డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్ రద్దైంది. తాజాగా మంగళవారం మరోసారి ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఆర్యన్‌ను అరెస్టు చేయడంలో అసలు అర్థం లేదని, ఆర్యన్ ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఆర్యన్ వాట్సప్ చాట్ అంతా గతేడాదివేనని, తాజా కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదని తెలిపారు. అంతేగాక క్రూయిజ్ షిప్ దాడిలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని, ప్రదీప్ గబ్బా ఆహ్వానం మేరకే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఆర్యన్‌కు ఇప్పటి వరకు మెడికల్ టెస్ట్ చేయలేదని, ఇది ప్రీప్లాన్డ్‌గా జరిగిన అరెస్ట్ అని ముకుల్ రోహత్గీ వాదించారు.
ఇదిలా ఉండే ఆర్యన్‌కు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌సీబీ అధికారులు ముంబై హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని, అతడికి డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని ఎన్‌సీబీ పిటిషన్‌లో పేర్కొంది. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ఎన్‌సీబీ తెలిపింది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు ఆర్యన్‌కు బెయిల్ వస్తుందా? లేదా? తేలనుంది. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్‌షా తనయుడు.. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment