
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్‌సర్కార్‌కు మరో షాక్ తగిలింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ, రవాణా, శాఖామంత్రి కైలాశ్ గెహ్లాట్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు కలకలం రేపాయి. పన్నుల ఎగవేత ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
పన్నుల ఎగవేత కేసుతో సంబంధమున్న కేసులో మంత్రి నివాసంతోపాటు దేశ రాజధాని చుట్టుపక్కల దాదాపు 16 ప్రాంతాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి, ఇతరులకు చెందిన రెండు నిర్మాణసంస్థలు పన్నులు ఎగవేసినకేసులో విచారణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు.