tax fraud
-
జైలుశిక్ష తగ్గించేందుకు రూ.6 కోట్ల ఒప్పందం చేసుకున్న పాప్‌సింగర్
పాప్ స్టార్ షకీరా పన్ను ఎగవేతపై నమోదైన కేసు విచారణలో భాగంగా స్పెయిన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దానివల్ల తన జైలు శిక్ష తగ్గించుకున్నట్లు తెలిసింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్ ప్రభుత్వానికి రూ.131 కోట్లు పన్ను చెల్లించలేదని షకీరాపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన తర్వాత షకీరాకు 8 ఏళ్ల 2 నెలలు జైలు శిక్షతోపాటు రూ.216 కోట్లు జరిమానా విధించారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన కోర్టు విచారణలో భాగంగా అధికారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్పానిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలో విఫలం అయినట్లు ఆమె ఒప్పుకున్నారు. మూడేళ్లు జైలు శిక్ష, రూ.6.3 కోట్లు జరిమానా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. షకీరా కఠిన నిర్ణయం తీసుకున్నారని, తన కెరియర్, పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ ఒప్పందం చేసుకున్నారని ఆమె తరఫు వాదించిన న్యాయవాద సంస్థ మిరియం కంపెనీ తెలిపింది. ఆమె తరఫు వాదించేలా అన్ని అంశాలను సిద్ధం చేశామని, కానీ తను అమాయకత్వం వల్ల అధికారులతో ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 2012-2014 వరకు తను బహమాస్‌లో నివాసం ఉన్నట్లు, పన్ను ప్రయోజనాల కోసం తనను స్పానిష్ నివాసిగా పరిగణించకూడదని షకీరా అభ్యర్థించినట్లు తెలిసింది. కానీ స్పానిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. షకీరా 2012లో 242 రోజులు, 2013లో 212 రోజులు, 2014లో 243 రోజులు స్పెయిన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్ చట్టంలోని నియమాల ప్రకారం 183 రోజుల కంటే ఎక్కువ కాలం దేశంలో గడిపిన వ్యక్తులు తమ ఆదాయాలను ప్రకటించి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షకీరా చాలాకాలం స్పెయిన్‌లో నివసించిందని, తన ఆదాయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులు చెప్పారు. -
సహచర మంత్రి జహావిపై సునాక్ వేటు
లండన్: పన్నుల వివాదంలో చిక్కుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్, సహచర కేబినెట్ మంత్రి నదీమ్ జహావిని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మంత్రి మండలి నుంచి తొలగించారు. జహావి పన్ను వ్యవహారాల్లో మంత్రులకుండే నియమనిబంధనల్ని ఉల్లంఘించారంటూ విచారణలో తేలడంతో సునాక్ ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం జహావి శాఖ లేని మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. ప్రభుత్వం నియమించిన స్వతంత్ర విచారణ నివేదికను కూడా సునాక్ విడుదల చేశారు. ఇరాక్‌లో జన్మించిన జహావి ఆర్థిక మంత్రిగా ఉండగా అంతకు ముందు కట్టని పన్నులకు పెనాల్టీగా 50 లక్షల పౌండ్లు చెల్లించారు. ఈ విషయాన్ని దాయడం మినీస్టిరియల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని విచారణ నివేదిక తేల్చి చెప్పింది. -
Shakira Tax Fraud Case:మ్యూజిక్ క్వీన్ షకీరాకు జైలు శిక్ష ముప్పు
మాడ్రిడ్: కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే కచ్చితంగా జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012– 2014 మధ్య స్పెయిన్ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల మేర పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెటిల్మెంట్ చేసుకోవాలన్న లాయర్ల సూచనను షకీరా తిరస్కరించారు. షకీరా పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేర్చారని ఆమె తరపు ప్రజా సంబంధాల సిబ్బంది వెల్లడించారు. -
అమెరికాలో కేసు.. కోర్టు బయట పరిష్కారం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో విదేశీ ఉద్యోగులను తప్పుగా వర్గీకరించి చూపడం, పన్నుపరమైన మోసాలకు పాల్పడటం తదితర ఆరోపణలకు సంబంధించిన కేసును ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోర్టు వెలుపల పరిష్కరించుకోనుంది. ఇందుకు సంబంధించి కాలిఫోర్నియా రాష్ట్రానికి 8,00,000 డాలర్లు (సుమారు రూ.5.6 కోట్లు) చెల్లించనుంది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెరా ఈ విషయాలు తెలిపారు. ‘తక్కువ జీతాలతో పనిచేయించుకునేందుకు, పన్నులు ఎగ్గొట్టేందుకు ఇన్ఫోసిస్ తప్పుడు వీసాలపై ఉద్యోగులను అమెరికాకు తీసుకొచ్చింది. కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవనడానికి ఈ సెటిల్మెంట్ ఒక నిదర్శనం’ అని పేర్కొన్నారు. 2006–2017 మధ్య కాలంలో అమెరికాలో 500 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ హెచ్–1బీ వీసాలపై కాకుండా బీ–1 వీసాలపై పనిచేయించుకుందన్న ప్రజా వేగు ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఇలాంటి తప్పుడు వర్గీకరణ వల్ల ఇన్ఫోసిస్.. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరుద్యోగ బీమా, వైకల్య బీమా, ఉద్యోగుల శిక్షణ పన్నులు చెల్లించకుండా తప్పించుకుందని ఆరోపణలున్నాయి. సాధారణంగా హెచ్–1బీ వీసాలపై పనిచేసే సిబ్బందికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, తమపై ఆరోపణలను ఇన్ఫోసిస్ తోసిపుచ్చింది. సుదీర్ఘంగా 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే పరిష్కరించుకుంటున్నట్లు వివరణనిచ్చింది. తప్పుడు పత్రాలు సమర్పించిందన్న ఆరోపణలను సెటిల్ చేసుకునేందుకు 2017లో న్యూయార్క్‌కు ఇన్ఫోసిస్ 1 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
తండ్రితో సహా కోర్టుకు ఫుట్ బాల్ ప్లేయర్
బార్సిలోనా: అర్జెంటీనా ఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కోర్టులో హాజరయ్యారు. పన్ను చెల్లింపుల్లో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించి ఆయన కోర్టుకు వచ్చారు. తన తండ్రి జోర్గ్, సోదరుడితో కలసి కెటలాన్ క్లబ్ నుంచి కారులో బార్సిలోనాలోని కోర్టుకు హాజరయ్యారు. 2007 నుంచి 2009 వరకు తన పేరిట ఉన్న ఇమేజ్ హక్కులకు సంబంధించిన ఆస్తుల విషయంలో మొత్తం 4.1 మిలియన్ డాలర్ల చెల్లించకుండా మోసం చేశారని, ఈ కేసుకు సంబంధించి 22 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పానిష్ కోర్టు చెప్పింది. అయితే, మెస్సీ ఆయన తండ్రిపై తొలుత కోర్టులో పిటిషన్ నమోదైనప్పటికీ ఆ డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేందుకు మెస్సీ తండ్రి జోర్గ్ ఒప్పుకోవడంతో కేసును మూసివేయాలని కోరారు. బహుషా ఆ కేసు మూసివేతకు సంబంధించి వారు కోర్టుకు వచ్చి ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది. ఎందుకంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి తండ్రి కొడుకులు కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. -
రూ. 12వేల కోట్ల పన్ను ఎగ్గొట్టిన గూగుల్?
► ఫ్రాన్స్‌లోని సంస్థ కార్యాలయంలో పోలీసు సోదాలు ► ఆదాయాన్ని వేరే దేశాలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ప్యారిస్ పన్నుల ఎగవేత కుంభకోణానికి సంబంధించిన కేసులో గూగుల్ కార్యాలయంలో ఫ్రెంచి పోలీసులు సోదాలు చేశారు. ఫ్రాన్సులో గూగుల్ సంస్థ దాదాపు రూ. 12వేల కోట్ల మేర పన్నులు చెల్లించలేదని అధికారులు భావిస్తున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను అత్యంత సంక్లిష్టంగా మార్చుకుని, ఒక దేశంలో ఆదాయాలను వేరే దేశంలో వచ్చినట్లు చూపించడం ద్వారా చాలా తక్కువ మొత్తంలోనే పన్నులు కడుతున్న పలు బహుళజాతి కంపెనీలలో గూగుల్ కూడా ఒకటన్నది అక్కడి అధికారుల ఆరోపణ. యూరప్‌లో గూగుల్ ప్రధాన కార్యాలయం ఐర్లండ్‌లో ఉంది. అక్కడ కార్పొరేట్ పన్నురేట్లు చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణం. ఫ్రాన్సు కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30) సుమారు వంద మంది అధికారులు గూగుల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇంతకుముందు 2011లో కూడా ఒకసారి ఫ్రెంచి అధికారులు గూగుల్ కార్యాలయంపై దాడి చేశారు. అప్పట్లో ఐర్లండ్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. జనవరిలో బ్రిటన్‌కు రూ. 1286 కోట్ల పన్ను బకాయిలు చెల్లించేందుకు గూగుల్ అంగీకరించింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే, బ్రిటన్ కంటే ఫ్రాన్సులో ఆ సంస్థ పెట్టుబడులు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు ఫ్రాన్స్ మంత్రి మైఖేల్ సాపిన్ ఫిబ్రవరిలో వ్యాఖ్యానించారు.