
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఝలక్ ఇచ్చింది. సోమవారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. సమాచారం ప్రకారం.. కలకత్తా సంబంధించిన సంస్థల ద్వారా హవాలా లావాదేవీలు నిర్వహించారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖతో పాటు పిడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలను మంత్రి సత్యేందర్ జైన్ పర్యవేక్షిస్తున్నారు.