mumbai highcourt
-
ప్రొఫెసర్ .సాయిబాబాపై కుట్ర కేసు కొట్టేసిన బాంబే హైకోర్టు
-
ఆర్యన్ బెయిల్ విచారణ వాయిదా
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్ రద్దైంది. తాజాగా మంగళవారం మరోసారి ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆర్యన్‌ను అరెస్టు చేయడంలో అసలు అర్థం లేదని, ఆర్యన్ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఆర్యన్ వాట్సప్ చాట్ అంతా గతేడాదివేనని, తాజా కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదని తెలిపారు. అంతేగాక క్రూయిజ్ షిప్ దాడిలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని, ప్రదీప్ గబ్బా ఆహ్వానం మేరకే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఆర్యన్‌కు ఇప్పటి వరకు మెడికల్ టెస్ట్ చేయలేదని, ఇది ప్రీప్లాన్డ్‌గా జరిగిన అరెస్ట్ అని ముకుల్ రోహత్గీ వాదించారు. ఇదిలా ఉండే ఆర్యన్‌కు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఎన్సీబీ అధికారులు ముంబై హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని, అతడికి డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని ఎన్సీబీ పిటిషన్లో పేర్కొంది. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ఎన్సీబీ తెలిపింది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు ఆర్యన్‌కు బెయిల్ వస్తుందా? లేదా? తేలనుంది. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా తనయుడు.. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. -
ముంబై హైకోర్టులో టిక్‌టాక్ మాతృసంస్థకు ఎదురుదెబ్బ
ముంబై: పన్ను ఎగవేత కేసులో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీతాలు చెల్లించడానికి తన బ్యాంకు ఖాతాలను అన్‌బ్లాక్ చేయాలని కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు బైట్‌డ్యాన్స్ విన్నపాన్ని పట్టించుకుపోగా 11 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. మార్చి మధ్యలో సిటీబ్యాంక్, హెచ్ఎస్బీసీలోని రెండు బైట్‌డాన్స్ ఇండియా బ్యాంక్ ఖాతాలను భారత బైట్‌డాన్స్ యూనిట్, సింగపూర్‌లోని దాని మాతృ సంస్థ టిక్‌టాక్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఆన్లైన్ ప్రకటనల వ్యవహారాల్లో కొన్ని పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు బైట్‌డ్యాన్స్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోర్టును ఆశ్రయించింది. బైట్‌డాన్స్ ప్రభుత్వానికి 80 కోట్లు(11 మిలియన్ డాలర్లు) బాకీ ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పిన తర్వాత, ముంబయి హైకోర్టు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలనీ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. బైట్ డాన్స్ నాలుగు బ్లాక్ బ్యాంక్ ఖాతాలలో కేవలం 10 మిలియన్ల డాలర్ల నిధులు మాత్రమే ఉన్నట్లు కంపెనీ కోర్టుకు తెలిపింది. ఫెడరల్ టాక్స్ అథారిటీ తరఫు న్యాయవాది జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఎగవేసిన పన్ను చెల్లించేవరకు బైట్ డాన్స్ 10 మిలియన్ల డాలర్లను ఫ్రీజ్ చేయాలనీ కోర్టును కోరారు. చివరికి ఈ మొత్తాన్ని ప్రభుత్వ బ్యాంకుకు తరలించే వరకు ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణ తర్వాత గత ఏడాది ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేదించిన సంగతి తెలిసిందే. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
అతను మా నాన్న కొడుకు కాదు: జయ్ దేవ్ ఠాక్రే
ముంబై: ఆస్తి కోసం కోర్టుకెక్కిన బాల్ ఠాక్రే కుమారుడు జయ్ దేవ్ ఠాక్రే కేసును గురువారం ముంబై హైకోర్టును మరోసారి విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నాయకుడు బాల్ ఠాక్రే, ఆయన మాజీ భార్య స్మిత తనయుడైన జయ్ దేవ్ ఠాక్రే, ఐశ్వర్య ఠాక్రే బాల్ ఠాక్రే కుమారుడు కాదంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో కొంతభాగాన్ని మాత్రమే ధర్మాసనం మీడియాకు అనుమతినిచ్చింది. మిగిలిన విచారణను జస్టిస్ పటేల్, ఇరువైపులా లాయర్లతో కలిసి సమావేశమయ్యారు. తుది తీర్పు వెలువడే వరకు చర్చకు సంబంధించిన వివరాలను మీడియాకు అందుబాటులో ఉండవని ప్రకటించారు. కేసు విచారణలో భాగంగా ప్రస్తుత శివసేన అధ్యక్షుడు, ఉద్ధవ్ ఠాక్రే తరఫు లాయర్ రోహిత్ కపాడియా జయ్ దేవ్ ను కొన్ని ప్రశ్నలు వేశారు. జయ్ దేవ్ కు ఆస్తిపై ఎటువంటి హక్కూలేదని, తన ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బాల్ ఠాక్రే వీలునామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఐశ్వర్యకు ఠాక్రే నుంచి వారసత్వ సంపద దక్కడంపై జయ్ దేవ్ కోర్టుకెక్కారు. బాంద్రాలోని మఠోశ్రీ బాల్ ఠాక్రే నివాసంలో 2004కు ముందు రెండో అంతస్తులో తాను నివసించినట్లు జయ్ దేవ్ తెలిపారు. మొదటి అంతస్తులో ఎవరు నివసించేవారు? అని లాయరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎప్పుడూ తలుపుల మూసేసి ఉండేవని, అప్పుడప్పుడు తెరచి ఉండేవని చెప్పారు. బాల్ ఠాక్రేను ఈ విషయం గురించి అడుగగా ఐశ్వర్య ఉంటున్నాడని చెప్పారని తెలిపారు. మరి ఐశ్వర్యను బాల్ ఠాక్రే తన తనయుడని మీకు చెప్పారా? అని లాయరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన జయ్ దేవ్ ఆయన అలా చెప్పలేదని తెలిపారు. ఐశ్వర్యకు సంబంధించిన వివరాలను తాను సేకరించాలని ప్రయత్నించానని కానీ అవకాశం రాలేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి గత విచారణల్లో 1999లో తల్లి స్మితతో మనస్పర్దలు రావడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. 2004లో ఠాక్రేతో విడాకులు తీసుకునేంత వరకూ స్మిత మఠోశ్రీలోనే ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. 1999-2004 మధ్య కాలంలో అప్పుడప్పుడు తన తండ్రి ఠాక్రేను కలిసేందుకు వెళ్లి రాత్రికి తిరిగి తన ఫ్లాట్ కు చేరుకునేవారని తెలిపారు. 2012 నవంబర్ లో ఠాక్రే మరణించే ఒక నెల ముందు వరకూ ఆయన్ను కలవడం ఆపలేదని చెప్పారు. -
అసలు నువ్వు తండ్రిగా పనికిరావు!
మాజీ భార్యకు ఎనిమిదేళ్ల కూతురిని చూపించనందుకు ముంబైవాసికి మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా పడింది. ఈ మేరకు ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ మండిపడింది. షాహిద్ పలావ్కర్ (42) అనే వ్యక్తి ఇంతకుముందు తన భార్యకు పోస్టు ద్వారా విడాకులు ఇచ్చాడు. అయితే తన కూతురిని భార్యకు చూపించకుండా దాచిపెడుతున్నట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో అతడి భార్య హైకోర్టును ఆశ్రయించింది. దాంతో షాహిద్ అసలు తండ్రిగానే పనికిరాడంటూ జస్టిస్ రేఖ మండిపడ్డారు. తన బావమరిది తన కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడంటూ అతడు చేసిన ఆరోపణలు కూడా తప్పని తేలింది. కస్టడీ అంశంపై ఫ్యామిలీ కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు కూతురు కూడా తల్లివద్దే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వాస్తవాలు చాలా దిగ్భ్రాంతికరంగా కనిపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూతురిని ఆ తండ్రి దగ్గర ఉంచడం ప్రమాదకరంగా మారుతుందని జస్టిస్ రేఖ అన్నారు. తండ్రి పనికిమాలినవాడని తేలడంతో, ఇక కూతురి బాధ్యతను తక్షణం తల్లికి అప్పగించాలని ఆమె ఆదేశించారు. కూతురిని తల్లికి చూపించకుండా ఉండేందుకు రకరకాల కుట్రలు పన్నాడని, చివరకు చిన్నారిని కూడా ఆ కుట్రలో ఒక పావుగా వాడుకున్నాడని అన్నారు. ఇందుకు గాను మూడు నెలల జైలుశిక్ష విధించి, భార్యకు రూ. 5 లక్షల పరిహారం కట్టాలని తీర్పు చెప్పారు.