మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్ లభించిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీట్ సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో ఆర్యన్‌కు ఖాన్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఎన్‌సీబీ పొందుపరిచింది.
చదవండి: ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్ ఖాన్ తమ విచారణలో తెలిపాడని ఎన్‌సీబీ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టు చేసిన 20 మంది 14 మందిపై ఎన్‌సీబీ శుక్రవారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విధితమే. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్‌సీబీకి ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది.
చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో
ఈ చార్జిషీట్‌లో ఏం చెబుతుంటే.. ‘ఆ సమయంలో తాను నిద్ర సమస్యలతో బాధపడ్డానని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని ఇంటర్నెట్‌లో పలు కథనాలు చదివినట్లు వాంగ్ములమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన ఫోన్‌లో దొరికిన గంజాయి వాట్సప్ డ్రగ్ చాట్ తానే చేశానని, దోఖా అనే కోడ్‌వర్డ్‌తో గంజాయి కొనుగోలు కోసం ఆచిత్‌తో(ఈ కేసులో మరో నిందితుడు) చాట్ చేశానని ఆర్యన్ ఒప్పుకున్నాడు. అయితే తన ఫోన్‌ను అధికారికంగా స్వాధినం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవి ప్రస్తుత కేసుతో అతనికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్‌సీబీ తమ అభియోగపత్రంలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment