ముంబై: పన్ను ఎగవేత కేసులో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీతాలు చెల్లించడానికి తన బ్యాంకు ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బైట్‌డ్యాన్స్ విన్నపాన్ని పట్టించుకుపోగా 11 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలోని రెండు బైట్‌డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్‌డాన్స్ యూనిట్, సింగపూర్‌లోని దాని మాతృ సంస్థ టిక్‌టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్‌లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్‌డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోర్టును ఆశ్రయించింది.
బైట్‌డాన్స్ ప్రభుత్వానికి 80 కోట్లు(11 మిలియన్ డాలర్లు) బాకీ ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన తర్వాత, ముంబయి హైకోర్టు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలనీ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. బైట్ డాన్స్ నాలుగు బ్లాక్ బ్యాంక్ ఖాతాలలో కేవలం 10 మిలియన్ల డాలర్ల నిధులు మాత్రమే ఉన్నట్లు కంపెనీ కోర్టుకు తెలిపింది. ఫెడరల్ టాక్స్ అథారిటీ తరఫు న్యాయవాది జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఎగవేసిన పన్ను చెల్లించేవరకు బైట్ డాన్స్ 10 మిలియన్ల డాలర్లను ఫ్రీజ్ చేయాలనీ కోర్టును కోరారు. చివరికి ఈ మొత్తాన్ని ప్రభుత్వ బ్యాంకుకు తరలించే వరకు ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణ తర్వాత గత ఏడాది ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment