
చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పన్ను ఎగవేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసులు అమలపై కేసు నమోదు చేయడంతో.. కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
అమల పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం పోలీసులకు లొంగిపోవాలని పేర్కొంది. మంగళవారం తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అమల లొంగిపోగా.. బుధవారం రూ. లక్ష పూచీకత్తుతో బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
2017లో అమలాపాల్ రూ. కోటి విలువజేసే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. తప్పుడు చిరునామాను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా రూ. 20 లక్షల పన్నును అమలా ఎగవేశారనేది ప్రధాన ఆరోపణ.