delhi minister
-
Delhi air pollution: ‘గ్రాప్-4’ అమలును పర్యవేక్షించిన మంత్రి.. అధికారులకు సూచనలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలోని నాల్గవ దశ అమలువుతోంది.గ్రాప్ విధానంలోని ఫేజ్-4 అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం రాత్రి నరేలా-సింగు సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. గ్రేప్- 4లో ఢిల్లీలో రిజిస్టర్డ్ బీఎస్- ఫోర్, డీజిల్ పవర్డ్ మీడియం గూడ్స్ వెహికల్స్ (ఎంజీవీలు)నడవవు. ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రాప్ 4 అమలు చేసి, కాలుష్యం కలిగించే వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయితే ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందుకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. #WATCH | Delhi Environment Minister Gopal Rai says, "AAP govt is continuously working to mitigate the level of pollution in Delhi. Entry has been banned for those vehicles which cause pollution, as Grap 4 is implemented. Today, we have received several complaints that vehicles… https://t.co/Y5mm2frQYN pic.twitter.com/2DZEbtsuFV— ANI (@ANI) November 22, 2024రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కళ్ల మంటలతో బాధపడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 393గా నమోదైంది. గురువారంతో పోలిస్తే 22 ఇండెక్స్ పాయింట్లు పెరిగాయి. శని, ఆదివారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణుల అంచనా. రాత్రి సమయంలో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలిపిన వివరాల(ఐఐటీఎం) ప్రకారం శుక్రవారం పశ్చిమ దిశ నుంచి గాలులు వీచాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంది. సాయంత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది కాలుష్య కారకాలు, ఘనీభవనానికి కారణమైంది. దీంతో ప్రజలు పొగమంచుతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్‌ఘాట్‌లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
బీజేపీపైనా చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు. -
మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత కైలాశ్ గహ్లోత్‌ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన గహ్లోత్ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్ కూడా ఉన్నారు. చార్జిïÙట్లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి విజయ్ నాయర్ ఢిల్లీలోని గహ్లోత్ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. గహ్లోత్ ఒకే సిమ్ కార్డు వాడినా సెల్‌ఫోన్ ఐఎంఈఐ నెంబర్ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది -
ఢిల్లీ మంత్రికి ఈడీ షాక్
-
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు..
-
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడతామన్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో తన కార్యాలయానికి వచ్చిన సీఎఎస్.. 'నిన్ను చంపేస్తా' అని భయభ్రాంతులకుగురి చేశారని మంత్రి పేర్కొన్నారు. కాగా చీఫ్ సెక్రెటరీ తనను బెదిరిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా భరద్వాజ్ ఫిర్యాదు చేశారు. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ సైబర్ క్రైం -
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ..15 రోజుల పాటు..
మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం సందర్శకులు ఆయన్ను కలుసుకునేందుకు లేకుండా 15 రోజుల పాటు శిక్ష విధించింది. అలాగే అతనికి సెల్, టేబుల్, కుర్చి వంటి అన్ని సౌకర్యాలను తొలగించింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వలోని ప్రభుత్వ ప్రతినిధి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల నేపథ్యంలోనే సత్యేందర్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే అప్పటి జైలు అధికారి సందీప్ గోయోల్ కారణంగానే సత్యేందర్ జైల్లో రాజభోగాలు అనుభవించారంటూ విమర్శలుల రావడంతో గోయెల్‌పై కూడా కమిటీ శాఖాపరమైన చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అదీకూడ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించిన వారాల తర్వాత జైన్‌పై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి అవినీతి ఆరోపణలు ఎదర్కొంటూ తిహార్ జైలులో ఉన్నసత్యేందర్ జైన్ జూన్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన వరుస సీసీటీవీ వీడియో లీక్‌లతో వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు విఐపీ ట్రీట్మెంట్, పసందైన విందు అంటూ బీజేపీ వరుస వీడియోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులను సస్పెండ్ చేశారు కూడా. ఆఖరికి ఆయన బెయిల్ తిరస్కరణకు గురవ్వడం తోపాటు మత విశ్వాసాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకునేలా అనుమతించమంటూ చేసుకన్న అభ్యర్థన సైతం కోర్టు తిరస్కరించింది. (చదవండి: నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం) -
10 మంది సేవకులు
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అందుతున్న రాజభోగాలపై రోజుకో వీడియో వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక వ్యక్తి ఆయన గదిని శుభ్రం చేయడం, పక్క శుభ్రంగా సర్దడం వంటి దృశ్యాలు కనిపించాయి. జైన్‌కు కావల్సినవన్నీ చేసి పెట్టడానికి దాదాపుగా 10 మంది సేవకుల్ని కేటాయించినట్టుగా తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. గది శుభ్రం చేయడం , మంచంపై దుప్పట్లు మార్చడం, బయట నుంచి ఆహారం, పళ్లు, మినరల్ వాటర్ తేవడం, బట్టలుతకడం వంటి పనుల కోసమే ఎనిమిది మంది ఉన్నారు. వారందరూ సరిగా పనులు చేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి మరో ఇద్దరు వ్యక్తులు ఉంటారని తీహార్ జైలు వర్గాలు జాతీయ చానెళ్లకు వెల్లడించాయి. జైల్లో సత్యేంద్ర జైన్‌కు అందుతున్న సకల సదుపాయాలపై ఢిల్లీ కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తాను ఉల్లి, వెల్లుల్లి లేని జైన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటానని, అది తనకు జైల్లో ఇవ్వడం లేదంటూ సత్యేంద్ర జైన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పళ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం లేదన్న ఆ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధల్ తోసిపుచ్చారు. -
ఢిల్లీలో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిడి వివాదంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పదవి నుంచి తొలగించాలని ఆందోళనలు చేపట్టటంతో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వివాదాస్పదం కాకుండా ఉండేందుకు మంత్రి చేత రాజీనామా చేయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వివాదం ఏమిటి? దసరా రోజు(ఈనెల 5న) ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో భారీ సంఖ్యలో హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమంలో ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొనడంపై తీవ్ర వివాదం ముసురుకుంది. మతం మారుతున్న వ్యక్తులు హిందూ దేవుళ్లు, దేవతలను దూషిస్తున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యాలు గత శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నేతృత్వం వహించటంపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో గౌతమ్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. #BreakingNews Delhi social welfare minister @AdvRajendraPal, at the centre of an alleged conversion row, resigns@htTweets pic.twitter.com/jlM4XXkljD — Alok K N Mishra HT (@AlokKNMishra) October 9, 2022 ఇదీ చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్ -
‘ఆ మంత్రికి హవాలా లింకులు.. వ్యవసాయ భూముల కొనుగోలు’
న్యూఢిల్లీ: హవాలాతో లింకులపై ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రి, ఆయన సన్నిహితులు హవాలా లింకులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యేందర్ జైన్, ఆయన సన్నిహితులు.. హవాలానిధులతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని ఢిల్లీలోని మనీ ల్యాండరింగ్ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దీనిపై ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు శుక్రవారం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు -
కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో ఆయనకు నోటి దగ్గర కూడా రక్తపు గాయాలయ్యాంటూ... రకరకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఈ మేరకు ఆప్ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తప్పుడు ఆరోపణలతో ఆప్ నాయకులను అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలను అస్త్రంగా వాడుకుంటుందంటూ విరుచుకుపడ్డారు. అయినా ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తితో తమకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు కాబట్టి అతని పరిస్థితి గురించి ఇప్పుడేం చెప్పలేనన్నారు. ఐతే సత్యేందర్ జైన్‌కి కాస్త బాగోకపోవడంతో గురువారం ఆయన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు ఈడీ తెలిపింది. తదుపరి అతను కాస్త మెరుగైన వెంటనే కారులో ఆస్పత్రి నుంచి తిరిగి తీసుకువస్తున్న సమయంలోని ఫోటోలు ట్విట్టర్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆప్ నాయకులు అతనికి మద్ధతుగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఢిల్లీకి మొహల్లా క్లినిక్‌లు ఇచ్చిన వ్యక్తి సత్యేందర్, నిజాయితీతో ప్రజలకు సేవకు చేసిన గొప్ప వ్యక్తి అని ఆప్ సభ్యుడు వికాస్ యోగి ట్వీట్ చేశారు. మరో వ్యక్తి ... వైరల్ అవుతున్న ఫోటో ప్రధాని మోదీకి ఈడీకి నల్లనిమచ్చ, దేశం ఎప్పటికీ మిమ్మల్ని క్షమించందంటూ భావోద్వేగంగా మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ये वो इंसान है जिसने मोहल्ला क्लीनिक बनाया है। लोगों की ईमानदारी से सेवा की है । भाजपा वालों एक दिन भगवान सबका हिसाब करेगा। :( pic.twitter.com/2Fzp36Yo5i — Vikas Yogi (@vikaskyogi) June 9, 2022 ये वो शख़्स है जिसने देश को मोहल्ला क्लिनिक का मॉडल दिया 5 Flyover के निर्माण में दिल्ली की जनता का 300 करोड़ रु बचाया।@SatyendarJain की ये तस्वीर मोदी और उनकी मैना (ED) पर काला दाग है। ये देश तुम लोगों को कभी माफ़ नही करेगा। pic.twitter.com/ejO4KcLLFb — Sanjay Singh AAP (@SanjayAzadSln) June 10, 2022 (చదవండి: అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు -
అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సత్యేందర్ పై ఉన్నమనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయని నివాస ప్రాంతాల్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించింది. దర్యాప్తు సంస్థ ఆ సోదాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆ రూ.2 కోట్ల నగదును ఎస్ రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఆవరణలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పైగా రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్లుగా వైభవ్ జైన్, అంకుష్ జైన్, నవీన్ జైన్లు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. సత్యేందర్‌ని కోల్‌కతా కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసి అరెస్టు చేసిన సంగతి విధితమే. దీంతో సత్యేందర్ జైన్‌ని జూన్1 నుంచి వరకు దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు. సత్యేందర్ వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన నిధుల మూలాన్ని వివరించలేకపోయారని ఆరోపించింది. ఆయన ఢిల్లీలో అనేక కంపెనీలను కొనుగోలు చేయడమే కాకుండా వాటి ద్వారా సుమారు రూ. 16. 39 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చకున్నారంటూ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అవన్నీ అబద్ధాలని, ఢిల్లీ అభివృద్ధి చూడలేక చేస్తున్న దాడులంటూ ప్రధాని నరేంద్ర మోదీ పై విరుచకుపడుతున్నారు. (చదవండి: నెక్ట్స్ టార్గెట్ సిసోడియానే: కేజ్రివాల్) -
ఆప్‌కు షాక్ : మంత్రి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్‌సర్కార్‌కు మరో షాక్ తగిలింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ, రవాణా, శాఖామంత్రి కైలాశ్ గెహ్లాట్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు కలకలం రేపాయి. పన్నుల ఎగవేత ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పన్నుల ఎగవేత కేసుతో సంబంధమున్న కేసులో మంత్రి నివాసంతోపాటు దేశ రాజధాని చుట్టుపక్కల దాదాపు 16 ప్రాంతాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి, ఇతరులకు చెందిన రెండు నిర్మాణసంస్థలు పన్నులు ఎగవేసినకేసులో విచారణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. -
‘ఈవీఎంలను కాదు.. మనల్ని చెక్ చేసుకుందాం’
న్యూఢిల్లీ: సొంతపార్టీ నేతల నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పరాభవం ఎదురవుతోంది. ఓటమిని ఈవీఎంలపై తోసివేసి తప్పుకోవడం సరికాదని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ హవా ఉన్నా లేకపోయినా ఆప్ ఓడిపోయిందన్నమాట ఇప్పుడు వాస్తవం అంటూ ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజు ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ పరోక్షంగా తమ పార్టీ అధినేతకు హితబోధ చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాల అనంతరం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, దీనిపై ఆప్ నేత ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజును ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రధాని మోదీ హవా ఉన్నా లేకపోయినా ప్రజలు మనకు ఓటు వేయలేదని స్పష్టమైంది. 2015 పొందిన విజయంతోపోలిస్తే అతి తక్కువ సీట్లు మాత్రమే వచ్చాయని తేటతెల్లమైంది. ఫలితాలను ఒక్క ఈవీఎంలను అపఖ్యాతి చేస్తూ మాత్రమే చెప్పలేము’ అని ఆయన అన్నారు. అయితే, ఏదేమైన ఆత్మవిమర్శ అత్యవసరం అని ఇది తన వ్యక్తి గత అభిప్రాయం అని చెప్పారు. మరోపక్క, ఢిల్లీలో బీజేపీ హవా ఉందని ఒప్పుకున్నారు. అయితే, ఇదే పార్టీకి చెందిన కార్మిక మంత్రి మాత్రం మోదీ హవా లేదని ఈవీఎంల హవా ఉందంటూ ఆరోపించారు. -
ఢిల్లీ మంత్రికి బెయిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ: ఓ వ్యక్తిని హత్య చేస్తానని బెదిరించిన కేసులో ఢిల్లీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్‌కు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. ఓ వ్యక్తిని చంపుతానని, రూ. 30 లక్షలు ఇవ్వకుంటే ఆ వ్యక్తి చేపట్టే నిర్మాణాన్ని కూల్చేస్తానని మంత్రి హుస్సేన్ బెదిరించారంటూ నమోదైన కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మంత్రి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆరోపణలు చాలా బలమైనవి, క్షమార్హమైనవి కాకపోవడం వల్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి సిద్ధార్థ్ శర్మ తేల్చి చెప్పారు. ఆరోపణలు చేసిన వ్యక్తికి, మంత్రికి మధ్య రాజీ కుదిరిందన్న న్యాయవాది వాదనలను జడ్జి కొట్టిపారేశారు. విషయం చాలా తీవ్రమైనది కావున ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. -
వారికి సన్మానం చేస్తాం!
తెల్లవారుజామున నడిరోడ్డుపై ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. నెత్తురోడుతూ నిస్సహాయంగా పడి ఉన్న అతడికి సహాయం చేయాల్సిందిపోయి.. ఓ వ్యక్తి ఆ అభాగ్యుడి సెల్‌ఫోన్ ఎత్తుకొని పారిపోయాడు. మానవతా దృక్పథంతో ఎవరూ స్పందించకపోవడంతో రోడ్డు మీదనే నెత్తురోడుతూ ఆ బడుగు సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన మనుషుల్లో తగ్గిపోతున్నా కనీస మానవతా స్పందనను పట్టిచూపించింది. సాటి మనిషి ఎలాపోతే మనకేంటన్న ఉదాసీనభావం ప్రజల్లో పేరుకుపోతున్నట్టు ఈ ఘటన చాటింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావాలని భావిస్తోంది. రోడ్డుప్రమాదాలు, ఆపద సమయాల్లో బాధితులకు వెంటనే సాయం అందించి, కాపాడే వారిని గుర్తించి, సత్కరించాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రభుత్వం తరఫున రివార్డులు అందజేస్తామని, ఇందుకు ముందుకొచ్చే ట్యాక్సీ డ్రైవర్లు, రిక్షాకార్మికులకూ రివార్డులు అందిస్తామని ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు. ఇందుకోసం పథకం ముసాయిదాను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రోడ్డుప్రమాద బాధితులకు ప్రజల నుంచి తక్షణసాయం అందేవిధంగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. -
అలాంటివాళ్లను బహిరంగంగా చంపాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులు ఉగ్రవాదులని, వాళ్లను బహిరంగంగా చంపాలని అన్నారు. అత్యాచార కేసుల్లో దోషులను ఉగ్రవాదులుగా పరిగణించి, బహిరంగంగా చంపేలా పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని మిశ్రా డిమాండ్ చేశారు. అలాగే మహిళలకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఢిల్లీ- కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, తల్లీకూతుళ్లపై దుండగులు గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం మంత్రి తన బ్లాగ్‌లో ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. గతేడాది ఢిల్లీలో 450 మంది మైనర్ బాలికలు లైంగికదాడికి గురయ్యారని వెల్లడించారు. ఏ సమయంలోనైనా, ఎవరికైనా ఇలాంటి దుస్థితి రావచ్చని, రేప్ కేసుల దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఉరిశిక్షకు తాను చాలాకాలం వ్యతిరేకమని, అయితే రేపిస్టులు ఉగ్రవాదులని, వారికి మరణశిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. -
'నోరు మూసుకో లేకుంటే కాల్చిపారేస్తాం'
న్యూఢిల్లీ: తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. జేఎన్ యూ వివాదంపై మౌనం వహించకుంటే చంపుతామని ఫోన్ లో బెదిరించారని చెప్పారు. ఉదయం 8.48 గంటలకు తన ఫోన్ కు బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. పూజారి అని చెప్పిన వ్యక్తి తనను బెదిరించాడన్నారు. 'నోరు మూసుకో లేకుంటే కాల్చి చంపుతాం' అని హెచ్చరించాడని తెలిపారు. 'నీ దగ్గర ఎక్కువ బుల్లెట్లు ఉంటే తీవ్రవాదులను కాల్చిచంపాల'ని అతడికి సూచించానని చెప్పుకొచ్చారు. +442, +3844, +9100, +501 నంబర్ల నుంచి తన ఫోన్ కు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. బెదిరింపులకు భయపడబోనని, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటానని కపిల్ మిశ్రా స్పష్టం చేశారు. -
టీచర్లను తీసేసే అధికారం తల్లిదండ్రులకుండాలి
పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు, టీచర్లను సస్పెండ్ చేసే, తొలగించే అధికారం తల్లిదండ్రులకు ఇవ్వాలని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోదియా అన్నారు. సోమవారం నాడు ఆయన ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్‌తో పాటు టీచర్లు కూడా సమయానికి రావట్లేదని, పిల్లలే ఒకరికొకరు పాఠాలు చెప్పుకోవడం, పరీక్షలు నిర్వహించుకోవడం లాంటివి చేస్తున్నారని ఆయన గమనించారు. పిల్లలు తనకు ఈ విషయాలన్నీ చెప్పారని, అసలు గత సోమవారం నుంచి టీచర్లు రాకపోయినా.. హాజరు పట్టీలో మాత్రం ఉదయం 9.30కి వచ్చినట్లు సంతకాలు పెడుతున్నారని ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. పిల్లలు తినే మధ్యాహ్న భోజనం చూస్తే, అందులో పురుగులు ఉన్నాయని, అసలు ఏమాత్రం తినడానికి పనికిరాకుండా ఉందని సిసోదియా చెప్పారు. భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ జేబులు నింపుకొంటున్నాడని, అందుకే ఈ కాంట్రాక్టర్ లైసెన్సు రద్దుచేసే అధికారం కూడా తల్లిదండ్రులకే ఇవ్వాలని ఆయన అన్నారు. తాను చూసిన పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.