tax evasion case
-
పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్‌లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్‌తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్‌టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?తనిఖీలు ఎందుకు..?పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్‌వర్క్ కింద ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి. -
జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు
పన్ను పరిధిని విస్తరించడానికి, జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది. పన్ను ఎగవేతను గుర్తించి, అధికారికంగా నమోదుకాని డీలర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి గుజరాత్ రాష్ట్ర జీఎస్టీ యంత్రాంగం 30 బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) విభాగాలను గుర్తించింది. చాలా మంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కట్టడి చేసేలా 30 బీ2సీ విభాగాలను గుర్తించినట్లు చెప్పారు.ప్రభుత్వం గుర్తించిన బీ2సీ సెక్టార్లకు సంబంధించి అద్దె పెళ్లి దుస్తుల వ్యాపారులు, పాదరక్షలు, సెలూన్లు, నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్, ఐస్ క్రీం పార్లర్లు, టెక్స్టైల్ విక్రేతలు, పొగాకు వ్యాపారులు, బ్యాటరీ వ్యాపారులు, మొబైల్ ఫోన్, యాక్సెసరీస్ డీలర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కృత్రిమ పూలు అమ్మకం దారులు, అలంకరణ ఉత్పత్తుల విక్రేతలు, కోచింగ్ క్లాసుల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.పరిమితి దాటినా నమోదవ్వని వివరాలు..రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుదారులను దీని పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారించామన్నారు. బీ2సీ విభాగంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వారి పూర్తి ఆదాయాన్ని నివేదించడం లేదన్నారు. కొందరు సరైన బిల్లులను జారీ చేయకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది వ్యాపారుల టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించినప్పటికీ వివరాలు నమోదు చేయడం లేదన్నారు. పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..రెండు నెలల్లో రూ.20 కోట్లు..గత రెండు నెలలుగా గుజరాత్ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి రాష్ట్ర జీఎస్టీ విభాగం రూ.20 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. పన్ను పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సరైన బిల్లింగ్ లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్టర్ కాని డీలర్లకు సరుకులు సరఫరా చేసే రిజిస్టర్డ్ ట్రేడర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలోకి వస్తారని తెలియజేస్తున్నారు. -
1.81 కోట్లు సీజ్.. నారాయణ అల్లుడు పునీత్‌పై కేసు
సాక్షి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు పునీత్‌పై పన్నుల ఎగవేత కేసు నమోదు అయ్యింది. అంతేకాదు ఈ కేసు విచారణలో భాగంగా బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కోటికి పైగా నగదు సైతం సీజ్ చేశారు. ఈ సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. ‘‘ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారన్నమాట. ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశాం.. . పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించాం. ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. అలాగే.. నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు’’ అని ఎస్పీ వివరించారు. -
AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శరత్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్‌ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. శరత్ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు. కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ -
పన్ను ఎగవేతకు పాల్పడ్డాయా?, యూనికార్న్ సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు?
దేశీయ ఆదాయపు పన్ను శాఖ అధికారులు యూనికార్న్ సంస్థలు పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా మూడు యూనికార్న్ సంస్థలు ఫస్ట్ క్రై డాట్ కామ్, గ్లోబల్బీస్ బ్రాండ్స్ లిమిటెడ్, ఎక్స్ప్రెస్బీస్లు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డాయని గుర్తించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ దేశీయ యూనికార్న్ జాబితాలో ఉన్న ఫస్ట్ క్రై డాట్ కామ్ ఫౌండర్ సుపమ్ మహేశ్వరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లావాదేవీలపై 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ట్యాక్స్ ఎందుకు చెల్లించ లేదని ప్రశ్నిస్తూ సుపమ్కు జారీ చేసినట్లు నోటీసుల్లో ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కో, ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబ సభ్యుల కార్యాలయంతో సహా ఫస్ట్‌క్రైలో ఆరుగురు ఇన్వెస్టర్లు సైతం ఈ నోటీసులు అందుకున్నారని నివేదికలు హైలెట్ చేశాయి. నోటీసులతో సుపమ్ ఆదాయపు పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఆదాపు పన్ను శాఖ నోటీసులు, ట్యాక్స్ ఎగవేత అంశాలపై సుపమ్ మహేశ్వరి, క్రిస్ కేపిటల్, సునీల్ భారతి మిట్టల్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం విడుదల కావాల్సి ఉంది. -
ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్‌ను తిరస్కరించింది. -
Anil Ambani: అనిల్ అంబానీకి స్వల్ప ఊరట
ముంబై: పన్నుల ఎగవేత వ్యవహారంలో నోటీసులు అందుకున్న రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీకి స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ తేదీ నవంబర్ 17 వరకు ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టొద్దని ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది బాంబే హైకోర్టు. సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్‌మనీ యాక్ట్ కింద.. ఐటీ శాఖ అనిల్ అంబానీకి పోయిన నెలలో షో కాజ్ నోటీసు జారీ చేసింది. స్విస్ బ్యాంకులో ఆయనకు రెండు అకౌంట్లు ఉన్నాయని, ఆ వివరాలు దాచిపెట్టి సుమారు 420 కోట్ల రూపాయల్ని పన్నుల రూపంలో ఎగవేశారనే ఆరోపణ ఆయనపై ఉంది. ఈ నేరం గనుక రుజువైతే జరిమానాతో పాటు అనిల్ అంబానీకి గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. -
Shakira Tax Fraud Case:మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు
మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు. -
విషాదం.. జైల్లోనే ‘మెక్అఫీ’ ఆత్మహత్య!
మరో మేధావి జీవితం విషాదంగా ముగిసింది. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్అఫీ.. కిందటి ఏడాది అక్టోబర్ నుంచిస్పెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం ఆయన తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బార్సిలోనా: డెబ్భై ఐదేళ్ల మెక్అఫీ.. అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్‌గా పేరుగాంచాడు. 80వ దశకంలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మెక్ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడాయన. అయితే టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.ఈ ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని.. కిందటి ఏడాది అక్టోబర్‌లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు. ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ‘అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. జైల్లో మగ్గేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడాడు. 2011లో తన కంపెనీని ఇంటెల్‌కు అమ్మిన మెక్అఫీ.. ఆ తర్వాత వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. లోగడ తాను 48 మంది పిల్లలకు తండ్రి చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ.. కొన్ని ఏళ్లపాటు పన్నులు చెల్లించలేదు. ఒకానొక టైంలో క్యూబా సాయంతో అమెరికా అధ్యక్ష బరిలో పోటీ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. చదవండి: ఒకప్పుడు విజేత.. ఇప్పుడు అవమానంతో వీడ్కోలు -
ముంబై హైకోర్టులో టిక్‌టాక్ మాతృసంస్థకు ఎదురుదెబ్బ
ముంబై: పన్ను ఎగవేత కేసులో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీతాలు చెల్లించడానికి తన బ్యాంకు ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బైట్‌డ్యాన్స్ విన్నపాన్ని పట్టించుకుపోగా 11 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీలోని రెండు బైట్‌డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్‌డాన్స్ యూనిట్, సింగపూర్‌లోని దాని మాతృ సంస్థ టిక్‌టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్‌డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోర్టును ఆశ్రయించింది. బైట్‌డాన్స్ ప్రభుత్వానికి 80 కోట్లు(11 మిలియన్ డాలర్లు) బాకీ ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన తర్వాత, ముంబయి హైకోర్టు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలనీ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. బైట్ డాన్స్ నాలుగు బ్లాక్ బ్యాంక్ ఖాతాలలో కేవలం 10 మిలియన్ల డాలర్ల నిధులు మాత్రమే ఉన్నట్లు కంపెనీ కోర్టుకు తెలిపింది. ఫెడరల్ టాక్స్ అథారిటీ తరఫు న్యాయవాది జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఎగవేసిన పన్ను చెల్లించేవరకు బైట్ డాన్స్ 10 మిలియన్ల డాలర్లను ఫ్రీజ్ చేయాలనీ కోర్టును కోరారు. చివరికి ఈ మొత్తాన్ని ప్రభుత్వ బ్యాంకుకు తరలించే వరకు ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణ తర్వాత గత ఏడాది ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేదించిన సంగతి తెలిసిందే. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి ప్రముఖ నటి తాప్సీని టార్గెట్ చేశారు. గతంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ తాప్సీపై నోరు పారేసుకున్న కంగనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 3 న జరిగిన ఆదాయపు పన్ను దాడుల గురించి తాప్సీ ట్వీట్ చేసిన కొన్ని గంటల తరువాత కంగనా కౌంటర్ ఎటాక్ చేశారు. ముఖ్యంగా ‘సస్తీ కాపీ’ అని రంగోలి చందేల్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన తాప్సీపై ఎదురు దాడికి దిగారు. తాప్సీ ఎలాంటి తప్పు చేయపోతే కోర్టు ద్వారా నిర్దోషిగా బయటకురావాలంటూ సవాల్ విసిరారు. (ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ) ‘‘నువ్వు ఎప్పటీకి చీప్ ఆర్టిస్ట్‌వే.. ఎందుకంటే నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి. పన్నులు ఎగ్గొట్టిన మీ రింగ్ మాస్టర్ కశ్యప్‌పై 2013లో కూడా దాడులు జరిగాయి. ప్రభుత్వ నివేదిక బయటికి వచ్చింది. నువ్వు నిర్దోషివైతే కోర్టులో నిరూపించుకో’’ అంటూ కంగనా ట్వీట్ చేశారు. కాగా తన నివాసంలో ఐటీ సోదాలపై తాప్సీ శనివారం ట్విటర్ ద్వారా స్పందించారు. గత మూడు రోజులుగా జరిగిన ఘటనలపై వరుస ట్వీట్ల ద్వారా వివరించారు. పారిస్‌లో తనకు బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం ఐటీ అధికారలు వెతికారని, కానీ అలాంటిదేమీ లేదని తేలిందని వెల్లడించారు. అలాగే రూ. 5 కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే ఆర్థికమంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తు లేదంటూ తాప్సీ ట్వీట్ చేశారు. (అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత) కాగా బాలీవుడ్లో ఐటీ దాడులు కలకలం రేపిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేత ఆరోపణలతో తాప్సీతో పాటు దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్, నిర్మాత మధువర్మ సహా పలువురి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. (అనురాగ్ కశ్యప్, తాప్సీ నివాసాలపై ఐటీ దాడులు) You will always remain sasti because you are sab rapists ka feminist... your ring master Kashyap was raided in 2013 as well for tax chori... government official’s report is out if you aren’t guilty go to court against them come clean on this ... come on sasti 👍 — Kangana Ranaut (@KanganaTeam) March 6, 2021 -
శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ అరెస్ట్
-
మీడియా కింగ్‌కు ఐటీ సెగ
సాక్షి,న్యూఢిల్లీ: మీడియా దిగ్గజానికి ఆదాయ పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ది క్వింట్ న్యూస్‌పోర్టల్, న్యూస్ 18 గ్రూపు వ్యవస్థాపకుడు రాఘవ్ బాల్ ఇంటిపై ఐటీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. దీంతోపాటు క్వింట్ కార్యాలయంపై కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేతపై ఆరోపణలతో నోయిడాలోని బాల్ నివాసం, ఆఫీసుపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. పన్ను ఎగవేత కేసు విచారణంలో ఆయన నివాసంలో వివిధ డాక్యుమెంట్లను ఇతర పత్రాలను పరిశీలిస్తున్నామనీ, ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయని ఐటీ శాఖ వెల్లడించింది. మరోవైపు ఐటీ దాడులపై రాఘవ్ బాల్ స్పందించారు. తాను ఈ ఉదయం ముంబైలో ఉండగా, డజన్ల కొద్దీ ఐటీ అధికారులు తన నివాసం క్విన్ట్ కార్యాలయంపై దాడికి దిగారని ఆందోళన వ్యక్తంచేశారు. అదే సందర్భంలో కొన్నిముఖ్యమైన డాక్యుమెంట్లను ,ఇతర పాత్రికేయ సమాచారాన్ని దుర్వినియోగం చేయొద్దని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ఫోన్ల ద్వారా తమ సమాచారాన్ని సేకరించవద్దని, అలా చేస్తే ప్రతిచర్య తప్పదన్నారు. ఈ విషయంలో ఎడిటర్స్ గిల్డ్ తమకు అండగా ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. తద్వారా భవిష్యత్‌లో ఇతర పాత్రికేయ సంస్థపై జరగబోయే ఈ తరహా దాడులను నివారించాలని బాల్ కోరారు. క్వింట్ పెట్టుబడులు పెట్టిన ది న్యూస్ మినిట్ బెంగళూరు కార్యాలయంలో కూడా ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఐటీ చట్టం సెక్షన్ 133ఏ క్రింద ఇది సర్వేమాత్రమే నని, తనిఖీలు లేదా దాడి కాదని తెలిపారు. ఆర్థిక పత్రాలు, ఆడిట్ పుస్తకాలు వారికి చూపించాలని అక్కడి సిబ్బందిని కోరారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్య రాజేంద్రన్ చెప్పారు. మండిపడ్డ ప్రశాంత్ భూషణ్ రాఘవ్ బాల్ నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియాను భయపెట్టడానికే ఈ దాడులని విమర్శించారు. ఇంతకుమందెన్నడూ లేని విధంగా ఐటీ, ఈడీ, సీబీఐ లను ప్రభుత్వ అక్రమంగా వాడుకుంటోందని మండిపడ్డారు. -
ఆప్‌కు షాక్ : మంత్రి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్‌సర్కార్‌కు మరో షాక్ తగిలింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ, రవాణా, శాఖామంత్రి కైలాశ్ గెహ్లాట్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు కలకలం రేపాయి. పన్నుల ఎగవేత ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పన్నుల ఎగవేత కేసుతో సంబంధమున్న కేసులో మంత్రి నివాసంతోపాటు దేశ రాజధాని చుట్టుపక్కల దాదాపు 16 ప్రాంతాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి, ఇతరులకు చెందిన రెండు నిర్మాణసంస్థలు పన్నులు ఎగవేసినకేసులో విచారణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. -
పన్ను ఎగవేత : హీరోయిన్‌కు భారీ జరిమానా
బీజింగ్: చైనాలోని టాప్ మోస్ట్ నటి ఫ్యాన్ బింగ్ బింగ్ (37)కు అక్కడి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పన్నుఎగవేత కేసులో భారీ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. పన్నులు ఎగవేత, బకాయిలు కింద మొత్తం 94 కోట్ల రూపాయలను జరిమానా విధించింది. ఇప్పటికే ఫ్యాన్ ప్రతినిధిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. నటిగా మోడల్‌గా పాప్ సింగర్‌గా అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఫ్యాన్ పన్ను ఎగవేత కుంభకోణంలో చిక్కుకుంది. ఎక్స్ మ్యాన్, ఐరన్‌మ్యాన్, యాష్ ఈజ్ పూరెస్ట్ వైట్ తదితర సినిమాల్లో నటనకు ప్రశంసలందుకున్న ఫ్యాన్, ఆమె కంపెనీలు భారీ ఎత్తున పన్నులను ఎగవేసినట్టుగా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ టాక్సేషన్ ఆరోపించింది. దీంతో129 మిలియన్ డాలర్లు (సుమారు 94కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ ఆదేశించింది. లేనిపక్షంలో క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమె చిత్రం 'ఎయిర్ స్ట్రైక్'లో పాత్ర చెల్లింపులపై 7.3 మిలియన్ యువాన్ (1.1 మిలియన్ డాలర్లు) పన్నులను తప్పించుకోవటానికి ఫ్యాన్ కాంట్రాక్టులను చీల్చిందనేది ప్రధాన ఆరోపణ. చైనీస్ అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఈ నోటిసును అధికారికంగా బుధవారం విడుదల చేసింది. మరోవైపు అభిమానులు, సమాజానికి క్షమాపణలు చెబుతూ చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో ఫ్యాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. చట్టాన్నిగౌరవిస్తానని స్పష్టం చేసింది. తన ప్రవర్తన, చట్టాల దుర్వినియోగంపై సిగ్గుపడుతున్నాననీ పేర్కొంది. దీనికి దేశంలోని ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుకుంటున్నానని తెలిపింది. కాగా దేశంలో లగ్జరీ ఎండార్స్మెంట్లతో, అత్యధిక పారితోషికం అందుకునే ఫ్యాన్ జూలై 1నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. అలాగే 62 మిలియన్ల ఫాలోవర్లతో చైనీస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె జులై 23నుంచి సైలెంట్‌గా ఉంది. ఈ అనుమానాస్పద అదృశ్యంపై అనేక రూమర్లు హల్చల్ చేశాయి. ఒకవైపు అమెరికా ఆశ్రయం కోసం లాస్ ఏంజెల్స్‌కి పారిపోయిందనీ, మరోవైపు చైనా అధికారుల నిర్బంధంలో ఉందంటూ పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే పరిణామాల నేపథ్యంలో ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాతలు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. 300 మిలియన్ యువాన్ల ఆదాయంతో గత ఏడాది, అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన చైనా ప్రముఖుల ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో టాప్‌లో నిలిచింది. -
పన్ను ఎగవేత కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
-
హీరోయిన్ మిస్సింగ్.. ఫ్యాన్స్‌లో కలవరం
బీజింగ్: ఫ్యాన్ బింగ్‌బింగ్.. చైనాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో విచారణ ఎదుర్కొంటున్న ఆమె.. గత కొన్నిరోజులుగా కనిపించకుండా పోవటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆమె ఎక్కడుందో అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఆరా తీస్తున్నారు. 36 ఏళ్ల ఫ్యాన్ బింగ్‌బింగ్. 2014లో వచ్చిన ఎక్స్ మెన్-డేస్ ఆఫ్ ఫ్యూఛర్ పాస్ట్ లోని బ్లింక్ పాత్ర ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యధికంగా రెమ్యూనరేషన్లు అందుకునే తారల్లో ఆమె ఒకరు. చైనా సోషల్ మీడియా సినో వైబోలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.((చైనా)లో 62 మిలియన్ ఫాలోవర్స్). అలాంటిది ఈ మే నెలలో ఆమెపై పన్నుల ఎగవేత ఆరోపణలు వెల్లువెత్తగా.. అధికారులు దర్యాప్తు చేపట్టారు. బింగ్‌ను దేశం విడిచి రావొద్దన్న ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలో అప్పటి నుంచి ఆమె షూటింగ్‌లతోపాటు బయట ఎక్కడా కూడా కనిపించటం లేదు. జూన్ 2 నుంచి బింగ్ తన అకౌంట్‌ను అప్డేట్ చేయలేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ లి చెన్ కూడా జూలై 6 నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేడు. గత నెలరోజులుగా ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఏం జరిగిందోనని ఫ్యాన్స్ అల్లలాడిపోతున్నారు. స్పందించిన మేనేజర్.. కాగా, టాక్స్ ఎగవేత ఆరోపణలను ఖండించిన ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. టీవీ ప్రజెంటర్ కూయి యంగ్యువాన్ కుట్రపన్ని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. కానీ, ఆమె ఎక్కుడున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. జూలై 1న చివరిసారిగా ఓ పిల్లల ఆస్పత్రిలో ఆమె కనిపించారని స్థానిక ఛానెల్ ఒకటి కథనాన్ని ప్రచురించింది. మరోవైపు ఆమె అదృశ్యం కథనాలపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. సెలబ్రిటీలు నేరాల్లో చిక్కుకున్నప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తుంది. గతంలో జాకీ చాన్ తనయుడు జేసీ చాన్ డ్రగ్స్ కేసులో(2014) ఆరు నెలల శిక్ష అనుభవించటంతో.. చైనా అతనిపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. -
ప్రముఖ హీరోయిన్‌పై ఛార్జీషీట్?
ప్రముఖ హీరోయిన్ అమలాపాల్‌పై ఛార్జీషీట్‌కు రంగం సిద్ధమైంది. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ట్రేషన్.. పన్ను ఎగవేత కేసులో ఆమె చిక్కులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టులో లొంగిపోయిన ఆమె.. వెంటనే బెయిల్‌పై బయటికొచ్చారు. ఈ కేసులో ఇప్పుడు ఛార్జ్‌షీట్ నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం.. పోలీస్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. మాతృభూమి కథనం ప్రకారం.. ఫేక్ అడ్రస్‌తో కోటి రూపాయల విలువ చేసే కారును పుదుచ్చేరిలో అమలాపాల్ రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో కేరళ ప్రభుత్వానికి ఆమె రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లయ్యింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో కేరళ సర్కార్ క్రైమ్ బ్రాంచ్‌ను రంగంలోకి దించించింది. ఒక్క అమలనే కాదు.. సీనియర్ నటుడు సురేష్ గోపీ, మరో హీరో పహద్ ఫజిల్ కూడా ఇదే తరహాలో పన్ను ఎగ్గొట్టారని తేలింది. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పక్కా ఆధారాలతో వారిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది. వారిలో ఫహద్ పన్ను చెల్లించటంతో అతనిపై కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, అమలా, సురేష్ గోపీ మాత్రం పన్ను చెల్లించేందుకు నిరాకరించటంతో ఈ కేసులో కఠినంగా వ్యవహారించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఛార్జ్‌షీట్ నమోదు చేయాలని క్రైమ్ బ్రాంచ్‌కు సూచించిందంట. అయితే సురేష్ గోపి రాజ్యసభ సభ్యుడు కావటంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. -
పాట పాడాడు.. జైలుశిక్ష తగ్గించారు!
న్యూయార్క్ : శిక్ష నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు వివిధ మార్గాలు అనుసరిస్తారు. కొందరు అబద్ధాలు చెప్తారు. మరికొందరు సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అమెరికన్ ర్యాప్ సింగర్ తన పాటతో జడ్జిని మెస్మరైజ్ చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూశాడు. ర్యాపర్ డీఎమ్ఎక్స్ గా ప్రసిద్ధి చెందిన ఎర్ల్ సిమ్మన్స్ పన్ను ఎగవేత కేసులో కోర్టు ముందు హాజరయ్యాడు. 1.7 మిలియన్ డాలర్ల పన్ను ఎగ్గొట్టిన సిమ్మన్స్‌ను రక్షించేందుకు అతని లాయర్ ముర్రే రిచ్మన్ కూడా సిమ్మన్స్ మాదిరిగానే కోర్టులో విచిత్రంగా ప్రవర్తించాడు. సిమ్మన్స్ జీవితంలోని కష్టనష్టాలు, అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలిపే ‘స్లిప్పిన్’ అనే హిట్ సాంగ్‌ను ప్లే చేస్తూ జడ్జిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘సిమ్మన్స్ జీవితం గురించి నేను విన్నాను. అతను చాలా కష్టాలు అనుభవించాడు. జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలదొక్కుకున్నాడు. సిమ్మన్స్ ఇప్పటికే సుమారు 30సార్లు అరెస్టయ్యాడు. కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అతనిలో మార్పు వచ్చింది. పశ్చాత్తాపంతో అతను కుంగిపోయాడు. తన 15 మంది పిల్లలకు అతడి అవసరం ఉంది. కాబట్టి అతనికి ఒక అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ వాదించాడు. ప్రాసిక్యూటర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పన్ను ఎగవేత కేసులో సిమ్మన్స్ ఐదు సంవత్సరాల శిక్ష ఎదుర్కోక తప్పదు అని వాదించాడు. వాద ప్రతివాదనలు విన్న జడ్జి ఇచ్చిన తీర్పు అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘సిమ్మన్స్ చాలా మంచివాడు. తన పాటతో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు. కానీ తనకు తానే పెద్ద శత్రువు’ అని పేర్కొంటూ.. ఏడాదిపాటు జైలు శిక్ష, 2.3 మిలియన్ డాలర్ల(రూ. 15 కోట్లు) జరిమానాతో సరిపెట్టాడు. -
అమలాపాల్‌కు బెయిల్ మంజూరు
చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పన్ను ఎగవేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసులు అమలపై కేసు నమోదు చేయడంతో.. కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అమల పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం పోలీసులకు లొంగిపోవాలని పేర్కొంది. మంగళవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అమల లొంగిపోగా.. బుధవారం రూ. లక్ష పూచీకత్తుతో బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2017లో అమలాపాల్ రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. తప్పుడు చిరునామాను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా రూ. 20 లక్షల పన్నును అమలా ఎగవేశారనేది ప్రధాన ఆరోపణ. -
లియోనల్ మెస్సీకి జైలు శిక్ష
మ్యాడ్రిడ్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి జైలు శిక్ష పడింది. పన్ను ఎగవేత మోసం కేసులో 21నెలల జైలు శిక్ష విధించడంతోపాటు దాదాపు రూ.15 కోట్లు జరిమానా విధిస్తూ స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2016లోనే జూలైలో మెస్సీకి జైలు శిక్ష పడింది. అయితే, తొలిసారి చేసిన అహింసతో కూడిన నేరానికి రెండేళ్ల కంటే తక్కువ శిక్షపడితే అది సాధారణంగానే సస్పెండ్ అవుతుంది. పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్‌లు అప్పీలు చేయగా సుప్రీంకోర్టు కూడా బార్సిలోనా కోర్టును సమర్థించింది. -
మెస్సీకి జైలు శిక్ష
♦ పన్ను ఎగవేత కేసులో 21 నెలలు విధించిన బార్సిలోనా కోర్టు ♦ ఉన్నత న్యాయస్థానం రద్దు చేసే అవకాశం! బార్సిలోనా : పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో ఇద్దరికి 21 నెలల జైలు శిక్షతో పాటు మెస్సీకి 2.09 మిలియన్ యూరోలు (రూ. 15 కోట్లు), జార్జ్‌కు 1.6 మిలియన్ యూరోలు (రూ. 12 కోట్లు) జరిమానా విధించింది. అయితే స్పెయిన్‌లో అహింస నేరాలకు సంబంధించిన కేసులో రెండేళ్ల కంటే తక్కువ శిక్ష పడితే వాటిని ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణం. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను కూడా స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్‌లు అప్పీలు చేయనున్నారు. 2007-09 వరకు ఇమేజ్ రైట్స్ (చిత్రం వాడుకున్నందుకు) వల్ల తనకు వచ్చిన ఆదాయం 4.16 మిలియన్ యూరో (రూ. 31 కోట్లు)లకు పన్ను చెల్లించలేదని కోర్టు తెల్చింది. బెలిజ్, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఉరుగ్వేలోని పలు కంపెనీలను ఉపయోగించి తండ్రీకొడుకులు ఈ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది. ఇమేజ్ రైట్స్‌తో పాటు డానోన్, అడిడాస్, పెప్సీ కోలా, ప్రోక్టర్ అండ్ గాంబ్లీ (కువైట్ ఫుడ్ కంపెనీ) వంటి కంపెనీలతో ఉన్న ఒప్పందాలను కూడా మెస్సీ దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే నాలుగు రోజుల విచారణలో మెస్సీపై మూడు అభియోగాలు నమోదు చేశారు. చిన్నప్పట్నించి తన ఆర్థిక లావాదేవీలను తండ్రి జార్జ్ చూస్తున్నారని, ఆయనపై నమ్మకంతోనే ఏదీ పట్టించుకోలేదని మెస్సీ కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని మెస్సీ తరఫు న్యాయవాదులు కూడా వినిపించారు. ఆదాయ వ్యయాల్లో మెస్సీ కలుగజేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ మెస్సీకి తెలుసని, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని స్టేట్ అటార్నీ (ట్యాక్స్) మరియో మాజా వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. 2013 ఆగస్టులో కూడా ఓ పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న మెస్సీ, జార్జ్... దర్యాప్తు తర్వాత స్వచ్ఛందంగా 5 మిలియన్ యూరోలు చెల్లించారు.