు అనుభవించారంటూ విమర్శలుల రావడంతో గోయెల్‌పై కూడా కమిటీ శాఖాపరమైన చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అదీకూడ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించిన వారాల తర్వాత జైన్‌పై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి అవినీతి ఆరోపణలు ఎదర్కొంటూ తిహార్ జైలులో ఉన్నసత్యేందర్ జైన్ జూన్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన వరుస సీసీటీవీ వీడియో లీక్‌లతో వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు విఐపీ ట్రీట్మెంట్, పసందైన విందు అంటూ బీజేపీ వరుస వీడియోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులను సస్పెండ్ చేశారు కూడా. ఆఖరికి ఆయన బెయిల్ తిరస్కరణకు గురవ్వడం తోపాటు మత విశ్వాసాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకునేలా అనుమతించమంటూ చేసుకన్న అభ్యర్థన సైతం కోర్టు తిరస్కరించింది. (చదవండి: నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం) -
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో దెబ్బ
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్‌కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది. జైల్లో మత విశ్వాసాలకు తగ్గట్లుగా ఆహారం తీసుకునేట్లు తనను అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తీహార్ జైలులో మంత్రి జైన్‌కు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందడం లేదని, ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా జైలు అధికారులను ఆదేశించాలంటూ కూడా ఆ అభ్యర్థన పిటిషన్ పేర్కొంది. అయితే.. ప్రత్యేక న్యాయవాది వికాస్ ధూల్ ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. మే 31వ తేదీన జైన్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన జైన్ టెంపుల్‌కు వెళ్లలేదు. జైన మత విశ్వాసాలను నికచ్ఛిగా పాటించే సత్యేందర్ కుమార్ జైన్.. అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోలేకపోతున్నారు అని ఆయన తరపున పిటిషన్ దాఖలైంది. కానీ, జైలు అధికారులు మాత్రం ఆ డిమాండ్‌ను అంగీకరించలేదు. ఒక ఖైదీని ప్రత్యేకంగా చూడడం వీలు కాదని, ఖైదీలందరికీ కుల, మతాలకు అతీతంగా ఒకేరకమైన ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఏకీభవించిన స్పెషల్ జడ్జి వికాస్.. సత్యేందర్ జైన్ పిటిషన్‌ను కొట్టేశారు. ఇక.. 2017లో ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే చివరన ఆయన్ని అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించారు. నవంబర్ 17వ తేదీన ఆయనతో ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరికీ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
అది జైలు కాదు దర్బార్.. ఢిల్లీ మంత్రి మరో వీడియో లీక్..
న్యూఢిల్లీ: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. సెప్టెంబర్ 12 నాటి ఈ వీడియోలో రాత్రి 8 గంటల సమయంలో సత్యేందర్ జైన్ సహచర ఖైదీలతో సమావేశమయ్యారు. అనంతరం అప్పటి తిహార్ జైలు సూపరింటెండెంట్ వచ్చి ఆయనను కలిశారు. ఈ వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్జాద్ జై ట్వీట్ చేసి సైటర్లు వేశారు. సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియో చూడండి. ఈసారి ఆయన దర్బార్‌లో జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. జైలులో ఉంటూనే అత్యాచార నిందితుడితో మసాజ్ చేయించుకున్నాడు. పసందైన విందు చేశాడు. ఇప్పుడు జైలు గదిలోనే సమావేశాలు. ఇది ఆప్ అవినీతి థెరపీ. కానీ కేజ్రీవాల్ దీన్ని సమర్థిస్తారు. ఇప్పటికైనా సత్యేంజర్ జైన్‌పై ఆయన చర్యలు తీసుకుంటారా? అని షెహ్జాద్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలోని జైలు సూపరింటెండెంట్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. Yet another video of Tihar put out by media! This time the Satyendra ka Darbaar has Jail Superintendent who has now been suspended ! After maalish by child rapist & Nawabi meal now this! This is corruption therapy of AAP but Kejriwal ji defends this! Will he sack SJ now? pic.twitter.com/TiOMsa8Gyu — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 26, 2022 సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో ఇటీవలే వైరల్ అయింది. అయితే ఫిజియో థెరపీ అని ఆప్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. మసాజ్ చేసింది అత్యాచార కేసు నిందితుడు అని తర్వాత తెలిసింది. అనంతరం సత్యేంజర్ జైన్ జైలులో పసందైన విందు ఆరగించిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేసి ఆప్‌పై విమర్శలు గుప్పించింది. చదవండి: ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. ట్వీట్‌తో జైశంకర్ నివాళులు -
ఢిల్లీ మంత్రి జైలు విలాసాలపై ఘాటుగా స్పందించిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. జైలులో పోక్సో కేసులో నిందితుడైన ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. జైలులో ఉంటూనే సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. గదిలోనే రుచికరమైన ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లాగిస్తూ ఇటీవల కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సత్యేంద్ర జైన్ జైలు విలాసాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపీలో డిగ్రీ చేశాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. జైన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ జాతీయా మీడియాతో గురువారం మాట్లాడారు. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. తీహార్ జైలు పాలకుల తప్పిదం.. ఢిల్లీ రాజకీయ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తమ సొంత మంత్రి జైలులో ఉంటే అధికారులు మాత్రం ఎలా చర్యలు తీసుకుంటారని సెటైర్లు వేశారు. ‘సొంత మంత్రి జైలులో ఉండటం చాలా అరుదైన సందర్భం.. లోపల ఉన్న జైలు బాస్ ఇప్పటికీ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతను ఏదైనా చేయగలడు, అడగగలడు. అతని ఆదేశాలకు జూనియర్లు కట్టుబడి ఉంటారు. అవకతవకలు జరిగాయని సూపరింటెండెంట్ని ప్రభుత్వ సస్పెండ్ చేసింది. మరి మంత్రి సంగతేంటి? ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే వ్యవస్థ మనకు లేదా. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న ‘పెద్దమనిషి’ ఫిజియో కాదని తెలిసింది. అతను అత్యాచారం కేసులో నిందితుడని జైలు అధికారులు పేర్కొంటున్నారు. మరి అతనికి ఫిజియోథెరపీలో డిగ్రీ ఉందా.. లేదా రేప్ చేయడానికి ముందు అతను ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారా’ అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అనుమతి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైన్ సస్పెన్షన్ లేదా తొలగింపును రాష్ట్రపతికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కాగా భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణీ అయిన కిరణ్ బేడీ.. 1993లో ఢిల్లీ జైళ్ల ఐజీగా నియమితులయ్యారు. తిహార్‌లో జైళ్ల డైరెకర్ట్ జనరల్‌గా ఉన్న సమయంలో పలు జైలు సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు రామన్ మెగాసెస్ అవార్డు పొందారు. 2015లో బీజేపీలో చేరారు. చదవండి: అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ -
తీహార్ జైల్లో 5 స్టార్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్
-
మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు..
న్యూఢిల్లీ: అవీనితి కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు సంబంధించిన మరో వీడియోను బీజేపీ బయటపెట్టింది. జైలులో ఆయన పసందైన భోజనం చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది. కమలం పార్టీ జాతీయ ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఈ వీడియోను ట్వీట్ చేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. 'అత్యాచార కేసు నిందితుడితో జైలులో మసాజ్ చేయించుకున్న ఆప్ మంత్రి మరో వీడియోను చూడండి. ఈ సారి విలాసవంతమైన ఫుడ్‌ను ఆస్వాధిస్తున్నాడు. వెకేషన్‌కు వెళ్లి రిసార్టు భోజనం చేస్తున్నట్లు ఉంది. కేజ్రీవాల్ ఆయన మంత్రికి జైలులో వీవీఐపీ ట్రీట్ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు.' అని షెహ్జాద్ విమర్శలు గుప్పించారు. One more video from media! After taking maalish from rapist & calling him PHYSIO therapist, Satyendra Jain can be seen enjoying sumptuous meal! Attendants serve him food as if he is in a resort on vacation! Kejriwal ji ensured that Hawalabaaz gets VVIP maza not saza! pic.twitter.com/IaXzgJsJnL — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 23, 2022 ఈ వీడియోలో సత్యేంజర్ జైన్‌కు ఓ వ్యక్తి కవాల్సినవన్నీ సమకూర్చుతున్నాడు. డస్ట్‌బిన్‌ను మంత్రి కుర్చీ దగ్గర పెట్టాడు. జైలు గదిలో ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. దీంతో అవినీతి కేసులో అరెస్టయిన వ్యక్తికి రాజభోగాలు కల్పిస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. కాగా.. ఇటీవలే సత్యేంజర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియోను విడుదల చేసింది బీజేపీ. అయితే అది మసాజ్ కాదని, ఫిజియోథెరపీ అని ఆప్ చెప్పుకొచ్చింది. కానీ మసాజ్ చేసిన వ్యక్తి రేప్ కేసులో నిందితుడు అని తిహార్ జైలు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. చదవండి: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్ -
పాక్ ఉగ్రవాది కసబ్‌కి ఉన్న వెసులుబాటు నాకు లేదు: సత్యేంద్ర జైన్
తిహార్ జైలులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ మసాజ్ వీడియో లీకైన సంగతి తెలిసిందే. పైగా ఆ మసాజ్ చేస్తున్న వ్యక్తి రేపిస్ట్ అని జైలు అధికారులు చెప్పడంతో మరింత వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు సత్యేంద్ర జైన్ జైలు గదిలోని ఫుటేజ్ లీక్ అవ్వడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. అందులో భాగంగా జైన్ మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టు ఆదేశాలు ఉల్లంఘింస్తూ... మీడియాకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ జైన్ తరపు న్యాయవాది వాదించారు. వారి చర్యలతో ప్రతి నిమిషం తమ పరువు పోతుందని అన్నారు. ఈ మేరకు సత్యేందర్ జైన్ ట్రయల్ కోర్టులో మాట్లాడుతూ...కనీసం 26/11 ముంబై దాడుల్లో ఉరిశిక్ష పడిన పాకిస్తాన్ ఉగ్రవాదిని ప్రస్తావిస్తూ... అజ్మల్ కసబ్‌కు కూడా ఉచిత న్యాయపరమైన విచారణ వచ్చింది. కనీసం నేను అంతకంటే అధ్వాన్నంగా లేను. నేను కోరేది న్యాయమైన ఉచిత విచారణ. దయచేసి నాకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా నివేదికలను పరిశీలించండి అని జైన్ కోర్టుని కోరాడు. అలాగే ఆయన జైలుతో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నట్లు వచ్చిన ఈడీ ఆరోపణలను కూడా ఖండించారు. జైలులో తాను 28 కేజీలు తగ్గాను, సరైన తిండి కూడా లేదన్నారు. కోర్టు తనపై ఒత్తిడి తీసుకువచ్చిన జైలు నిబంధనలను కూడా ఉల్లంఘించలేదని అన్నారు. మరోవైపు జైన్‌ని జైలులో ఉంచేందుకు బీజేపీ ఈడీని దుర్వినియోగం చేస్తుందంటూ ఆప్ పదేపదే ఆరోపిస్తోంది. ఐతే ఈడీ తరుపు న్యాయవాది జోహైబ్ హుస్సేన్ సత్యేంద్ర జైన్‌కి ఫిజియోథెరఫీ తీసుకోమని సలహ ఇవ్వడంతో ఆయన దానిని తీసుకుంటున్నారని వాదించారు. కేంద్ర ఏజెన్సీ ద్వారా ఒక్కటి కూడా లీక్ అవ్వలేదని అన్నారు. అలాగే దోషులకు న్యాయం జరిగేలా చూస్తామని న్యాయవాది అన్నారు. అలాగే జైన్ తరుఫు న్యాయవాది కేంద్ర ఏజెన్సీలు తనను ఉరిశిక్ష పడే ఖైదీగా చిత్రీకరిస్తూ లీక్ అవుతున్న వీడియోలు, ప్రముఖ ఛానెల్‌ల స్క్రీన్షాట్లను కూడా సమర్పించారు. ఐతే ఈడీకి నేతృత్వం వహిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) ఎస్సీ రాజు వ్యక్తిగత కారణాలతో హాజరు కాకపోవడంతో కోర్టు ఈ కేసును వాయిదా వేసింది. (చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్..) -
Satyendar Jain: తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మసాజ్
తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మసాజ్ -
ఆప్ మంత్రికి మసాజ్.. కొత్త మలుపు
-
Tihar Jail: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్
ఢిల్లీ: తిహార్ జైలులో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ రాజభోగాల వ్యవహారంలో మరో ట్విస్ట్ ట్విస్ట్ చేసుకుంది. మంత్రి మసాజ్ చేయించుకున్న వీడియోను ఫిజియోథెరపీగా ఆప్ చిత్రీకరించగా.. అందులో వాస్తవం లేదని తిహార్ జైలు అధికారులు చెప్పారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాదని, రేపిస్ట్ అని నిర్ధరించారు. పోక్సో చట్టం సహా ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల ప్రకారం అభియోగాలు ఎదుర్కొంటున్న రింకుగా గుర్తించినట్లు తెలిపారు. సత్యేంద్ర జైన్.. సహచర జైలు ఖైదీలతో మసాజ్ చేయించుకుంటున్నారని వెల్లడించారు. తిహార్ జైలులో సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకున్న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో అరెస్టయిన వారు జైలులో రాజభోగాలు అనుభవించడమేంటని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను ఆప్ తిప్పికొట్టింది. మంత్రి మసాజ్ చేయించుకోలేదని, ఫిజియెథెరపీలో భాగంగా చికిత్స తీసుకున్నారని చెప్పింది. వైద్యుల సూచనమేరకు చికిత్స అందించినట్లు పేర్కొంది. కానీ తాజాగా తిహార్ జైలు అధికారులు అతను ఫిజియోథెరపిస్ట్ కాదని, రేప్ కేసు నిందుతుడు అని చెప్పడంతో ఆప్‌కు షాక్ తగిలనట్లయింది. So instead of Sazaa - Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 19, 2022 చదవండి: ఫుట్‌బాల్ చూసేందుకు రూ.లక్షలు పెట్టి ఇల్లు కొన్న క్రేజీ ఫ్యామిలీ.. -
ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీడియో వైరల్
వైరల్/ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు.. వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జైల్లో ఆయన మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు శనివారం జాతీయ మీడియా ఛానెల్స్‌లో ప్రముఖంగా చక్కర్లు కొడుతున్నాయి. జైల్లో జైన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందని ఈడీ, కోర్టుకు తెలిపిన కొన్నిరోజులకే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. తల, కాళ్లకు ఓ మనిషితో ఆయన మసాజ్ చేయించుకుంటున్న ఫుటేజీ అది. సెప్టెంబర్‌లోనే ఇది జరిగినట్లు ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకమైన సదుపాయాలు.. పక్కనే మినరల్ వాటర్ బాటిల్స్ ప్యాక్ కూడా గమనించవచ్చు. జైళ్ల నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సదుపాయాలు అందాయన్నది ప్రధాన విమర్శ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సదరు వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీనిపై తీహార్ జైల్ అధికారులు స్పందించాల్సి ఉంది. మే 30వ తేదీన మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ఈడీ సమక్షంలో అరెస్ట్ అయ్యారు. మరోవైపు అవినీతి స్కామ్‌లో జైన్‌తో పాటు ఆయన భార్యాబిడ్డలకు ప్రమేయం ఉందని అభియోగాలు నమోదు చేసింది. So instead of Sazaa - Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 19, 2022 -
ఢిల్లీలోని తిహార్ జైల్లో ఆప్ మంత్రికి వీఐపీ ట్రీట్మెంట్
-
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్‌తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్‌లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్‌ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్‌కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
నా ఒకేఒక్క తప్పు.. మంత్రి కావడం!
ఢిల్లీ: మంత్రి కావడమే తాను చేసిన పెద్ద తప్పైపోయిందని, ఆ పదవే లేకుంటే తనపై ఆరోపణలు.. కేసు ఉండేవి కావని ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ అంటున్నారు. ఈ మేరకు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థనలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ ఎదుట సత్యేందర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరణ్ శుక్రవారం వాదనలు వినిపించారు. విచారణ దశలో ఉండడంతో.. తొలి బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని ఈ సందర్భంగా అడ్వొకేట్ హరిహరణ్ గుర్తు చేశారు. అయితే ఆరోపణల్లో పేర్కొన్నట్లు తన క్లయింట్ ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా, షేర్‌హోల్డర్‌గా లేరనే విషయాన్ని ప్రస్తావించారు. మంత్రి పదవితో ప్రజా జీవితంలోకి రావడమే తన తప్పైందంటూ సత్యేందర్ తరపున ఆయన వాదించారు. ఒకవేళ పదవిలో లేకుంటే.. అసలు తనపై కేసే ఉండేది కాదని చెప్పారాయన. అంతేకాదు.. ఈడీ సమర్పించిన ఆధారాల్లో సదరు కంపెనీల్లో జైన్ వాటాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కాలేదని హరిహరణ్ వాదించారు. ఇక సత్యేంద్ర జైన్ బెయిల్ అభ్యర్థన పిటిషన్‌పై నవంబర్ 5వ తేదీన ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, ఈడీ వాదనలు విననున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్(57) మే నెలలో అరెస్ట్ అయ్యారు. ఇదీ చదవండి: సత్యేందర్ జైన్ హవాలా లింకులపై ప్రాథమిక సాక్ష్యాలు: కోర్టు -
‘ఆ మంత్రికి హవాలా లింకులు.. వ్యవసాయ భూముల కొనుగోలు’
న్యూఢిల్లీ: హవాలాతో లింకులపై ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రి, ఆయన సన్నిహితులు హవాలా లింకులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యేందర్ జైన్, ఆయన సన్నిహితులు.. హవాలానిధులతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని ఢిల్లీలోని మనీ ల్యాండరింగ్ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దీనిపై ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు శుక్రవారం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు -
Sakshi Cartoon: ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖంపై గాయం-కేజ్రీవాల్ సీరియస్
ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖంపై గాయం-కేజ్రీవాల్ సీరియస్ -
కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో ఆయనకు నోటి దగ్గర కూడా రక్తపు గాయాలయ్యాంటూ... రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆప్ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తప్పుడు ఆరోపణలతో ఆప్ నాయకులను అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలను అస్త్రంగా వాడుకుంటుందంటూ విరుచుకుపడ్డారు. అయినా ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు కాబట్టి అతని పరిస్థితి గురించి ఇప్పుడేం చెప్పలేనన్నారు. ఐతే సత్యేందర్ జైన్‌కి కాస్త బాగోకపోవడంతో గురువారం ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు ఈడీ తెలిపింది. తదుపరి అతను కాస్త మెరుగైన వెంటనే కారులో ఆస్పత్రి నుంచి తిరిగి తీసుకువస్తున్న సమయంలోని ఫోటోలు ట్విట్టర్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆప్ నాయకులు అతనికి మద్ధతుగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఢిల్లీకి మొహల్లా క్లినిక్‌లు ఇచ్చిన వ్యక్తి సత్యేందర్, నిజాయితీతో ప్రజలకు సేవకు చేసిన గొప్ప వ్యక్తి అని ఆప్ సభ్యుడు వికాస్ యోగి ట్వీట్ చేశారు. మరో వ్యక్తి ... వైరల్ అవుతున్న ఫోటో ప్రధాని మోదీకి ఈడీకి నల్లనిమచ్చ, దేశం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించందంటూ భావోద్వేగంగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ये वो इंसान है जिसने मोहल्ला क्लीनिक बनाया है। लोगों की ईमानदारी से सेवा की है । भाजपा वालों एक दिन भगवान सबका हिसाब करेगा। :( pic.twitter.com/2Fzp36Yo5i — Vikas Yogi (@vikaskyogi) June 9, 2022 ये वो शख़्स है जिसने देश को मोहल्ला क्लिनिक का मॉडल दिया 5 Flyover के निर्माण में दिल्ली की जनता का 300 करोड़ रु बचाया।@SatyendarJain की ये तस्वीर मोदी और उनकी मैना (ED) पर काला दाग है। ये देश तुम लोगों को कभी माफ़ नही करेगा। pic.twitter.com/ejO4KcLLFb — Sanjay Singh AAP (@SanjayAzadSln) June 10, 2022 (చదవండి: అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు -
అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సత్యేందర్ పై ఉన్నమనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయని నివాస ప్రాంతాల్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించింది. దర్యాప్తు సంస్థ ఆ సోదాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆ రూ.2 కోట్ల నగదును ఎస్ రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఆవరణలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పైగా రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్లుగా వైభవ్ జైన్, అంకుష్ జైన్, నవీన్ జైన్లు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. సత్యేందర్‌ని కోల్‌కతా కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసి అరెస్టు చేసిన సంగతి విధితమే. దీంతో సత్యేందర్ జైన్‌ని జూన్1 నుంచి వరకు దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు. సత్యేందర్ వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన నిధుల మూలాన్ని వివరించలేకపోయారని ఆరోపించింది. ఆయన ఢిల్లీలో అనేక కంపెనీలను కొనుగోలు చేయడమే కాకుండా వాటి ద్వారా సుమారు రూ. 16. 39 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చకున్నారంటూ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అవన్నీ అబద్ధాలని, ఢిల్లీ అభివృద్ధి చూడలేక చేస్తున్న దాడులంటూ ప్రధాని నరేంద్ర మోదీ పై విరుచకుపడుతున్నారు. (చదవండి: నెక్ట్స్ టార్గెట్ సిసోడియానే: కేజ్రివాల్) -
‘మీ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’
న్యూఢిల్లీ: తమ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయమై ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడ్డారు. సత్యేంద్ర జైన్ ‘నిందితుడు’ కాదని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులో పేర్కొందని, మీరు అవినీతికి ఎలా పాల్పడ్డారు? మనీష్ సిసోడియా బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తారన్నారు. అసలు అవినీతి అంటే ఏమిటో, పెద్ద అవినీతిపరులు ఎలా ఉంటారో దేశానికి చెబుతామన్నారు. పంజాబ్ ఎన్నికలకు ముందే జైన్‌ని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుసుకున్నానని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియాను కూడా ఇరికిస్తారని, జైన్ తర్వాత అరెస్టు చేయబడే తదుపరి ఢిల్లీ మంత్రి ఆయనే కావచ్చునని చెప్పారు. ఈ మేరకు కేజ్రీవాల్ సోషల్ మీడియాలో మోదీజీ 'మమల్నందర్నీ జైల్లో వేయండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల మే 30న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని మంత్రి సత్యేందర్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పై 2015-16లో కోల్‌కతాకు చెందిన సంస్థతో హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసింది. केंद्र सरकार ने खुद ही कोर्ट में बोल दिया कि सत्येंद्र जैन “आरोपी” नहीं हैं। जब आरोपी ही नहीं हैं तो भ्रष्ट कैसे हुए? मनीष सिसोदिया जी आज भाजपा के एक बड़े नेता का खुलासा करेंगे। वो देश को बतायेंगे कि असली भ्रष्टाचार क्या होता है और बड़े भ्रष्टाचारी कैसे होते हैं pic.twitter.com/MgUF0DEwxJ — Arvind Kejriwal (@ArvindKejriwal) June 4, 2022 (చదవండి: చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ మౌర్య సామ్రాజ్యపు అవశేషాలు) -
కేజ్రీవాల్ ఊహించినట్లే జరిగింది!
ఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్(57) అరెస్ట్ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అరెస్ట్‌ను.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ చేయించిన అరెస్ట్‌గా ఆమ్ఆద్మీపార్టీ ఆరోపిస్తోంది. అయితే జైన్ అరెస్ట్‌ను ఢిల్లీ సీఎం ఏనాడో ఊహించారా?.. ఆయన ఏమన్నారంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేస్తారని జనవరిలోనే చేసిన అంచనా.. సోమవారం నిజమైంది. ఈ మేరకు ఓ ఈవెంట్‌కు హాజరైన కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో అది పంజాబ్ ఎన్నికలకు ముందు, లేదంటే తర్వాతైనా సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేసేందుకు ఈడీ వస్తున్నట్లు సమాచారం అందింది. కేంద్రం జైన్‌పై గతంలో రెండుసార్లు దాడులు చేసినా.. ఏమీ దొరకలేదు. ఇప్పుడు మళ్లీ రావాలనుకుంటే.. వాళ్లకు స్వాగతం. ఎన్నికల సీజన్ టైంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంటుంది. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను మోహరిస్తుంటుంది. ఈ క్రమంలోనే దాడులు, అరెస్టులు జరుగుతుంటాయి. కానీ, మేం అరెస్టులకు భయపడం. ఇది కేంద్రం ఆడిస్తున్న డ్రామానే అని, ఆప్‌పై అవినీతి ముద్ర వేయించేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రజలకు అసలు విషయం అర్థం కావడానికి ఎంతో టైం పట్టదు అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సత్యేందర్ జైన్‌కు ఝలక్ ఇచ్చింది. సోమవారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలల కిందటే ఆయనకు, కుటుంబ సభ్యులకు సంబంధించిన 4.81 కోట్ల రూపాయల ఆస్తిని ఈడీ ఎటాచ్ చేసింది. కోల్‌కతా సంబంధించిన సంస్థల ద్వారా 2015-16 మధ్యకాలంలో హవాలా లావాదేవీలు నిర్వహించారని సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో సోమవారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య శాఖతో పాటు పిడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలను నిర్వహిస్తున్నారు. చదవండి👉: సభలో సీఎం యోగితో నవ్వులు పూయించి! అంతలోనే.. -
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి ఈడీ ఝలక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఝలక్ ఇచ్చింది. సోమవారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. సమాచారం ప్రకారం.. కలకత్తా సంబంధించిన సంస్థల ద్వారా హవాలా లావాదేవీలు నిర్వహించారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖతో పాటు పిడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలను మంత్రి సత్యేందర్ జైన్ పర్యవేక్షిస్తున్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీలోకి భారీగా చేరికలు
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లోకి వలసలు జోరందుకున్నాయి. హరియాణాకు చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సామాజిక కార్యకర్తలు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. అక్కడ కూడా అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో హిమచల్ ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత, ప్రస్తుత పాలకులు విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హిమాచల్‌తో పాటు, 2024లో ఎన్నికలు జరగనున్న కేజ్రీవాల్ సొంత రాష్ట్రం హరియాణాలోనూ పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. హరియాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తమకు నమ్మకం ఉందని సత్యేందర్ జైన్ అన్నారు. (క్లిక్: ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా) ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ నిర్ణయించింది. గుజరాత్‌ను 1995 నుంచి బీజేపీ పరిపాలిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) -
భారీగా నమోదవుతున్న కేసులు.. ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి
Omicron Community Spread In Delhi సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేనివారు కొత్త వేరియంట్ బారినపడుతున్నారని ఆయన తెలిపారు. తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం పాజిటివ్ శాంపిల్స్‌లో 46శాతం ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే కేసులు గణనీయంగా పెరుగుతున్నా వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇదిలాఉండగా... 320 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. 450 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆంక్షలపై ఆగ్రహం మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అమలుచేస్తున్న ఆంక్షలపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహ్రాలీ-బదర్‌పుర్ రోడ్డు రోడ్డును దిగ్బంధించడమే కాకుండా.. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టారు. ఎల్లో అలర్ట్ అమల్లో ఉన్నందున 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ల వద్దే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు ఆగ్రహానికి లోనయ్యారు. బస్సులపై దాడులు చేశారు. (చదవండి: ‘మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63) -
రైతులకు ఢిల్లీలోకి అనుమతి.. కానీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రైతులను ఢిల్లీలోకి అనుమతించారు. అయితే పోలీసు ఎస్కార్ట్ మధ్యే వారు నగరంలోకి అడుగు పెట్టాలని షరతు విధించారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దులోని సింఘ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, సంయుక్త్ కిసాన్ మోర్చా నాయకుల మధ్య చర్చల తరువాత ఢిల్లీ బురారీలోని నిరంకారి మైదానంలో రైతులు నిరసన తెలిపేందుకు అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని బాటపట్టారు. వారిని నిలువరించేందుకు హర్యానా సర్కార్ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. (చదవండి: నిరసనకారుడి వీడియో నెట్టింట్లో వైరల్) అంతేకాకుండా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. రైతులను అదుపులోకి తీసుకోవడానికి తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక జైలుగా మార్చడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ పోలీసుల అభ్యర్థనని హోం మంత్రి సత్యేందర్ జైన్ నిరాకరించారు. -
కరోనా థర్డ్ వేవ్.. నో లాక్డౌన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దాటి.. థర్డ్ వేవ్‌లోకి ప్రవేశించిందని. అది కూడా పీక్ స్టేజ్‌లో ఉందని తెలిపారు. అయితే మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ నవంబర్లోనే ప్రారంభం అయ్యింది. పీక్ స్టేజ్‌లో ఉంది. ప్రజలంతా మాస్క్‌లు ధరించి ఉండటం మంచింది. ప్రజలు నమ్మకం కోల్పోకుండా.. తమని తాము కాపాడుకుంటూ.. ఇతరులను కాపాడితే మేలు’ అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్యేంద్ర జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నమోదవుతున్న కేసులకు సరిపడా ఐసీయు బెడ్స్ అందుబాటులో లేవు. దాంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బెడ్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి: ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు) ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, గవర్నర్ అనిల్ బైజాల్ ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షా అధ్యక్షతన ఈ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మహమ్మారి విజృంభణ సమయంలో కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రి అమిత్ షా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అన్ని విభాగాలు కలిసి పని చేస్తాయి. ప్రజల కోసం కేంద్రం డీఆర్డీఓ సెంటర్లో 750 బెడ్స్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. అలానే ఢిల్లీలో టెస్టుల సంఖ్య 1-1.25 లక్షలకు పెంచుతామని తెలిపింది’ అన్నారు. ఇక అక్టోబర్ 20 నుంచి దేశ రాజధానిలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. బెడ్లు ఉన్నాయి కానీ.. ఐసీయూ బెడ్స్ కొరత ఏర్పడింది. -
ఢిల్లీలో గరిష్ఠ స్థాయికి కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే గరిష్ట స్థాయిలో 8,593 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,59,975కు చేరింది. మరణాల రేటు కూడా పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో 85 మంది మృతి చెందారు. ఇంత మొత్తంలో మరణాలు నమోదుకావటం ఇది రెండో సారి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 42,629గా ఉంది. పండుగ సీజన్, శీతాకాలం ప్రారంభంతో కాలుష్యం పెరిగి ఈ మహమ్మారి వ్యాప్తి మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత రెండు వారాల్లో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల వివరాలను తెలపాలంది. రోజువారి కేసుల సంఖ్య మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను మించిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఎలాంటి పటిష్టమైన చర్యల్ని తీసుకుంటోందని అడిగింది. (భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు) ఇతర రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధిస్తుంటే ఢిల్లీలో మాత్రం అటువంటి నిబంధనలు పాటించటం లేదని.. ఈ పరిణామం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ అవుతుందని హెచ్చరించింది. ప్రభుత్వం రానున్న పండుగల దృష్ట్యా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి పరీక్షల సంఖ్య పెంచుతున్నామని తెలిపింది. షాపింగ్ మాల్స్‌లలో సిబ్బందికి, వినియోగదారులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని.. రెస్టారెంట్లలోని సిబ్బందికి, రద్దీ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరిక్షల సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17వేల టెస్టులు చేశామని, టెస్టులను పెంచుతున్నామని.. రాబోయే రెండు రోజుల్లో కేసులు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
58 లక్షల మందిలో యాంటీబాడీలు వృద్ధి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 28.35 శాతం జనాభా కరోనా బారిన పడ్డారని.. వారందరిలో యాంటీబాడీస్(ప్రతిరోధకాలు) అభివృద్ధి చెందాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన సెరోలాజికల్ సర్వే రెండవ దఫా వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. దీని ప్రకారం ఢిల్లీలో 28.35 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఆగస్టు 1-7 వరకు జరిగిన ఈ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించామన్నారు. దీని ప్రకారం ఇప్పటివరకూ ఢిల్లీలో 58 లక్షల మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయన్నారు. ఢిల్లీలో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ సెరోలాజికల్ సర్వే నిర్వహిస్తోంది. (ఓ కుదుపు కుదిపింది... కరోనా!) జూలైలో మొదటి దఫా, ఆగస్టులో రెండో దఫా సర్వే నిర్వహించగా.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడు, నాలుగు దఫాల సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్యేంద్ర జైన్ తెలిపారు. జూలై 21న జరిగిన మొదటి సెరోలాజికల్ సర్వే ఫలితాల్లో దేశ రాజధానిలో 23.48శాతం జనాభా కరోనావైరస్ ద్వారా ప్రభావితమైందని తేలింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో కనిపించే యాంటీబాడీల స్థాయిని ఈ సెరోలాజికల్ సర్వే ద్వారా అంచనా వేస్తున్నారు. ఈ సర్వేలో ప్రజలకు వారి అనుమతితో రక్త పరీక్షలు నిర్వహించి శరీరంలోని యాంటీబాడీల స్థాయిని గుర్తిస్తారు. -
కరోనా: ఢిల్లీలో గణనీయంగా తగ్గుదల
ఢిల్లీ : కరోనా కేసులు దేశ రాజధాని ఢిల్లీలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. రోజూ వారి కరోనా కేసుల విషయంలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే ఢిల్లీ 12వ స్థానానికి పడిపోయిందని పేర్కొన్నారు. గడిచిన 21 రోజుల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతుండగా ఢిల్లీలో తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా కొత్తగా 1195 కరోనా కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,35,598కు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 10,705 యాక్టివ్ కేసులే ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అంతకుముందు భారత్‌లో అత్యధిక కరోనా కేసుల జాబితాలో మహారాష్ర్ట తర్వాత రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీలో వరుసగా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పడు 496 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని చెప్పారు. (19 మంది వృద్ధులను ఒకే గదిలో బంధించి..) ఢిల్లీ వ్యాప్తంగా శనివారం నుంచి తదుపరి రౌండ్ సెరోలాజికల్ సర్వే ప్రారంభమవుతుందని సత్యంద్ర జైన్ తెలిపారు. దీని ప్రకారం ప్రతి జిల్లా వైద్యాధికారులు తమ పరిధిలో ఉండే జోన్లలో సర్వే నిర్శహించాల్సి ఉంటుంది. గత సర్వేలో 24 శాతం మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తేలింది. రాష్ర్టంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్, హర్యానాలలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూడగా, 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. (భారత్: 16 లక్షలు దాటిన కరోనా కేసులు) -
ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ప్లాస్మా థెరఫీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ప్లాస్మా థెరఫీ చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈనెల 17న సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఆయన్ని తొలుత ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయితే శుక్రవారం సాయంత్రం ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు గుర్తించడంలో మాక్స్ ఆస్పత్రికి తరలించారు. (ఆక్సిజన్ సపోర్ట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి) జైన్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇక జైన్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తగిన చికిత్సను అందించాలని వైద్యులను కోరారు. అలాగే కరోనా నుంచి జైన్ వెంటనే కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్) -
కరోనా : ఆక్సిజన్ సపోర్ట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి
న్యూఢిల్లీ : కరోనాతో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో.. వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వైద్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో జూన్ 15న సత్యేంద్ర జైన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనుకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉంచారు. సత్యేంద్ర జైన్ఆస్పత్రిలో చేరడంతో.. ఆరోగ్య శాఖతోపాటు ఆయన నిర్వహించే అన్ని శాఖల బాధ్యతలను తాత్కాలికంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. మరోవైపు ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
దీక్ష ఎఫెక్ట్; అనారోగ్యం పాలైన ఆరోగ్యశాఖ మంత్రి
న్యూఢిల్లీ : గత ఏడురోజులుగా ఢిల్లీ లెఫ్నినెంట్ గవర్నర్ కార్యలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌తో పాటు దీక్ష చేస్తున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం పూర్తీగా క్షీణించింది. దీంతో ఆదివారం రాత్రి చికిత్స నిమిత్తం ఆయనను లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి ఎల్ఎన్జీపీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పాసీ ‘మా డాక్టర్ల బృందం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీక్ష చేస్తున్న మంత్రుల ఆరోగ్యాలను పరీక్షిస్తాము. ఈ క్రమంలో భాగంగా నిన్న మధ్యాహ్నం వరకూ కూడా సత్యేంద్ర జైన్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ ఆదివారం రాత్రి సమయానికి జైన్ కీటోన్ లెవల్స్ బాగా పడిపోయాయి. దాంతో జైన్ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. విషయం తెలిసిన వెంటనే మేము జైన్‌ను ఆస్పత్రికి తరలించాము. ప్రస్తుతం అతనికి చికిత్ప అందిస్తున్నాం ’ అన్నారు. కాగా కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి సీపీఎం కూడా మద్దతు తెలపడమే కాక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరవడంతో ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎల్జీ తీరుపై నిరసన తెలుపుతున్న కేజ్రీవాల్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగో సమావేశ కార్యక్రమంలో పాల్గోనేందుకు ఢిల్లీ వెళ్లిన పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. -
మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో బుధవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి క్రియేటివ్ టీమ్‌ను నియమించుకున్న సమయంలో పలు అవకతవలకు పాల్పడ్డారన్న కారణంగా దాడులు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు ప్రారంభించిన వెంటనే సత్యేందర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి క్రియేటివ్ టీమ్ నియమించుకున్న కారణంగా సీబీఐ అధికారులు నా ఇంటిలో సోదాలు చేశారు. విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాజెక్టుల కోసం నియమించుకున్న అధికారులను ప్రస్తుతం వదులుకోవాల్సి వస్తోందని’ సత్యేందర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ‘ప్రధాని మోదీ అసలు ఏం కోరుకుంటున్నారంటూ’ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా సత్యేందర్.. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లో శక్తివంతుడైన మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యశాఖతో పాటు పరిశ్రమలు, పీడబ్ల్యూడీ, విద్యుత్, కుటుంబ సంక్షేమ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. Cbi raids my house for hiring creative team by PWD. Professionals were hired for different projects. All were forced to leave by cbi. — Satyendar Jain (@SatyendarJain) May 30, 2018 What does PM Modi want? https://t.co/3vN1MVxPqk — Arvind Kejriwal (@ArvindKejriwal) May 30, 2018 -
మంత్రిగారి ఆస్తులు ఎటాచ్!
ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు ఎటాచ్ చేశారు. దేశ రాజధానిలో ఆయనకు ఉన్న దాదాపు 40 ఎకరాల బూమితో పాటు పలు కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య వార్ మరింత ముదిరింది. భూమి రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ. 17 కోట్లు, షేర్ల విలువ రూ. 16 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువేనంటున్నారు. ఇండో మెటల్ఇంపెక్స్, అకించన్ డెవలపర్స్, ప్రయాస్ ఇన్ఫోసొల్యూషన్స్, మంగల్యతన్ ప్రాజెక్ట్స్ కంపెనీలలో ఉన్న షేర్లను కూడా ఎటాచ్ చేశారు. ఈ కంపెనీలకు సత్యేంద్ర జైన్ నగదు రూపంలో చెల్లింపులు చేసి, షేర్ల కొనుగోలుకు అక్రమంగా బుక్ ఎంట్రీలు చేయించుకుంటున్నారని పన్ను అధికారులు ఆరోపించారు. ఇండోమెటల్ఇంపెక్స్కు చెందిన మరికొంత భూమిని కూడా ఎటాచ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతులైన మంత్రులలో సత్యేంద్ర జైన్ ఒకరు. ఆయనకు ఆరోగ్యం, రవాణా, పీడబ్ల్యుడీ లాంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆదాయపన్ను శాఖ చర్యలపై సత్యేంద్ర జైన్‌ను మీడియా ప్రశ్నించగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రాథమికంగా 90 రోజుల పాటు ఈ ఎటాచ్మెంట్ ఉంటుంది. బినామీ లావాదేవీలతో సంపాదించిన సొమ్ముతోనే ఈ ఆస్తులన్నింటినీ సేకరించారని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఆదాయాన్ని దాచిపెట్టినందుకు మంత్రిపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుగుతోంది. కోల్‌కతాకు చెందిన బడా ఆపరేటర్లు జీవేంద్ర మిశ్రా, అభిషేక్ చొఖానీ, రాజేంద్ర బన్సల్ తదితరులతో సత్యేంద్ర జైన్‌కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లు నగదు తీసుకుని కేవలం కాగితాల మీదే ఉన్న కంపెనీల షేర్లను ఎక్కువ ధరలకు ఇస్తారు. ఆ షేర్ల రూపంలో వాళ్ల డబ్బంతా తెల్లధనం అయిపోతుంది. -
ఢిల్లీ రవాణాశాఖ మంత్రి రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారమిక్కడ ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగానే రవాణా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ...రవాణా శాఖ బాధత్యలను స్వీకరించనున్నారు. కాగా బస్సుల కుంభకోణంలో గోపాల్ రాయ్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని గోపాల్ రాయ్ అన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఆయన నిన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వివరణ కూడా ఇచ్చారు. గతంలో ఆటో పర్మిట్ల కేటాయింపులో భారీగా అక్రమాలు చోటుచేసుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం 932 ఆటో పర్మిట్లను రద్దు చేసింది. దీంతో అక్రమాలు జరిగాయంటూ గోపాల్ రాయ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే గోపాల్ రాయ్ మెడలో ఉన్న బుల్లెట్‌ను వైద్యులు తొలగించారు. 17 ఏళ్ల క్రితం లక్నో యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన సమయంలో పోలీసుల కాల్పుల్లోఆయన మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన ఏడాది పాటు పక్షవాతానికి కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి కోసమే రవాణా శాఖ బాధ్యతల నుంచి గోపాల్ రాయ్ తప్పుకున్నట్లు తెలిపారు.