AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు | Vijayawada Court Remanded Prattipati Sharat For 14 Days In Charges Of GST Evasion - Sakshi
Sakshi News home page

AP: ప్రత్తిపాటి కుమారుడికి రిమాండ్.. జైలుకు తరలింపు

Published Fri, Mar 1 2024 9:22 AM | Last Updated on Fri, Mar 1 2024 11:26 AM

Vijayawada Court Remanded Prattipati Sharat For 14 Days - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి,ఎన్టీఆర్ జిల్లా : జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు శరత్‌ను శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గురువారం రాత్రి అరెస్టు అనంతరం శరత్‌ను పోలీసులు విజయవాడలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

శరత్‌ రిమాండ్ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి.  ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శరత్‌ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే తరహా కేసు తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్.ఐ.ఆర్ లు పెట్టడం నిబంధనలకు విరుద్దమని తెలిపారు.

కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో గురువారం రాత్రి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది ఉన్నారు. 

ఇదీ చదవండి.. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement