Delhi Minister Satyendar Jain In Car Appears Blood On His Face Viral - Sakshi
Sakshi News home page

కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్‌

Published Fri, Jun 10 2022 3:57 PM | Last Updated on Fri, Jun 10 2022 5:36 PM

Delhi Minister Satyendar Jain In Car Appears Blood On His Face Viral - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఆ ఫోటోలో ఆయనకు నోటి దగ్గర కూడా రక్తపు గాయాలయ్యాంటూ... రకరకాల ఊహాగానాలు హల్‌చల్ చేశాయి. ఈ మేరకు ఆప్‌ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తప్పుడు ఆరోపణలతో ఆప్‌ నాయకులను అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలను అస్త్రంగా వాడుకుంటుందంటూ విరుచుకుపడ్డారు.

అయినా ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు కాబట్టి అతని పరిస్థితి గురించి ఇప్పుడేం చెప్పలేనన్నారు. ఐతే సత్యేందర్‌ జైన్‌కి కాస్త బాగోకపోవడంతో గురువారం ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు ఈడీ తెలిపింది. తదుపరి అతను కాస్త మెరుగైన వెంటనే కారులో ఆస్పత్రి నుంచి తిరిగి తీసుకువస్తున్న సమయంలోని ఫోటోలు ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అయ్యాయి.

దీంతో ఆప్‌ నాయకులు అతనికి మద్ధతుగా సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఢిల్లీకి మొహల్లా క్లినిక్‌లు ఇచ్చిన వ్యక్తి సత్యేందర్‌, నిజాయితీతో ప్రజలకు సేవకు చేసిన గొప్ప వ్యక్తి అని ఆప్‌ సభ్యుడు వికాస్‌ యోగి ట్వీట్‌ చేశారు. మరో వ్యక్తి ... వైరల్‌ అవుతున్న ఫోటో ప్రధాని మోదీకి ఈడీకి నల్లనిమచ్చ, దేశం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించందంటూ భావోద్వేగంగా మరో ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement