సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది.
మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా.
ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది.
ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment