‘ఈవీఎంలను కాదు.. మనల్ని చెక్ చేసుకుందాం’
అయితే, దీనిపై ఆప్ నేత ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజును ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రధాని మోదీ హవా ఉన్నా లేకపోయినా ప్రజలు మనకు ఓటు వేయలేదని స్పష్టమైంది. 2015 పొందిన విజయంతోపోలిస్తే అతి తక్కువ సీట్లు మాత్రమే వచ్చాయని తేటతెల్లమైంది. ఫలితాలను ఒక్క ఈవీఎంలను అపఖ్యాతి చేస్తూ మాత్రమే చెప్పలేము’ అని ఆయన అన్నారు. అయితే, ఏదేమైన ఆత్మవిమర్శ అత్యవసరం అని ఇది తన వ్యక్తి గత అభిప్రాయం అని చెప్పారు. మరోపక్క, ఢిల్లీలో బీజేపీ హవా ఉందని ఒప్పుకున్నారు. అయితే, ఇదే పార్టీకి చెందిన కార్మిక మంత్రి మాత్రం మోదీ హవా లేదని ఈవీఎంల హవా ఉందంటూ ఆరోపించారు.