మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు.
ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్‌మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment