ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మానీలాండరింగ్ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై ఆప్ నేత సింజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు.
సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్‌లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌ను మాత్రం జైలు రూం గ్లాస్ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్ కూడా చేసుకున్నారు. తీహార్ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు.
కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్ జైలు అధికారులపై సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్ సింగ్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment