adibatla police
-
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా. ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు. -
కిడ్నాప్ కథా చిత్రమ్ : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ముమ్మర దర్యాప్తు
-
దొంగ మొగుడు
ఇబ్రహీంపట్నం రూరల్: హైదరాబాద్‌కు మకాం మార్చాలని ఏకంగా తన సొంత ఇంట్లోనే దొంగతనం నాటకం ఆడి చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడో ఘరానా నేరగాడు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం స్థానిక ఠాణాలో కేసు వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో వెలుపు ఈడ్విన్ మోజెస్ తన భార్య రాణి, ఇద్దరు పిల్లలతో కలసి నివాసముంటున్నాడు. మోజెస్ రౌడీషీటర్. అతనిపై పలు ఠాణాల్లో హత్యలు, బెదిరింపులు, ఇతర కేసులు నమోదయ్యాయి. నాదర్గుల్లో నివాసం ఉండటంతో తనకు హాని ఉందని, ఇక్కడి నుంచి మకాం హైదరాబాద్‌కు మార్చుదామని పలు మార్లు భార్య రాణికి చెప్పినా ఆమె వినిపించు కోలేదు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎలాగైనా తన భార్యను భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయాలని మోజెస్ పథకం పన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో భార్యాపిల్లలను ఆటోలో ఎక్కించి మిథానికి పంపించాడు. అనంతరం మోజెస్ తన కారు డ్రైవర్ బోడ నవీన్‌ను పిలిపించుకున్నాడు. ఇంటి వెనుకవైపు నుంచి లోపలికి వెళ్లారు. బీరువా తాళాలు పగులగొట్టి పది తులాల బంగారు నగలు తీసి ఇంట్లోనే దుస్తుల బ్యాగులో తన భార్య రాణికి తెలియకుండా దాచిపెట్టాడు. రూ.2.88 లక్షలను నవీన్‌కు ఇచ్చి తన ఇంట్లో దాచుకోమని చెప్పాడు. ఇంటి ముందు భాగంలో ఉన్న ద్వారం తలుపులు లోపలి నుంచి పెట్టి వెనుక వైపు నుంచి బయటకు వచ్చారు. తర్వాత మోజెస్.. నవీన్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లాడు. ఫంక్షన్ పూర్తయిన తర్వాత భార్యాపిల్లలను ఆటోలో తిరిగి ఇంటికి పంపించి తర్వాత అతడు వచ్చాడు. రాణి ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి గడియ వేసి ఉం ది. వెనుకభాగం నుంచి లోపలికి వెళ్లి చూసి చోరీ జరిగిందని గుర్తించింది. మోజెస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. భర్త సూచన మేరకు రాణి ఆదిభట్ల ఠాణాలో అదేరోజు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. స్థానికులతో ఆరా తీసి సాంకేతిక ఆధారాల ద్వారా చోరీ కేసులో మోజెస్ సూత్రధారి అని గుర్తించారు. సోమవారం స్థానిక ఎంవీఎస్ఆర్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోజెస్ బైకుపై వెళ్తుండగా పట్టుకున్నారు. అందులోంచి 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా చోరీ నేరం అంగీకరించాడు. 10 తులాల బంగా రం, రూ.2.88 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోజెస్తోపాటు నవీన్‌పై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిం దితులను 24 గంటల్లో పట్టుకున్న ఆదిబట్ల సీఐ నరేందర్‌ను ఈ సందర్భంగా డీసీపీ అభినందిం చారు. ఎస్ఐ సురేష్‌బాబు, క్రైం పోలీసులకు నగదు రివార్డు అందజేశారు. పట్టుబడిన ఆభరణాలతో నిందితులు -
బడిలో పడ్డ దొంగలు
ఇబ్రహీంపట్నం రూరల్: వేసవి సెలవుల్లో భాగంగా తాళాలు వేసి ఉన్న పాఠశాలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టిన కార్యాలయం లోపల ఉన్న కంప్యూటర్, క్రీడా పరికరాలు, వంట సామాను ఎత్తుకుపోయారు. బుధవారం నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేయడంతో.... ఇంచార్జ్ కిషన్ నాయక్ ఉదయం పాఠశాలకు వచ్చారు. తాళాలు, తలుపులు పగులగొట్టి కనిపించాయి. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించగా ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
రింగురోడ్డు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : ఆదిభట్ల మండలం బెంగుళూరు గేటు రింగు రోడ్డు సమీపంలో బోజ్యానాయక్ (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం మనివారిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం నగరంలో చిట్టీల కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని... బోజ్యానాయిక్ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.